
కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడని తెలిసి రోదిస్తున్న ఈ వలసకార్మికుని పేరు రామ్‌పుకార్ పండిట్. బిహార్‌లోని బెగూసరాయ్ ఈయన సొంతూరు. కొడుకును చూసేందుకు 1,200 కి.మీ.ల దూరమున్న సొంతూరుకు కాలినడకన బయల్దేరగా ఢిల్లీ సరిహద్దుల్లోని ఓ బ్రిడ్జిపై పోలీసులు ఆపేశారు. ఆకలిదప్పులకు సహిస్తూ మూడ్రోజులపాటు అక్కడే ఉండిపోయాడు. కొడుకు ఆఖరి చూపునకు నోచుకోకుండానే చనిపోయినట్లు తెలిసింది. వలస కార్మికుల వేదనకు అద్దంపడుతున్న ఇటీవలి ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment