భోపాల్: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక కారిడార్ నిర్మించనున్నారు. దీనిలో భాగంగా రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ మందిరం, నాథ్‌ద్వార్ మందిరం.. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వరంల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎలక్ట్రికల్ బస్సు నడపనున్నారు.
ఈ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కారిడార్ నిర్మితం కానుంది. దీనిలో భాగంగా శ్రీక్షృష్ట గమన్ పథాన్ని కూడా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని శ్రీకృష్ట మందిరాల అనుసంధానం జరగనుంది.
భోపాల్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మల సంయుక్త సమావేశంలో ఆధ్మాత్మిక కారిడార్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు పార్వతీ-కాళీసింధ్- చంబల్ పరీవాహక యోజనపై ఇరు రాష్ట్రాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ పార్వతీ-కాళీసింధ్- చంబల్ ప్రాజెక్టు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉందని, ప్రధాని మోదీ సారధ్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 17 ఆనకట్టలు నిర్మితం కానున్నాయని తెలిపారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు సోదరభావంతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment