Nilagiri
-
దొరికిన పులి.. అయినా మరో గిలి!
సాక్షి, చెన్నై(తమిళనాడు): నీలగిరుల్లో అటవీ అధికారులు, వేటగాళ్లను 21 రోజుల పాటుగా ముప్పుతిప్పలు పెట్టిన పులి ఎట్టకేలకు దొరికింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న ఈ పులికి మైసూర్లో చికిత్స అందిస్తున్నారు. అయితే సత్యమంగళం అడవుల్లో మరో పులి పశువుల మీద దాడి చేయడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. నీలగిరి జిల్లా కూడలూరు పరిసరాల్లో ఓ పులి జనాన్ని రెండు నెలలుగా వణికించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగుర్ని చంపింది. పదుల సంఖ్యలో పశువుల్ని హతమార్చింది. ఈ పులిని పట్టుకునేందుకు గత నెలఖారులో టీ–23 పేరిట ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 150 మందితో కూడిన బృందం వేటకు దిగింది. ఈ పులిని కాల్చి చంపేందుకు సైతం అనుమతులు పొందారు. చివరకు కోర్టు ఆదేశాలతో వెనక్కు తీసుకున్నారు. ఈ పులి ఏ మార్గంలో వస్తున్నదో, జనం మీద దాడి చేసి ఎలా తప్పించుకుంటున్నదో అంతు చిక్క లేదు. నిఘా నేత్రాలు, డ్రోన్‌కెమెరాల సాయంతో గాలింపు చేపట్టారు. 21 రోజుల పాటుగా నిర్విరామంగా సాగిన ఈ పులి వేటలో శుక్రవారం ముందడుగు వేశారు. మైసూర్లో చికిత్స.. మసన కుడి – తెప్పకాడు పరిసరాల్లో ఈ పులి సంచరిస్తుండడం నిఘా నేత్రాలకు చిక్కాయి. దీంతో ప్రత్యేక బృందాలు అటు వైపుగా కదిలాయి. చేతుల్లో మత్తు ఇంజెక్షన్‌తో కూడిన తుపాకులతో వేట సాగించారు. పొదళ్లల్లో నక్కి ఉన్న పులి మీద మత్తు ఇంజెక్షన్ ప్రయోగించారు. కొద్దిదూరం పరుగులు తీసిన ఆ పులి సొమ్మ సిల్లింది. వెను వెంటనే మరింతగా పులికి మత్తును ఇచ్చి, బోనులో బంధించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్, కార్యదర్శి సుప్రియా సాహు అక్కడికి చేరుకుని ఆ బృందాన్ని అభినందించారు. అయితే, మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో మణిగండన్ అనే అటవీ సిబ్బంది గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ పులిని మైసూర్‌లోని వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ తీవ్రచికిత్స అందిస్తున్నారు. ఈ పులి చిక్కిన ఆనందంలో ఉన్న అధికారులకు సత్యమంగళంలో మరో పులి పంజా విసరడం కలవరాన్ని రేపింది. పశువుల మీద ఈ పులి దాడి చేయడంతో సత్యమంగళం పరిసర వాసుల్లో కలవరం బయలుదేరింది. ఈ పులిని పట్టుకునేందుకు మరో ఆపరేషన్ తప్పదేమో అని అటవీ అధికారులు భావిస్తున్నారు. -
నీలగిరుల్లో హై అలర్ట్
సాక్షి, చెన్నై: నీలగిరుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం నీలగిరుల్లోని అవలాంజీలో 9 సె.మీ వర్షం పడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో తరచూ వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై శివారుల్లో రాత్రంతా వర్షం పడింది. కోయంబత్తూరు, నీలగిరుల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అవలాంజి పరిసరాల్లో 9 సె.మీ, కోయంబత్తూరులో 8 సె.మీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వాగులు వంకల్లోకి నీటి రాక పెరిగింది. నీలగిరి, కోయంబత్తూరులో ఆదివారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా నీలగిరుల్లో 400 ప్రత్యేక శిబిరాలు ఏర్పటు చేశారు. జాతీయ విపత్తుల నివారణ బృందాలను రంగంలోకి దించారు. కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఐదు జిల్లాల్లో మోస్తరుగా... కోయంబత్తూరు, నీలగిరుల్లో భారీ వర్షం, తేని, దిండుగల్, తెన్కాశి, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో సోమవారం నుంచి మూడు రోజులు మోస్తరుగా వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కన్యాకుమారి తీరంలో గాలి ప్రభావం అధికంగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలను విస్తృతం చేశారు. చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, అప్పుడప్పుడు వర్షం పలకరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెన్ కాశిలో కురుస్తున్న వర్షాలకు పశ్చిమ పర్వత శ్రేణుల్లోని కుట్రాలం జలపాతంలో నీటి ఉధృతి పెరిగింది. చదవండి: Ooty: ఆ అందాలు ఆస్వాదించాలంటే ఊటీ వెళ్లాల్సిందే! Blinding rains now. Airport flyover. @chennaiweather@ChennaiRains pic.twitter.com/Y9zwKSlxxx — Sankara Subramanian (@rsankaras) August 29, 2021 -
ఆ అందాలు ఆస్వాదించాలంటే ఊటీ వెళ్లాల్సిందే!
చెవుల మీదకు వేళ్లాడే జడలు, హాఫ్‌వైట్ లుంగీ, ఎరుపు–నలుపు కలగలిసిన చక్కటి నేత ఓణీ. సంప్రదాయ చేనేత ఓణీలోని నేత సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ వస్త్రధారణ. సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ చేత్తో చిటికెలు వేస్తూ ఉత్సాహభరితంగా సాగే ఈ డాన్స్ పేరు టోడా ట్రైబల్ డాన్స్. టోడా ఆదివాసీల సంప్రదాయ నృత్యం. ఈ డాన్సుతోపాటు నీలగిరుల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఊటీబాట పట్టాల్సిందే. ఈ నృత్యం చేస్తున్న వాళ్లు టోడా ఆదివాసీ మహిళలు. ఆదిమ కాలం నుంచి నీలగిరుల్లో నివాసం ఉన్నది వీళ్లే. ఊటీ ట్రిప్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. టీ తోటల మధ్య మలుపులు తిరుగుతూ సాగే రోడ్డు ప్రయాణమే గొప్ప ఆనందం. ఇక్కడ పర్యటించేటప్పుడు కారు అద్దాలను దించుకుని, మాస్కు తీసిసి హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఊటీ టూర్లో ఎత్తైన పీక్ దొడబెట్ట, బొటానికల్ గార్డెన్, టీ గార్డెన్ల విహారం ఎప్పుడూ ఉండేవే. ఈ సారి వాటన్నింటితోపాటు టోడా ట్రైబల్ విలేజ్, రోజ్ గార్డెన్, కూనూర్తోపాటు దేశంలోని వివిధ నిర్మాణశైలులను ప్రతిబింబించే ప్యాలెస్‌ల మీద కూడా ఓ లుక్కేయండి. చాలా చూడాలి! నీలగిరులు ఊటీగా మార్పు చెందే క్రమంలో వెలసిన నిర్మాణాలివి. మైసూర్ మహారాజు నిర్మించుకున్న ఫెర్న్ హిల్ ప్యాలెస్ జోద్పూర్ మహారాజు ఆరన్మోర్ ప్యాలెస్ జామ్‌నగర్ నవాబు నవానగర్ ప్యాలెస్ ఇందోర్, పోర్బందర్, కొచ్చిన్, ట్రావెన్కోర్ రాజవంశీకులు నిర్మించుకున్న వేసవి విడిదులు, వెస్ట్రన్ స్టైల్ చర్చ్‌లు కూడా ఉన్నాయిక్కడ. బస: ఊటీలో మంచి హోటళ్లున్నాయి. ఉత్తరాది, దక్షిణాది, కాంటినెంటల్ రుచులు కూడా దొరుకుతాయి. ఈ టూర్లో ఊటీ స్పెషల్ టీ తాగడం మర్చిపోకూడదు. ఆవిరి బండి ప్రయాణం ఊటీ టూర్ అనగానే మొదటగా టాయ్‌ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఆవిరితో నడిచే ఈ రైలు ప్రయాణాన్ని కూనూర్ వరకు కొనసాగించవచ్చు. మనకు ఎనభైల నాటి సినిమాల్లో ఊటీ లొకేషన్లుగా కనిపించే అనేక ప్రాంతాలు కూనూర్లోనివే. తెలుగు సినిమాలో కాదు. బాలీవుడ్ సినిమాలకు కూడా ఇది మంచి లొకేషనే. - వాకా మంజులారెడ్డి చదవండి: Bibi Ka Maqbara: ‘దక్కన్ తాజ్’ ఎవరు కట్టించారో తెలుసా?! -
వైరల్: ఎలుగుబంటి చేజ్.. దెబ్బకు వీడియో ఆపేసి పారిపోయాడు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా తన ట్విటర్లో ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశారు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఎలుగుబంటి వెంటాడుతున్న ఈ వీడియో తమిళనాడులోని నీలగిరి పర్వతాల ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింటా వైరల్‌గా మారింది. కొండల నడుమ టీ గార్డెన్లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తన ప్రయాణాన్ని వీడియో తీశాడు. చుట్టు పక్కల మొత్తం పచ్చటి ప్రకృతి నిండిన ఆ దారిలో వెళతుండగా ఆ వ్యక్తికి అనుకోని అతిథి ఎదురయ్యింది. రోడ్డు మీద మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. ఆ దారిలో ఎవరూ వెళ్లకుండా అవి రోడ్డును ఆక్రమించినట్లు కనిపిస్తోంది. వాటిని చూడగానే ఆ వ్యక్తి వెంటనే బైక్ ఆపాడు. ఎలుగుబంట్లను రికార్డ్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అయితే అలా కాసేపు అంతా ప్రశాంతంగా ఉన్నా.. ఇందులో ఓ ఎలుగుబంటి బైకర్‌ను గమనించింది. కొద్ది సెకన్లు గడిచాక ఆ ఎలుగుబంటి వ్యక్తి వైపు పరిగెత్తుకు రావడం మొదలైంది. అయితే ఒక్కసారిగా అతనివైపు పరుగులు తీయడంతో వీడియో పూర్తి అయింది. ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి’ అని కామెంట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. చదవండి: వైరల్: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి! Somewhere in the Nilgiris... Wait till the end of the clip if you want to feel an adrenaline rush...To the @jawamotorcycles team: We need to introduce a ‘Bear Charge’ warning on our bikes... pic.twitter.com/Zy24TuBroF — anand mahindra (@anandmahindra) June 24, 2021 -
నీలగిరిలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం
సాక్షి, నల్లగొండ: నీలగిరి పట్టణంలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. సీడీఎంఏ అధికారులు రా ష్ట్రంలోని 15 మున్సిపాలిటీల్లో మలమూత్ర వ్యర్థ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో నీలగిరి మున్సిపాలిటీ కూడా ఉంది. ఇప్పటికే నీలగిరి మున్సిపాలిటీకి సంబందించి శేషమ్మగూడెం డంపింగ్‌యార్డులో నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోనే టెండర్ల ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో శేషమ్మగూడెం డంపింగ్ యార్డులో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి పట్టణంలోని సెప్టిక్ ట్యాంకులనుంచి అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. దాదాపు 700 ఎంఎల్డీ సామర్థ్యం గల ప్లాంట్ నిర్మించి మలమూ త్ర వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించనున్నారు. పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు నిండితే మున్సిపాలిటీ వారు నిర్ణయించే ధరకు సంబంధిత ఏజన్సీ వారు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి ఎరువుగా తయారు చేసా ్తరు. పట్టణంలోని మలమూత్ర వ్యర్థాలు వృథా కాకుండా దానిని శుద్ధి చేసి ఎరువుగా మార్చాలని సీడీఎంఏ అధికారులు ఎప్పటినుంచో ఆలో చన చేస్తున్నారు. ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. ఈ శుద్ధి కేంద్రం నిర్మాణానికి సంబంధించి టెండరు ప్రక్రియ కూడా కావడంతో సంబంధిత ఏజన్సీ నిర్వాహకులు సోమవారం వచ్చి మున్సిపల్ కమిషనర్‌కు కలిశారు. శుద్ధి కేంద్రం నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. -
నీలగిరిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
సాక్షి, చెన్నై: మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లిన తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పర్యటక ప్రాంతమైన నీలగిరి కొండల్లో భారీ వర్షాలతో.. వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. పిల్లూరు ఆనకట్టకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో.. ఆనకట్ట ప్రమాదకరంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా నీలగిరి జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పిల్లూరు ఆనకట్ట దిగవ ప్రాంతంలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్స్ సాయంను కోరింది. దానికితోడు ప్రభుత్వ యంత్రాంగమంతా ఎప్పటికప్పడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. సహాయ చర్యలను ముమ్మరం చేస్తోంది. మరోవైపు కావేరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహాక ప్రాంతాల్లో దండోరా వేసి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో హోగెనేకల్‌లో వాగులు, జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. మరోవారం పాటు ఇదే స్థాయిలో వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ
సాక్షి, చెన్నై: నీలగిరుల్లో వరుణుడు ప్రళయ తాండవం చేశాడు. జనావాస ప్రాంతాల్లో కాకుండా అడవుల్లో భారీ వర్షం పడింది. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఊటీ సముద్రాన్ని తలపిస్తుంది. నీలగిరులు వరదలతో అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతో నీలగిరి కొండల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండల నడుమ ఉండే ఊటీ పట్టణంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో పట్టణంలోని అన్ని వీధులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఊటీ నడిబొడ్టున ఉండే లేక్ లోకి వరదనీరు పోటెత్తటంతో బస్టాండు, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు వాగుల్లా దర్శనిమిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాని పరిస్థితి. కొన్ని కాలనీలు నీట మునగటంతో ప్రభుత్వ సిబ్బంది వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నీలగిరి జిల్లాలోని ఊటీ, కూనూరు, కొత్తగిరి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఊటీ వచ్చే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా మేట్టుపాలయం ఊటీ మార్గాలలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు నిత్యావసర వస్తువులను మాత్రం భద్రతతో అనుమతిస్తున్నారు. ఇక కోయంబత్తూరులో ఇద్దరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. -
నీలగిరి కొండల్లో కార్చిచ్చు
సాక్షి, చెన్నై: తమిళనాడు ఊటీలోని నీలగిరి కొండల్లో కార్చిచ్చు చెలరేగింది. ముదుమలై అటవీ ప్రాంతంలోని మేఘమలై కొండల్లో అగ్రి కీలలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి దగ్దమవుతుంది. ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో మంటుల ఆర్పేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పది రోజుల కిందట కూడా ముదుములై టైగర్ రిజర్వ్‌లో మంటలు చెలరేగగా 50 ఎకరాల అటవీ ప్రాంతం దగ్దమయింది. ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. -
పారిశ్రామిక కారిడార్‌గా నీలగిరి
పరిశ్రమల కారిడార్ వైపు నీలగిరి అడుగులు వేస్తోంది. టీఎస్ ఐపాస్ ద్వార 2018 ఫిబ్రవరి వరకు 211 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు రూ.26,770 కోట్ల 92లక్షల పెట్టుబడులు పెడుతున్నారు. దీని ద్వార 8,950 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నల్లగొండ రూరల్ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పుష్కరాల సందర్భంగా సాగర్, మఠంపల్లి, ప్రాం తాలకు రోడ్డు మార్గాలను పటిష్టపర్చారు. 2020–25 నాటికి విజయవాడ హైవే ఎక్స్‌ప్రెస్ హైవేగా మారనుండటం, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి కూడా విస్తరించడం, నడికూడ–మాచర్ల డబ్లింగ్ రైలు పనులు, భూదాన్ పోచంపల్లి నుంచి రీజనల్‌రింగ్ రోడ్డు, నకిరేకల్–నాగార్జునసాగర్ వరకు జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో పరిశ్రమల ద్వార ఉత్పత్తి అయిన వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. యాదాద్రి పవర్ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే దామర్లచర్ల, మిర్యాలగూడ, నిడమనూరు తదితర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన అవకాశాలున్నాయి. త్వరితగతిన అనుమతులు చౌటుప్పల్ మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటం వలన పరిశ్రమల అనుమతులు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పరిశ్రమలను నల్లగొండ జిల్లాలో స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో భారీగా పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే 82 పరిశ్రమలను స్థాపించారు. రూ.610 కోట్లు పెట్టుబడి పెట్టి 1968 మందికి ఉద్యోగాలు కల్పించారు. మరో 28 పరిశ్రమలు ఈనెలాఖరులోగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా 39 పరిశ్రమలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. 57 పరిశ్రమలు స్థాపనకు పనులు జరుగుతున్నాయి. దామరచర్ల ప్రాంతంలో గ్రానైట్ కటింగ్ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తే పరిశ్రమను మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా మార్బుల్స్‌ను వినియోగిస్తున్నారు. మార్బుల్స్ వినియోగం వలన వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చధనాన్ని గుణం వున్నట్లుగా ఇటలి శాస్త్రవేత్తలు తేల్చారు. కోళ్ల ఫారం దానాలు జిన్నింగ్ మిల్లులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తే మంచి ఉత్పిత్తి కి మంచి మార్కెటింగ్ ఉంటుంది. ప్రస్తుతం 2 జిన్నింగ్ పరిశ్రమలున్నప్పటికీ ఆధునిక పరిజ్ఞానం లేకపోవడంతో అంతర్జాతీయంగా పోటీని తట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత పరిశ్రమలు భారీగా ఏర్పాటవుతున్నాయి. మోడ్రన్ రైసు మిల్లులు ఏర్పాటయితే ఇతర దేశాలకు కూడా డిమాండ్ పెరగనుంది. ఏడు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ వినియోగం అందుబాటులోకి రానుంది. పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, రోడ్డు రవాణా, మార్కెటింగ్ సులభమవుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనువైన ప్రాంతం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు రీజనల్ రింగు రోడ్లు, ఎక్స్‌ప్రెస్ హైవే మార్గాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొస్తున్నారు. చేనేత, గ్రానైట్, రైస్, జిన్ని, కాటన్, సోలార్, పవర్‌ప్లాంట్స్, మార్బుల్ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల గనిగా మారింది. – కోటేశ్వర్రావు, పరిశ్రమల శాఖ జీఎం -
నీలగిరిలోనే మిర్యాల !
సాక్షి, నల్లగొండప్రతినిధి : జిల్లాల విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు నల్లగొండలోని మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రతిపాదించారు. సూర్యాపేటలో ఐదు, నల్లగొండలో ఐదు, యాదాద్రిలో రెండు నియోజకవర్గాల చొప్పున ఉంచాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే.. మిర్యాలగూడ ప్రజలు ఈ నిర్ణయంపై తమ అసంతృప్తిని తెలియజేస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమను నల్లగొండలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంత ఆలోచన చేసి మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచేలా మరో ప్రతిపాదన తయారుచేశారు. దీనికి తోడు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా సీఎంతో ఈ విషయాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. అంతా సజావుగానే ఉంది.. మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచుతున్నారని భావిస్తుండగా ఇటీవల జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో అధికార పార్టీకి చెందిన జిల్లా నాయకులు మూకుమ్మడిగా (ఎమ్మెల్యే భాస్కరరావు, ఎంపీ గుత్తా మినహా) మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేటలోనే ఉంచాలని చెప్పారు. మిర్యాలగూడను సూర్యాపేటలోనే ఉంచడం వల్ల రాజకీయ, సామాజిక, ఆర్థిక సమీకరణలు సమంగా విభజించినట్టవుతుందని తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. అఖిలపక్ష సమావేశం, డ్రాఫ్ట్ నోటిఫికేషన్లకు గడువు సమీపిస్తున్న కొద్దీ ఈ నియోజకవర్గాన్ని ఏం చే స్తారోననే సస్పెన్స్ అన్ని వర్గాల్లో మొదలైంది. దీంతో కొందరు మళ్లీ పోరుబాట పట్టాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వద్ద జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచాలని నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు అఖిలపక్షం ముందు కూడా ఇదే ప్రతిపాదన ఉంచనున్నారు. అఖిలపక్షం అంగీకరించి , ఇంకెవరూ అభ్యంతరపెట్టకపోతే అదే ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 26...19...18 సీఎం ఆమోదించిన డ్రాఫ్ట్ ప్రకారం నల్లగొండ జిల్లాలో 26 మండలాలు ఉండనున్నాయి. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు నల్లగొండలోనే ఉండనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలాలు మాత్రం యాదాద్రి జిల్లాకు వెళ్తాయి. ఇక.. నాలుగు నియోజకవర్గాలతోనే సూర్యాపేట ఏర్పాటు కానుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలతో ఈ జిల్లా ఏర్పాటు కానుండగా.. తుంగతుర్తిలోని మోత్కూరు మండలాన్ని యాదాద్రి జిల్లాతో కలపనున్నారు. దీంతో సూర్యాపేట జిల్లాలో కేవలం 19 మండలాలే ఉన్నాయి. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాలో రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్‌తో పాటు వరంగల్ జిల్లా నుంచి లింగాల ఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పల, జనగామ మండలాలు కలిపి మొత్తం 18 మండలాలను ఏర్పాటు చేయనున్నారు. విస్తీర్ణం విషయానికి వస్తే నల్లగొండ జిల్లా చాలా పెద్ద జిల్లాగా ఉండనుంది. 7217.72 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 27 జిల్లాల్లోనే రెండో పెద్ద జిల్లాగా నల్లగొండ మారనుంది. నల్లగొండ కన్నా ఆదిలాబాద్ నుంచి ఏర్పాటవుతున్న కొమురంభీం జిల్లా పెద్దది. జనాభా విషయంలోనూ నల్లగొండ నాలుగో స్థానంలో ఉంటోంది. రంగారెడ్డి (అర్బన్), మల్కాజ్గిరి, హైదరాబాద్ తర్వాత నల్లగొండలోనే ఎక్కువ జనాభా ఉంటోంది. మండలాల విషయానికి వస్తే నల్లగొండలో ఉన్నన్ని మండలాలు ఏ జిల్లాలో లేవు. 26 మండలాలతో అతిపెద్ద జిల్లాగా నల్లగొండ రూపుదిద్దుకోనుంది. -
నీలగిరి @ 45 డిగ్రీలు...
* మండుతున్న ఎండలు * బోసిపోయిన రహదారులు నల్లగొండ రూరల్ : ఎండ తీవ్రత, వడగాల్పుల కారణంగా జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం జిల్లా అంతటా వడగాల్పులు, ఎండతీవ్రత ఉండటంతో జనం విలవిలాడిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు, గొర్రెలు, పశువుల పెంపకం దారులు వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరయ్యారు. చెట్ల నీడచాటును పశువులు, జీవాలు తలదాచుకోగా పక్షులు నీళ్ల కోసం నోర్లు తెరిచాయి. అన్ని పట్టణ కేంద్రాల్లో 11 గంటలకే రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావడానికి ఆసక్తి చూపడంలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని పానియాలను ఆశ్రయించారు.