పట్నా : మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. బుధవారం రాత్రి సమయంలో పోలీసు తనిఖీ నిర్వహిస్తుండగా బక్సార్ ఎమ్మెల్యే సంజయ్ తివారి కారులో మద్యం బాటిల్స్ లభించాయి. దీనిపై పోలీసులు ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మద్యం సరఫరా చేస్తున్నందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి తాను సహాయం చేస్తున్నా అన్నారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయాలు గత నెల నుంచి పేదలకు పంచుతున్నానని పేర్కొన్నారు. (కరోనా : చివరి చూపైనా దక్కలేదు)
అయితే మద్యం బాటిల్స్ తన వాహనంలోకి ఎలా వచ్చాయో తనకు తెలీదని సజయ్ చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాహనం సీజ్ చేయడం పట్ల స్థానిక నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కుట్రపూరితంగానే వాహనం సీజ్ చేశారని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment