పట్నా: నేపాల్, మయన్మార్, కొరియా దేశాల స్మగ్లర్లు భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బీహార్‌ను తమ అడ్డగా మార్చుకుంటున్నారు. బీహార్ మీదుగా వెళ్లే ఈస్ట్ వెస్ట్ కారిడార్ స్మగ్లర్లకు కొత్త మార్గంగా మారింది. నేపాల్‌కు సమీపంలో ఉండటంతో స్మగ్లర్లకు ఈ రహదారి వరంలా మారింది. ఈ మార్గంలో నేపాల్ నుంచే కాకుండా మయన్మార్, కొరియా దేశాల నుంచి కూడా ‘సరుకులు’ రవాణా అవుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి.
స్మగ్లర్ల సిండికేట్ ఈ మార్గం ద్వారా విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ కమిషనర్ డా.యశోవర్ధన్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పట్నా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మోతీహరి పోలీసుల సహాయంతో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కారిడార్‌లో తొలిసారిగా ఒక కిలో 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. 15 రోజుల వ్యవధిలో దర్భంగా, ముజఫర్‌పూర్ మధ్య మైతీ టోల్ ప్లాజా సమీపంలో భారీగా విదేశీ సిగరెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రూ.ఒక కోటి 30 లక్షల విలువైన దక్షిణ కొరియా సిగరెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో బరేలీకి చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
తాజాగా తూర్పు చంపారన్‌లోని నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డులో రూ.9 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుల బస్సు నుంచి 9,500 సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ విభాగం అధికారులు మోతీహరి నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికితోడు భారతదేశంలో తయారయ్యే సిగరెట్లు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలియవస్తోంది.
ఇది కూడా చదవండి: బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
Comments
Please login to add a commentAdd a comment