పాట్నా : బిహార్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించాలని నితిష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 6 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేస్తాయి. రైలు, విమాన సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయి. (వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ)
అయితే అన్ని విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, బస్సు సర్వీసులు, పార్క్‌లు, జిమ్ములు, ఇంకా మూసే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా బిహార్‌లో కరోనా కేసుల దృష్ట్యా జూలై 31 నుంచి ఆగష్టు 16 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు నిన్నటితో ముగియడంతో లాక్‌డౌన్‌ను మరో 20 రోజులపాటు పొడిగించారు. ఇక రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 3,814 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,03,283కి చేరింది. (ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..)
Comments
Please login to add a commentAdd a comment