సాక్షి, పాట్నా: కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బిహార్ మరోసారి లాక్‌డౌన్ విధించడానికి సిద్ధమవుతోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతోంది. సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ మాట్లాడుతూ.. 'సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు.పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉందని' తెలిపారు.
అయితే ఇప్పటికే బెంగళూరు, పూణే నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించగా.. యూపీలో వారాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. కాగా రాష్ట్రంలో కొత్తగా 1,116 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,421కు చేరుకున్నాయి. ( భారత్: 9 లక్షలు దాటిన కరోనా కేసులు )
Comments
Please login to add a commentAdd a comment