శ్రీకాకుళం: ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఫిర్యాదు పై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మెకానికల్ విభాగానికి చెందిన పవన్ మణికంఠ, నాగేశ్వరరావు, గణపతిరావు అనే విద్యార్థులు అదే విభాగానికి చెందిన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.