
సాక్షి, విశాఖ: విశాఖలో మరోసారి ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్ విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.
వివరాల ప్రకారం.. విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్‌లో భాగంగా సీనయర్లు, జూనియర్లు తన్నుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో, ర్యాగింగ్ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ విషయమై బీఎన్‌ఎస్ 324 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment