స్మగ్లింగ్ చేస్తుండగా పట్టివేత
పట్నా: అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియంను గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారినుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ.850 కోట్ల దాకా ఉంటుందని గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు!
గ్రాము ధర రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. ‘‘పక్కా సమాచారం మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ విభాగం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్టీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యూపీ, బిహార్ సరిహద్దులో మోటార్‌బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోరి్నయం దొరికింది’’ అని తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు.
ఎందుకింత ఖరీదు?
కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది ప్రకృతిలో సహజంగా లభించదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో తయారు చేయాల్సి ఉంటుంది. ఎంతగానో శ్రమించిన మీదట అత్యంత స్వల్ప పరిమాణాల్లో మాత్రమే తయారవుతుంది! దీన్ని తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి! ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో. 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థాంప్సన్, కెనెత్ స్ట్రీట్ జూనియర్, అల్బర్ట్ గిరోసో, గ్లెన్ టి.సీబోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధారి్మక పదార్థాన్ని భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు, నీటి పొరలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment