ప్రతీకాత్మక చిత్రం
పరిశ్రమల కారిడార్ వైపు నీలగిరి అడుగులు వేస్తోంది. టీఎస్ ఐపాస్ ద్వార 2018 ఫిబ్రవరి వరకు 211 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు రూ.26,770 కోట్ల 92లక్షల పెట్టుబడులు పెడుతున్నారు. దీని ద్వార 8,950 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
నల్లగొండ రూరల్ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పుష్కరాల సందర్భంగా సాగర్, మఠంపల్లి, ప్రాం తాలకు రోడ్డు మార్గాలను పటిష్టపర్చారు. 2020–25 నాటికి విజయవాడ హైవే ఎక్స్‌ప్రెస్ హైవేగా మారనుండటం, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి కూడా విస్తరించడం, నడికూడ–మాచర్ల డబ్లింగ్ రైలు పనులు, భూదాన్ పోచంపల్లి నుంచి రీజనల్‌రింగ్ రోడ్డు, నకిరేకల్–నాగార్జునసాగర్ వరకు జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో పరిశ్రమల ద్వార ఉత్పత్తి అయిన వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. యాదాద్రి పవర్ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే దామర్లచర్ల, మిర్యాలగూడ, నిడమనూరు తదితర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన అవకాశాలున్నాయి.
త్వరితగతిన అనుమతులు
చౌటుప్పల్ మండలం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండటం వలన పరిశ్రమల అనుమతులు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పరిశ్రమలను నల్లగొండ జిల్లాలో స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో భారీగా పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే 82 పరిశ్రమలను స్థాపించారు. రూ.610 కోట్లు పెట్టుబడి పెట్టి 1968 మందికి ఉద్యోగాలు కల్పించారు. మరో 28 పరిశ్రమలు ఈనెలాఖరులోగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా 39 పరిశ్రమలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. 57 పరిశ్రమలు స్థాపనకు పనులు జరుగుతున్నాయి.
దామరచర్ల ప్రాంతంలో గ్రానైట్ కటింగ్ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తే పరిశ్రమను మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా మార్బుల్స్‌ను వినియోగిస్తున్నారు. మార్బుల్స్ వినియోగం వలన వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చధనాన్ని గుణం వున్నట్లుగా ఇటలి శాస్త్రవేత్తలు తేల్చారు. కోళ్ల ఫారం దానాలు జిన్నింగ్ మిల్లులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తే మంచి ఉత్పిత్తి కి మంచి మార్కెటింగ్ ఉంటుంది.
ప్రస్తుతం 2 జిన్నింగ్ పరిశ్రమలున్నప్పటికీ ఆధునిక పరిజ్ఞానం లేకపోవడంతో అంతర్జాతీయంగా పోటీని తట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత పరిశ్రమలు భారీగా ఏర్పాటవుతున్నాయి. మోడ్రన్ రైసు మిల్లులు ఏర్పాటయితే ఇతర దేశాలకు కూడా డిమాండ్ పెరగనుంది. ఏడు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ వినియోగం అందుబాటులోకి రానుంది. పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, రోడ్డు రవాణా, మార్కెటింగ్ సులభమవుతుంది.
పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనువైన ప్రాంతం
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు రీజనల్ రింగు రోడ్లు, ఎక్స్‌ప్రెస్ హైవే మార్గాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొస్తున్నారు. చేనేత, గ్రానైట్, రైస్, జిన్ని, కాటన్, సోలార్, పవర్‌ప్లాంట్స్, మార్బుల్ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల గనిగా మారింది.
– కోటేశ్వర్‌రావు, పరిశ్రమల శాఖ జీఎం
Comments
Please login to add a commentAdd a comment