corridor
-
అక్రమ రవాణాకు అడ్డాగా బీహార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్
పట్నా: నేపాల్, మయన్మార్, కొరియా దేశాల స్మగ్లర్లు భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బీహార్‌ను తమ అడ్డగా మార్చుకుంటున్నారు. బీహార్ మీదుగా వెళ్లే ఈస్ట్ వెస్ట్ కారిడార్ స్మగ్లర్లకు కొత్త మార్గంగా మారింది. నేపాల్‌కు సమీపంలో ఉండటంతో స్మగ్లర్లకు ఈ రహదారి వరంలా మారింది. ఈ మార్గంలో నేపాల్ నుంచే కాకుండా మయన్మార్, కొరియా దేశాల నుంచి కూడా ‘సరుకులు’ రవాణా అవుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి.స్మగ్లర్ల సిండికేట్ ఈ మార్గం ద్వారా విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ కమిషనర్ డా.యశోవర్ధన్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పట్నా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మోతీహరి పోలీసుల సహాయంతో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కారిడార్‌లో తొలిసారిగా ఒక కిలో 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. 15 రోజుల వ్యవధిలో దర్భంగా, ముజఫర్‌పూర్ మధ్య మైతీ టోల్ ప్లాజా సమీపంలో భారీగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రూ.ఒక కోటి 30 లక్షల విలువైన దక్షిణ కొరియా సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో బరేలీకి చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.తాజాగా తూర్పు చంపారన్‌లోని నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డులో రూ.9 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుల బస్సు నుంచి 9,500 సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ విభాగం అధికారులు మోతీహరి నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికితోడు భారతదేశంలో తయారయ్యే సిగరెట్లు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలియవస్తోంది.ఇది కూడా చదవండి: బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత? -
మధ్యప్రదేశ్-రాజస్థాన్ల మధ్య ఆధ్యాత్మిక కారిడార్
భోపాల్: మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక కారిడార్ నిర్మించనున్నారు. దీనిలో భాగంగా రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ మందిరం, నాథ్‌ద్వార్ మందిరం.. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వరంల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎలక్ట్రికల్ బస్సు నడపనున్నారు.ఈ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కారిడార్ నిర్మితం కానుంది. దీనిలో భాగంగా శ్రీక్షృష్ట గమన్ పథాన్ని కూడా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని శ్రీకృష్ట మందిరాల అనుసంధానం జరగనుంది.భోపాల్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మల సంయుక్త సమావేశంలో ఆధ్మాత్మిక కారిడార్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు పార్వతీ-కాళీసింధ్- చంబల్ పరీవాహక యోజనపై ఇరు రాష్ట్రాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ పార్వతీ-కాళీసింధ్- చంబల్ ప్రాజెక్టు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉందని, ప్రధాని మోదీ సారధ్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 17 ఆనకట్టలు నిర్మితం కానున్నాయని తెలిపారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు సోదరభావంతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు. -
తెలంగాణలో 3 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌మాల పరియోజన–1 కింద గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మీదుగా మూడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్– విశాఖపట్నం (222 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్, షోలాపూర్ – కర్నూల్ – చెన్నై (329 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇండోర్–హైదరాబాద్ (525 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణం పాక్షికంగా పూర్తయిందని పేర్కొన్నారు. భారత్‌మాల పరియోజన –1 కింద తెలంగాణలో రూ.38,279 కోట్లతో 1,719 కి.మీ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.22,749 కోట్లతో 1,026 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం జరుగుతోందని గడ్కరీ వివరించారు. -
Fact Check: బాబుకోసం ఓ ‘అబద్ధాల కథ’
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రాజెక్టు గురించి చెప్పాలనుకుంటే ముందుగా వాస్తవాలను పరిశీలించాలి. అక్కడ జరుగుతున్న దానికి, తాము చెబుతున్న దానికీ పొంతన ఉండాలి. ఇలా ఏ పొంతనా కుదరకుండా చెప్పగలిగిన వారే రామోజీరావు. కేవలం చంద్రబాబును సీఎంను చేయాలన్న ఏకైక లక్ష్యంతో, సీఎం జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుగ్ధతో ఈనాడులో అబద్ధాలనే కథనాలుగా అచ్చేస్తున్నారు. తాజాగా విశాఖ – చెన్నై కారిడార్(వీసీఐసీ)పైనా ఇలాంటి విష కథనాన్ని ప్రచురించి మరోసారి అడ్డంగా దొరకిపోయారు. అసలు వాస్తవమేమిటంటే.. ఈ రోజుకు కూడా ఈ కారిడార్‌లో జరిగిన పనులు 64.82 శాతమే. కానీ, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికే 78.5 శాతం పనులు పూర్తయిపోయాయంటూ రామోజీ వీరంగం వేశారు. వాస్తవంగా చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ కారిడార్‌లో జరిగిన పనులు 25.70 శాతమే. మిగతా పనులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినవే. అదీ కరోనా మహమ్మారి కారణంగా అనేక నెలలు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి, త్వరితగతిన పూర్తి చేస్తోంది. ఇవన్నీ పరిశీలించకుండానే రామోజీ విషం కక్కేశారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో మొత్తం 8 ప్రాజెక్టులను రూ.2,629.05 కోట్లతో చేపట్టారు. అందులో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం 194.37 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ రూ.2,459 కోట్లు ఖర్చు చేశామంటూ సిగ్గు ఎగ్గూ లేకుండా ఈనాడులో రాసుకున్నారు. రూ.170 కోట్ల బిల్లుల పెండింగ్‌లో రాష్ట్ర వాటా కింద రూ.36 కోట్లు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మరోసారి విషం కక్కారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,082 కోట్లు చెల్లించడమే కాకుండా మరో రూ.1,078.68 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ జీవోలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అయినా బాబు గ్రాఫిక్స్ రాజధానిలాగా రామోజీ వీసీఐసీ కారిడార్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోయిందని రాసేసుకున్నారు. కోవిడ్‌తో తొలి దశ ఆలస్యం వాస్తవంగా వీసీఐసీ మొదటి దశ పనులు 2023 జూన్ 30కి పూర్తి కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌తో కొంత కాలం పనులు ఆగిపోయాయి. ఆ కాలంలో స్వస్థలాలకు వెళ్లిపోయిన కూలీలు తిరిగి రాలేదు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) తొలి దశ గడువును మరో ఏడాది అంటే ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.32.61 కోట్లు ఈ నెలాఖరులోగా విడుదల చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న రూ.154.76 కోట్ల విడుదల ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. అంతేకాదు.. తొలి దశ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏడీబీ.. రెండో దశ కింద రూ.1,468.12 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆమేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలు పెట్టేలా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంటే నోటీసులతో బెదిరిస్తోందంటూ రామోజీ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. నాయుడుపేట క్లస్టర్లో 95 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన 5 శాతం పనులను లక్ష్యంలోగా పూర్తి చేయనున్నారు. -
భారత్- యూరప్ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది?
ఆమధ్య రాజధాని ఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశంలో ఇతర అంశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్ణయం భారత్ మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు చేరుకునేలా కొత్త కారిడార్‌ను నిర్మించడం. అమెరికా భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ కారిడార్‌లో సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాల సహకారం చేరింది. ఈ కారిడార్ గేమ్ ఛేంజర్‌గా, చైనా దూకుడు చూపుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే బీఆర్ఐకి భారత్, అమెరికాల పదునైన సమాధానం అని నిపుణులు అంటున్నారు. అయితే చైనా కంటే ముందు టర్కీ ఈ కారిడార్ విషయంలో టెన్షన్ పడుతోంది. దీంతో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీని ఫ్లాప్ చేయడానికి ప్రత్యేక కారిడార్‌ను నిర్మించాలని యోచిస్తోంది. యూఎస్ నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో టర్కీ సభ్యదేశంగా ఉన్నప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో అమెరికాకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం టక్కీ ఇస్లామిక్ దేశం అయినందున దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా వాస్తవానికి ఐఎంఈసీ అనేది భారతదేశం నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేయడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్. భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జోర్డాన్ వంటి దేశాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యాయి. ఈ కారిడార్ ద్వారా భారతదేశం నుండి జర్మనీకి కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత సరుకులు షిప్పింగ్ కోసం జర్మనీ చేరుకోవడానికి 36 రోజుల సమయం పడుతుండగా, ఈ కారిడార్ నిర్మాణం తర్వాత ఈ దూరం 22 రోజుల్లో ఈ తతంగం పూర్తి కానుంది. ఇరాక్ మీదుగా కారిడార్ నిర్మించాలని.. ఈ కారిడార్ ఒక మెగా ప్రాజెక్ట్. దీనిలో గల్ఫ్ దేశాలలో రైల్వేల నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతదేశ ప్రాముఖ్యతను పెంచే ఈ ప్రాజెక్ట్‌తో టర్కీకి సమస్య ఏమిటనే విషయానికి వస్తే టర్కీ భౌగోళిక స్వరూపం యూరప్, పశ్చిమ ఆసియా మధ్య ఉంది. ఈ ప్రాజెక్ట్ సిద్ధమైతే మధ్యధరా సముద్ర ప్రాంతంలో టర్కీ ప్రాముఖ్యత తగ్గుతుంది. టర్కీ ఇంతకాలం తాను ఈ ప్రాంతానికి అలెగ్జాండర్‌గా పరిగణించుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతంలోని గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో టర్కీకి శత్రు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు పోటీగా, ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కొత్త కారిడార్‌ను నిర్మించాలనుకుంటున్నాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఇరాక్ మీదుగా 1,200 కి.మీ కారిడార్‌ను నిర్మించాలని టర్కీ యోచిస్తోంది. ఇందులో హైస్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు నిర్మాణం ఉండనున్నాయి. దీనికి దాదాపు 17 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. టర్కీ యోచనకు అనేక అడ్డంకులు అయితే భారత్‌ను యూరప్‌కు అనుసంధానించే కారిడార్ ప్రాజెక్టుకు పోటీగా ప్రాజెక్టును సిద్ధం చేయాలన్న టర్కీ యోచనలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో టర్కీ తన మిత్రదేశం చైనాతో జతకట్టి ఐఎంఈసీ కారిడార్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. కాగా ఈ విషయంలో చైనా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో ఆర్బీఐ ప్రాజెక్ట్ చేపట్టిన చైనా.. భవిష్యత్తులో టర్కీతో చేతులు కలిపి, ఐఎంఈసీ కారిడార్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
కల్చరల్ కారిడార్ ఇన్ జీ20 కాన్ఫరెన్స్
-
క్రిస్ సిటీ తొలి దశలో 78,900 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యాధునిక వసతులతో కూడిన భారీ పారిశ్రామిక నగరం అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ పారిశ్రామిక నగరాన్ని మూడు దశల్లో నిరి్మస్తోంది. ఇందులో తొలి దశ అభివృద్ధికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కృష్ణపట్నం నోడ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిక్‌డిక్ట్) ఏపీఐఐసీతో కలిసి నిక్‌డిక్ట్ కృష్ణపట్నం ఇండ్రస్టియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ (క్రిస్ సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. క్రిస్ సిటీలో భారీ పరిశ్రమలతో పాటు వాక్ టు వర్క్ విధానంలో అక్కడే నివాసముండేలా ఓ నగరాన్ని కూడా నిరి్మస్తుంది. పరిశ్రమలకు, నివాస ప్రాంతానికి కూడా అత్యాధునిక వసతులు సమకూరుస్తుంది. మొత్తం 10,834.5 ఎకరాల విస్తీర్ణంలో క్రిస్ సిటీ ఏర్పాటవుతుంది. తొలి దశలో రూ.1,503.16 కోట్లతో సుమారు 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచి్చంది. ఈపీసీ విధానంలో క్రిస్ సిటీలో కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ త్వరలో టెండర్లు పిలవనుంది. 2022–23 ఎస్‌వోఆర్ ధరల ప్రకారం టెండర్లను పిలుస్తున్నట్లు ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపినట్లు చెప్పారు. కాంట్రాక్టు పొందిన సంస్థ ఇక్కడ రహదారులు, విద్యుత్, నీరు, మురుగు నీరు, వరద నీరు నిర్వహణ, శుద్ధి, పరిశ్రమల వ్యర్థాలు, నివాస వ్యర్థాల శుద్ధి వంటి కనీస మౌలిక వసతులు అభివృద్ధి చేసి వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ టెండర్లపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు తెలియజేయాలని ఏపీఐఐసీ పేర్కొంది. వాక్ టు వర్క్ విధానంలో అభివృద్ధి పనిచేసే చోటే నివాసం ఉండేలా అత్యంత పర్యావరణ అనుకూల పారిశ్రామిక నగరంగా క్రిస్ సిటీని నిర్మిస్తున్నారు. తొలి దశలో అభివృద్ధి చేసే 2,500 ఎకరాల్లో రహదారులు వంటి వసతులకు సుమారు 494 ఎకరాలు పోగా 2,006 ఎకరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 872.7 ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం, మిగిలిన ప్రాంతాన్ని నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కోసం వినియోగిస్తారు. తొలి దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇందులో సుమారు 77,300 మంది ఇక్కడే నివాసముంటూ పనిచేస్తారని, దీనికి అనుగుణంగా 21,870 కుటుంబాలు నివాసం ఉండేలా గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, స్కూల్స్, హాస్పిటల్స్, రవాణా వంటి కీలక మౌలిక వసతులను కలి్పంచనున్నారు. 36 నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మూడు దశలు పూర్తయితే ఒక్క క్రిస్ సిటీనే 4,67,800 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ నగరంలో 2,91,000 మంది నివాసముంటారని ఏపీఐఐసీ అంచనా వేస్తోంది. -
China Pak cpec Corridor: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కింద చైనా.. పాకిస్తాన్లో పది బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది. మిశ్రమ ఫలితాలు రాజకీయ తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడుల భయం సీపెక్‌కు ఎల్లప్పుడూ సవాలుగా నిలిచింది. ఈ దశాబ్దంలో సీపెక్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రాథమిక లక్ష్యం అరేబియా సముద్రానికి ప్రత్యక్ష అనుసంధానం. ఇది ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అయితే కారిడార్ కారణంగా పాకిస్తాన్ తన స్వల్పకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. పాక్‌కు చైనా ఉపశమనం ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు అత్యంత విశ్వసనీయ విదేశీ భాగస్వాములలో చైనా ఒకటిగా నిలిచింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా ఎంతగానో సహాయం చేసింది. తాజాగా పాకిస్తాన్‌కు చైనా $ 2.4 బిలియన్ల రుణాన్ని అందించింది. ఇది దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు పెద్ద ఉపశమనంలా మారింది. గత ఏడాది ఐఎంఎఫ్ అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్‌కు ఉన్న మొత్తం అప్పులో 30 శాతం చైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి వచ్చింది. పాక్-చైనాల బంధం ఇలా.. భారత పొరుగుదేశాలైన పాక్- చైనాలు 596 కిలో మీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటాయి. ఇది సియాచిన్ నుండి కారాకోరం వరకు విస్తరించి ఉంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు చైనాతో తమ సంబంధాలను ప్రస్తావించినప్పుడు అవి హిమాలయాల కంటే ఎత్తుగా, సముద్రం కంటే లోతుగా, తేనె కంటే తియ్యగా' ఉండాలని అభివర్ణిస్తారు. అయితే సీపెక్ కొన్నేళ్లుగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉంది. సీపెక్ మార్గంలో చైనా నేరుగా హిందూ మహాసముద్రం వరకూ చేరుకుంటుంది. పాక్ ప్రజల నిరసన అయితే సీపెక్‌లో పనిచేస్తున్న పౌరుల భద్రత ఇరు దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్ట్ చుట్టూ తీవ్రవాద దాడులు జరిగాయి. వీటిలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు కూడా మరణించారు. తాజాగా సీపెక్ పరిధిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. సీపెక్ కారిడార్ చైనాకు పశ్చిమ ప్రాంతంలోని జిన్జియాంగ్ను పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోగల గ్వాదర్ ఓడరేవుకు కలుపుతుంది. కాగా ఈ ప్రాజెక్టుల వల్ల తమకు ప్రయోజనం కలగడం లేదని వాయువ్య పాకిస్తాన్‌లోని ప్రజలు నిరసరన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రయోజనాలను కాపాడేందుకు తమపై వేలాది మంది పాక్ సైనికులను మోహరించినట్లు బలూచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. పాక్ వాదనకు చైనా ఖండన 2021లో క్వెట్టాలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. అలాగే దాసు డ్యామ్ వైపు వెళ్తున్న చైనా ఉద్యోగులతో నిండిన బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చైనీయులతో సహా మొత్తం 12 మంది మరణించారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ పేలుడు సంభవించిందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తోంది. ఇది కూడా చదవండి: నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్ -
హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సరికొత్త ప్రజారవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. ఇప్పటికే విజయవంతంగా సాగుతున్న మెట్రోరైలు, సబర్బన్ రైలు, ఎంఎంటీఎస్‌లకు తోడు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (పీఆర్టీ ఎస్)ను ప్రవేశపెట్టే విషయంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యమివ్వా లని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో భేటీ అయి.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఆర్టీఎస్, రోప్‌వేల ఆవశ్యకత ఉంది పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల రవాణా డిమాండ్‌ను తీర్చేందుకు పీఆర్‌టీఎస్‌తో పాటు రోప్‌వే సిస్టం వంటి అధునాతన రవాణా సౌకర్యాల (స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్) కల్పన ఆవశ్యకతను మంత్రి వివరించారు. ఇప్పటికే 69 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్, 46 కి.మీ సబర్బన్ సర్వీస్, ఎంఎంటీఎస్ ఉన్నాయని, వాటికి అనుసంధానంగా 10కి.మీ మేర పీఆర్‌టీఎస్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీఆర్టీఎస్ అలాట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలన్నీ (స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్, లీగల్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్) తమకు అందించాలని కోరారు. కారిడార్ కోసం ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్ర అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు.. 10 కి.మీ పొడవున పీఆర్టీఎస్ కారిడార్‌ను ప్రతిపాదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రతిపాదిత కారిడార్ మెట్రో స్టేషన్లు అయిన అసెంబ్లీ, ప్యారడైజ్, ఖైరతాబాద్ స్టేషన్లతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లు అయిన జేమ్స్ స్ట్రీట్, ఖైరతా బాద్ స్టేషన్లను అనుసంధానం చేస్తుందని వివ రించారు. ఈ కారిడార్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కోసం ఇప్పటికే ఇండియన్ పోర్ట్ రైల్, రోప్‌వే కార్పొ రేషన్ లిమిటెడ్ (ఐపీఆర్‌ఆర్‌సీఎల్)లకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కేంద్ర రో డ్లు, హైవేల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాల కు అనుగుణంగా ఈ కారిడార్‌ను రూపొందించేం దుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పీఆర్టీఎస్ పట్ల తెలంగాణ ప్రభుత్వ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అలైన్మెంట్ కాపీని కేంద్రమంత్రికి అందజేశారు. మురుగు నీటి శుద్ధికి రూ.2,850 కోట్లు ఇవ్వండి పట్టణ సముదాయాల్లో మురుగు నీటి శుద్ధికి సహకరించాలని హర్దీప్ సింగ్ పురీకి కేటీఆర్ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ నగర సమీపంలోని ప్రాంతాలు మొదలుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్ ) వరకూ వంద శాతం మురుగు నీటి శుద్ధి కోసం ‘హైదరాబాద్ పట్టణ సముదాయం’ (హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్) ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) సిద్ధం చేశామని, ఇందుకోసం అమృత్–2లో భాగంగా రూ.2,850 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో 100% మురుగునీటి శుద్ధితో పాటు మూసీ నది, హైదరాబాద్‌లోని ఇతర నీటి వనరుల్లో మురుగునీటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. చిన్న వాహనంలో చకచకా పీఆర్‌టీఎస్‌లో రోప్‌వేలలో వినియోగించే కారు తరహాలో ఓ చిన్న వాహనాన్ని వినియోగిస్తారు. ఇందులో ముగ్గురు నుంచి ఆరుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. అంటే తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వేగంగా వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ‘పాడ్ కార్స్’, ‘రైల్డ్ టాక్సీస్’గా ఇవి వినియోగంలో ఉన్నాయి. మన దేశంలో ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం పేరిట 10 నుంచి 15 కిలో మీటర్ల మేర వసంత్‌కుంజ్ ఏరియాలో పీఆర్‌టీఎస్‌ను తీసుకొచ్చేందుకు సాధ్యాసా ధ్యాల అధ్యయనం జరుగుతోంది. గతంలో బెంగళూరు, అమృత్సర్ (పాడ్ కార్స్)లో పీఆర్టీఎస్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చినా ఆచరణకు నోచుకో లేదు. కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఢిల్లీ తరువాత ప్రాజెక్టు ప్రారంభ య్యేందుకు అవకాశం ఉన్న రెండో నగరం హైదరాబాద్ కానుంది. చదవండి: మేమేం తక్కువ?.. అధికార టీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు -
Russia Ukraine War: విదేశీ నౌకలకు సేఫ్ కారిడార్
కీవ్/దావోస్: నల్ల సముద్రంలోని ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు భద్రంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్ కారిడార్ తెరుస్తామని రష్యా రక్షణ శాఖ హామీ ఇచ్చింది. మారియూపోల్ నుంచి నౌకలు వెళ్లడానికి మరో కారిడాన్ ప్రారంభించనున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మైఖేల్ మిజింజ్‌సెవ్ చెప్పారు. ఒడెసా, ఖేర్సన్, మైకోలైవ్‌తో సహా నల్లసముద్రంలోని ఆరు పోర్టుల్లో ప్రస్తుతం 16 దేశాలకు చెందిన 70 నౌకలు ఉన్నాయని అన్నారు. కారిడార్లు ప్రతిరోజూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మారియూపోల్ పోర్టులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత పునఃప్రారంభమైనట్లు రష్యా సైన్యం తెలియజేసింది. నల్లసముద్రంలోని ఓడ రేవుల్లో రష్యా సైన్యం పాగావేసింది. నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ఉక్రెయిన్ నుంచి విదేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రష్యా దిగివచ్చింది. ఉక్రెయిన్ ఆయుధ సామగ్రి ధ్వంసం: రష్యా ఉక్రెయిన్‌లోని పొక్రోవ్స్క్లో ఓ రైల్వేస్టేషన్ వద్ద ఉక్రెయిన్ ఆయుధ సామగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ విమానాలతో రైల్వేస్టేషన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. మైకోలైవ్ రీజియన్‌లోని దినిప్రొవ్‌స్కీలో ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను నేలమట్టం చేశామని వివరించారు. ఈ ఘటనలో11 మంది ఉక్రెయిన్ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరిపినట్లు కొనాషెంకోవ్ వివరించారు. 500 టార్గెట్లపై విరుచుకుపడినట్లు తెలిపారు. లుహాన్స్క్, డొనెట్స్క్లో ప్రస్తుతం 8,000 మంది ఉక్రెయిన్ జవాన్లు తమ ఆధీనంలో ఉన్నారని వేర్పాటువాదుల ప్రతినిధి రొడియోన్ మిరోష్నిక్ చెప్పారు. వాస్తవాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి: పెస్కోవ్ క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్ గుర్తిస్తుందని ఆశిస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం అన్నారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా పునఃప్రారంభం కావాలంటే రష్యాపై కొన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించాలని పెస్కోవ్ తెలిపారు. మళ్లీ వడ్డీ రేటు తగ్గించిన రష్యా సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి గాను రష్యా సెంట్రల్ బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేటును ఏకంగా 20 శాతం పెంచింది. అప్పటి నుంచి వడ్డీ రేటును మూడు పాయింట్లు తగ్గించడం ఇది మూడోసారి. -
డెమో కారిడార్లుగా డేంజర్ రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉన్న రాష్ట్ర రహదారులు ఇకపై డెమో కారిడార్లుగా మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వంద కిలోమీటర్ల చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. డెమో కారిడార్లతో ప్రమాదాల శాతం తగ్గుతుందని పేర్కొంది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలన్నిటినీ గుర్తించి ఆయా చోట్ల డెమో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. జిల్లాల్లో ఏ రాష్ట్ర రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో త్వరలో నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను కోరామని వివరించింది. మొత్తం 1,300 కి.మీ మేర ► 13 జిల్లాల్లో 1,300 కి.మీ. మేర రాష్ట్ర రహదారులపై డెమో కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో డెమో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ► ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాల మధ్య 139 కి.మీ మేర రేణిగుంట–రాయలచెరువు డెమో కారిడార్ ఉంది. తాజాగా ఇవే జిల్లాల్లో రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య మరో డెమో కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లాలోని కొండమోడు–పేరేచర్ల, కృష్ణా జిల్లాలోని విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమ గోదావరిలోని భీమవరం మధ్య డెమో కారిడార్ ప్రతిపాదించారు. రూ.2.5 కోట్లతో రోడ్ సేఫ్టీ ఆడిట్ రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర రూ.2.5 కోట్లతో రోడ్ సేఫ్టీ ఆడిట్ (రోడ్డు భద్రత పరిశీలన)ను ప్రారంభించినట్లు రవాణా శాఖ తెలిపింది. ఇకపై కొత్తగా 5 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నా..రోడ్ సేఫ్టీ ఆడిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వివరించింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.25 కోట్ల విలువైన బ్లాక్‌స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)ల మెరుగుదల పనులు జరిగాయని, మరో రూ.50 కోట్ల పనులు కొనసాగుతున్నట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, మోటారు వాహన చట్టం అమలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధిస్తున్న జరిమానాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికను పంపింది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు ► 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య డెమో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందజేసింది. ► 2013లో ఈ రహదారిలో 250 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా.. కారిడార్ ఏర్పాటు తర్వాత ప్రమాదాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2015 నాటికి సగానికి తగ్గగా, 2017 నాటికి వంద వరకు నమోదయ్యాయి. ఇక 2018 నాటికి పదుల సంఖ్యలోనే ప్రమాదాలు నమోదు కావడం గమనార్హం. డెమో కారిడార్ అంటే... డెమో కారిడార్ అంటే ప్రమాదాలకు అంతగా అవకాశం లేనిరోడ్డు. డెమో కారిడార్ కింద తొలుత ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఎక్కడా గుంతలు లేకుండా చూస్తారు. నిర్దేశిత బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వాహనాల బరువును చూసేందుకు ఆయా రోడ్లలో వే బ్రిడ్జిలు (కాటా యంత్రాలు) ఏర్పాటు చేస్తారు. ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచుతారు. -
హైదరాబాద్ మెట్రో.. పని వేళల్లో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం మెట్రో రైలు సేవలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం మెట్రో కార్యకలాపాలు గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించబడతాయి. మొదటి దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా కారిడార్ 1లో (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రెండో దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3లో (నాగోల్ నుంచి రాయదుర్గ్) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు మొదటి దశ మాదిరిగానే ఉంటాయి. (చదవండి: మెట్రో రీ ఓపెన్.. ఫైన్ల మోత) ఇక మూడవ దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో భాగంగా మూడు కారిడార్లలో(సీ1, సీ2, సీ3) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక వీటి రెవెన్యూ సేవలు కేవలం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణీకుల రద్దీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇక కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అలాగే గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లు మూసివేత కొనసాగుతుంది -
పొలిటికల్ కారిడర్ 26th February 2019
-
‘సిద్ధును ఆపడం భావ్యం కాదనిపించింది’
ఇస్లామాబాద్ : సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్తాన్‌లోని నరోవాల్ జిల్లా శాఖర్‌గఢ్ వద్ద పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు(బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్‌లను పాక్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుష్మ, అమరీందర్ సింగ్‌లు ఆహ్వానాన్ని తిరస్కరించగా సిద్ధూ మాత్రం విలేకరులతో కలిసి మంగళవారమే పాక్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్- పాక్‌ల మధ్య శత్రుత్వాన్ని రూపుమాపేందుకు కర్తార్‌పూర్ కారిడార్ తోడ్పడుతుందని పేర్కొన్నారు. కాగా కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన కోసం సిద్ధు పాకిస్తాన్‌కు వెళ్లడంతో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై స్పందించిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... పాక్ పర్యటనను మానుకోవాల్సిందిగా సిద్ధూను కోరాననీ, అయితే అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నట్లు సిద్ధూ తనకు చెప్పారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆపడం భావ్యం కాదేమోనని ఆగిపోయానన్నారు. ఇక భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ సాహిబ్‌ను, పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ ఇరు దేశాలూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మిస్తుంచనున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లోని డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు మొత్తం 2 కిలో మీటర్ల దూరాన్ని భారత్ నిర్మించేందుకు సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్ వైపునా రెండు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రారంభించనున్నారు. -
‘అసలైన ఘనత ఇమ్రాన్‌కే చెందుతుంది’
చండీగఢ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక చొరవ వల్లే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించారు. సిక్కుల ప్రార్థనలు ఫలించేలా చేసిన ఘనత కేవలం ఇమ్రాన్‌కే చెందుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సిద్ధు.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం విషయంలో అసలైన ఘనత మాత్రం పాక్ ప్రధాని, తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. 24 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ సిక్కు ప్రజల ఆకాంక్షలు ఫలించేలా చేశారని ప్రశంసించారు. రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూసినపుడే అందరూ సంతోషంగా ఉంటారని ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. (భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్) కాగా వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలవడం సిద్ధుకు కొత్తేం కాదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సమయంలో, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం.. సౌత్ ఇండియా కంటే పాకిస్తానే బెటర్ అంటూ వ్యాఖ్యానించడం తదితర సమయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే లష్కరే ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన నరమేధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ ఘటనలో మరణించిన వారికి, అమరవీరులకు దేశమంతా నివాళి అర్పిస్తుంటే... అందుకు కారణమైన దాయాది దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడం సిద్ధుకే చెల్లిందని ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. (26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం) -
డ్రాగన్ మరో ఎత్తుగడ
బీజింగ్: జిత్తులమారి చైనా తన సరిహద్దు ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు మరో ప్రయత్నం మొదలుపెట్టింది. భారత్‌ను చేరుకునేందుకు చైనా-నేపాల్-భారత్ బెల్ట్ అండ్ రోడ్ ప్రతిపాదనను ముందుకుతెచ్చింది. ఇప్పటికే భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని ఆత్రుతతో ఉన్న చైనా మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా నేపాల్ మీదుగా భారత్-చైనా ఆర్థిక కారిడార్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి బుధవారం వెల్లడించారు. మరోవైపు నేపాల్ కొత్త ప్రధానిగా ఎన్నికైన కెపి ఓలీ శర్మ ప్రభుత్వంపైనా ప్రభావం మరింత పెంచుకోవాలని చైనా భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే డ్రాగన్ పావులు కదుపుతోంది. నేపాల్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని బీజింగ్ ప్రభుత్వం ప్రకటించింది. చైనా పర్యటనలో ఉన్న నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గైవాలితో కలిసి బీజింగ్‌లో వాంగ్ యి చైనా-నేపాల్-ఇండియా ఆర్థిక కారిడార్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రకటించారు. నేపాల్‌తో బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు ఇరు దేశాల నేతలు ప్రకటించారు. బెల్ట్ అండ్ రోడ్ ద్వారా నేపాల్ భౌగోళిక ప్రయోజనాన్ని, చైనా- భారత్ సంబంధాలు బలపరిచేందుకు మూడు దేశాలను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ నిర్మించాలని భావిస్తున్నట్లు వాంగ్ యి తెలిపారు. ఇటివల నేపాల్ ప్రధానిగా ఎన్నికైన కెపి శర్మ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఓపీ శర్మ పర్యటన అనంతరమే నేపాల్ విదేశాంగ మంత్రి చైనా పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. చైనా, భారత్, నేపాల్ భాగస్వామ్య దేశాలని, నదులు పర్వతాలతో తమ దేశాల మధ్య విడదీయలేని బందం ఉందని వాంగ్ యి పేర్కొన్నారు. నేపాల్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని చైనా-భారత్ సామరస్యంతో మెలగాలని వాంగ్‌యి అభిప్రాయపడ్డారు. కాగా చైనా-టిబెట్-భారత్ రైల్వే కనెక్టిటివిటీని కూడా గతంలో ప్రతిపాధించిన విషయం తెలిసిందే. -
పారిశ్రామిక కారిడార్‌గా నీలగిరి
పరిశ్రమల కారిడార్ వైపు నీలగిరి అడుగులు వేస్తోంది. టీఎస్ ఐపాస్ ద్వార 2018 ఫిబ్రవరి వరకు 211 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు రూ.26,770 కోట్ల 92లక్షల పెట్టుబడులు పెడుతున్నారు. దీని ద్వార 8,950 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నల్లగొండ రూరల్ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పుష్కరాల సందర్భంగా సాగర్, మఠంపల్లి, ప్రాం తాలకు రోడ్డు మార్గాలను పటిష్టపర్చారు. 2020–25 నాటికి విజయవాడ హైవే ఎక్స్‌ప్రెస్ హైవేగా మారనుండటం, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి కూడా విస్తరించడం, నడికూడ–మాచర్ల డబ్లింగ్ రైలు పనులు, భూదాన్ పోచంపల్లి నుంచి రీజనల్‌రింగ్ రోడ్డు, నకిరేకల్–నాగార్జునసాగర్ వరకు జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో పరిశ్రమల ద్వార ఉత్పత్తి అయిన వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. యాదాద్రి పవర్ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే దామర్లచర్ల, మిర్యాలగూడ, నిడమనూరు తదితర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన అవకాశాలున్నాయి. త్వరితగతిన అనుమతులు చౌటుప్పల్ మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటం వలన పరిశ్రమల అనుమతులు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పరిశ్రమలను నల్లగొండ జిల్లాలో స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో భారీగా పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే 82 పరిశ్రమలను స్థాపించారు. రూ.610 కోట్లు పెట్టుబడి పెట్టి 1968 మందికి ఉద్యోగాలు కల్పించారు. మరో 28 పరిశ్రమలు ఈనెలాఖరులోగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా 39 పరిశ్రమలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. 57 పరిశ్రమలు స్థాపనకు పనులు జరుగుతున్నాయి. దామరచర్ల ప్రాంతంలో గ్రానైట్ కటింగ్ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తే పరిశ్రమను మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా మార్బుల్స్‌ను వినియోగిస్తున్నారు. మార్బుల్స్ వినియోగం వలన వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చధనాన్ని గుణం వున్నట్లుగా ఇటలి శాస్త్రవేత్తలు తేల్చారు. కోళ్ల ఫారం దానాలు జిన్నింగ్ మిల్లులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తే మంచి ఉత్పిత్తి కి మంచి మార్కెటింగ్ ఉంటుంది. ప్రస్తుతం 2 జిన్నింగ్ పరిశ్రమలున్నప్పటికీ ఆధునిక పరిజ్ఞానం లేకపోవడంతో అంతర్జాతీయంగా పోటీని తట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత పరిశ్రమలు భారీగా ఏర్పాటవుతున్నాయి. మోడ్రన్ రైసు మిల్లులు ఏర్పాటయితే ఇతర దేశాలకు కూడా డిమాండ్ పెరగనుంది. ఏడు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ వినియోగం అందుబాటులోకి రానుంది. పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, రోడ్డు రవాణా, మార్కెటింగ్ సులభమవుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనువైన ప్రాంతం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు రీజనల్ రింగు రోడ్లు, ఎక్స్‌ప్రెస్ హైవే మార్గాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొస్తున్నారు. చేనేత, గ్రానైట్, రైస్, జిన్ని, కాటన్, సోలార్, పవర్‌ప్లాంట్స్, మార్బుల్ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల గనిగా మారింది. – కోటేశ్వర్రావు, పరిశ్రమల శాఖ జీఎం -
ఎలివేటెడ్ కారిడార్లకు పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్ : జాతీయ రహదారులు, వాటిపై అవసరమైన చోట్ల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి గతంలో మంజూ రు చేసినప్పటికీ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఇంతకాలం కేంద్రం అనుమతివ్వలేదు. రూ.3,120 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులకు మంగళవారం కేంద్ర ఉపరితల రవాణ శాఖ పచ్చజెండా ఊపింది. ఇందులో హైదరాబాద్‌లో కీలకమైన 3 ఎలివేటెడ్ కారిడార్లు ఉన్నాయి. ఆర్థిక ఏడాది ముగియనుండటంతో కేంద్ర ఉపరితల రవాణ శాఖతో తెలంగాణ జాతీయ రహదారుల విభాగం సంప్రదింపులు జరుపుతూ తుది అనుమ తులిచ్చేలా చర్యలు తీసుకుంది. తాజాగా ఆ విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి ఢిల్లీ వెళ్లి అధికారులతో చర్చించటంతో అన్ని పనులకు మంగళవారం తుది అనుమతులు లభించాయి. ఉప్పల్ ట్రాఫిక్‌కు పరిష్కారం.. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్ వద్ద ట్రాఫిక్ చిక్కులు తీవ్రంగా ఉండటంతో వాహన వేగానికి బ్రేకులు పడుతున్నాయి. రోడ్డును విస్తరించేందుకు కూడా అవకాశం లేకపోవటంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. తాజా అనుమతుల నేపథ్యంలో ఉప్పల్ కూడలి నుంచి పీర్జాదిగూడ దాటాక ఉన్న సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరకు 6.25 కిలో మీటర్ల మేర కారిడార్ కొనసాగనుంది. ఇందుకు రూ.850 కోట్లు ఖర్చు కానుంది. భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం రూ.200 ఖర్చు చేయనుండగా మిగతా మొత్తా న్ని కేంద్రం ఇస్తుంది. ఇక అంబర్‌పేటలో కూడా మరో వంతెన నిర్మాణం చేపట్టనున్నా రు. చే నంబర్ కూడలి నుంచి అంబర్‌పేట మార్కెట్ వద్ద ఉన్న కూడలి వరకు 4 వరసలతో నిర్మితమయ్యే ఈ వంతెనకు రూ.186 కోట్లు ఖర్చు కానున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో మరో వంతెన నిర్మించనున్నారు. హైదరాబాద్ నుంచి ఆరాంఘర్ వరకు పీవీ ఎలివేటెడ్ కారిడార్ ఉండగా ఆ తర్వాత వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వస్తోంది. శంషాబాద్‌లో ఇబ్బంది ఉండటంతో ఇక్కడ వంతెన నిర్మించబోతున్నారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ దాటే వరకు 10 కిలోమీటర్ల మేర 6 వరసలతో నిర్మితమయ్యే ఈ వంతెనకు రూ.284 కోట్లు ఖర్చు కానున్నాయి. వీటితోపాటు రూ.224 కోట్లతో అలీనగర్–మిర్యాలగూడ మధ్య 30 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ, రూ.300 కోట్లతో మల్లేపల్లి–హాలియా మధ్య 40 కి.మీ., మేర రూ.207 కోట్లతో సిరోంచా–ఆత్మకూరు మధ్య 34 కి.మీ మేర రూ.324 కోట్లతో మిర్యాలగూడ–కోదాడ మధ్య 46 కి.మీ., రూ.114 కోట్లతో హగ్గరి–రాయ్‌చూరు–జడ్చర్ల మధ్య 15 కి.మీ. మేర రోడ్లను విస్తరించనున్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఈఎన్సీ గణపతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
పొలిటికల్ కారిడర్ 13th Oct 2014
-
‘సుదీర్ఘ’ సమరం
ఉభయ సభల సమావేశాలు ప్రారంభం 27 రోజుల పాటు అసెంబ్లీ ఆకర్షణీయంగా ముస్తాబైన ఎగువ సభ చెరకు సమస్యపై దద్దరిల్లిన శాసన సభ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ఉభయ సభల వర్షా కాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 30 వరకు 27 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. బహుశా ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘంగా సమావేశాలు జరగలేదు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. నవ వధువులా ఎగువ సభ కొత్త హంగులు, ఆర్భాటాలతో శాసన మండలి ఆకర్షణీయంగా తయారైంది. ఇటీవలే ఇందులో నవీకరణ చేపట్టారు. అందమైన విద్యుద్దీపాలు, అధునాతన మైక్‌లు, చూడ చక్కని సీటింగ్ ఏర్పాటు, సీసీ టీవీలు, పెద్ద టీవీ స్క్రీన్లతో సభ అచ్చు నవ వధువులా తయారైంది. నేలపై రెడ్ కార్పెట్ పరిచారు. కారిడార్‌లో కూడా కొత్తగా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పాలక, ప్రతిపక్ష సభ్యులు ఈ ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేస్తూ చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిని అభినందించారు. సంతాప తీర్మానం శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇటీవల మరణించిన మాజీ సభ్యులు, నాయకులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానాన్ని చేపట్టారు. లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ ఎస్. మల్లికార్జునయ్య, శాసన సభ మాజీ సభ్యులు కే. ప్రభాకర రెడ్డి, హెచ్ఎస్. శంకరలింగే గౌడ, ఏ. కృష్ణప్ప, మాజీ ఎంపీ ఐఎం. జయరామ శెట్టి, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. జనార్దనరెడ్డి, నటుడు, దర్శకుడు సీఆర్. సింహ, సాగు నీటి రంగం నిపుణుడు జీఎస్. పరమ శివయ్య, సాహితీవేత్త యశవంత చిత్తాల, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సినిమా ఛాయాగ్రాహకుడు వీకే. మూర్తిల మృతికి సంతాప సూచకంగా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, జేడీఎస్ నాయకుడు వైఎస్వీ. దత్తా ప్రభృతులు మాట్లాడారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించి సభా కార్యక్రమాలు చేపట్టారు. చెరకు ప్రతిధ్వనులు సంతాప తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం సభ ప్రారంభం కాగానే చెరకు రైతుల సమస్యలను విపక్షాలు లేవనెత్తడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వాయిదా తీర్మానం ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. చెరకు రైతులకు మద్దతు ధరను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం చక్కెర మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కైందని ఆరోపించారు. జేడీఎస్‌కు చెందిన వైఎస్వీ. దత్తా కూడా కష్టాల్లో ఉన్న చెరకు రైతులపై మాట్లాడడానికి చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విపక్షాల సభ్యులందరూ లేచి మాట్లాడడంతో గందరగోళం నెలకొంది. ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకుని మాట్లాడుతూ చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మక్కు కాలేదని తెలిపారు. రైతులకు మద్దతు ధరను ఇప్పిస్తామని చెప్పారు. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని చెప్పారు. చివరకు స్పీకర్ జోక్యం చేసుకుని ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం కల్పిస్తానని చెప్పడంతో గందరగోళానికి తెర పడింది. ప్రశ్నోత్తరాల అనంతరం జగదీశ్ శెట్టర్ చర్చను ప్రారంభించారు. -
పూల వెలుగులు
బల్బుల్ని పారేయకుండా పుష్పాలకు కుండీలుగా మారిస్తే పూలవెలుగులు విరజిమ్ముతాయి. బల్బు పైభాగంలో ఉన్న అల్యూమినియం మూతని జాగ్రత్తగా తొలగించి ఆ ప్రాంతాన్ని వస్త్రంతోగాని, టేపుతోగాని గాజు కనిపించకుండా చుట్టేయాలి. లేదంటే అల్యూమినియం మూతని కట్ చేసి బల్బులో కొన్ని నీళ్లు పోసి గులాబిపూలు వేసి సెంటర్ టేబుల్‌పై పెట్టుకోవాలి. కారిడార్‌లో పూలకుండీలపైన వేలాడేలా ఈ బల్బులను అమర్చుకుని వాటిలో చిన్నసైజు మొక్కలు పెట్టుకోవాలి. నీళ్లే కాకుండా బల్బులో చిన్న చిన్న రంగురంగురాళ్లు కూడా వేసుకుంటే చూడ్డానికి మరింత అందంగా ఉంటాయి.