Sundays Complete Lockdown In Tamil Nadu, Check Timings Details Inside - Sakshi
Sakshi News home page

Tamilnadu Sunday Lockdown: శనివారం రాత్రి నుంచే పూర్తి లాక్‌డౌన్‌

Published Fri, Jan 21 2022 5:58 PM | Last Updated on Fri, Jan 21 2022 7:39 PM

Tamil Nadu Government Imposed Complete lockdown On Sundays - Sakshi

కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం జనవరి 23న పూర్తి లాక్‌డౌన్‌ విధించింది. అయితే ఈ లాక్‌డౌన్‌ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే తమిళనాడు ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జనవరి 9 నుంచి ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతేగాక మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది. అయితే పాల దుకాణాలు ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, సరుకు రవాణ, పెట్రోల్‌ బంక్‌లు అనుమతించింది. కాగా  రెస్టారెంట్‌లు, హోటళ్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు టేకౌట్ సేవలను అందిస్తాయని తెలిపింది. ఈ మేరకు తమిళనాడులో గురువారం 24 గంటల్లో 28,561 కొత్త కోవిడ్-19 కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

(చదవండి: ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement