నీలగిరి @ 45 డిగ్రీలు... | Nilagiri @45 Degrees | Sakshi
Sakshi News home page

నీలగిరి @ 45 డిగ్రీలు...

Published Sat, Apr 23 2016 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

నీలగిరి @ 45 డిగ్రీలు...

నీలగిరి @ 45 డిగ్రీలు...

* మండుతున్న ఎండలు
* బోసిపోయిన రహదారులు

నల్లగొండ రూరల్  : ఎండ తీవ్రత, వడగాల్పుల కారణంగా జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం జిల్లా అంతటా వడగాల్పులు, ఎండతీవ్రత ఉండటంతో జనం విలవిలాడిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు, గొర్రెలు, పశువుల పెంపకం దారులు వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరయ్యారు.

చెట్ల నీడచాటును పశువులు, జీవాలు తలదాచుకోగా పక్షులు నీళ్ల కోసం నోర్లు తెరిచాయి. అన్ని పట్టణ కేంద్రాల్లో 11 గంటలకే రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావడానికి ఆసక్తి చూపడంలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని పానియాలను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement