భూముల కొనుగోళ్లకు టాప్‌–5 కారిడార్లు | Top 5 Corridors for Land Acquisition | Sakshi
Sakshi News home page

భూముల కొనుగోళ్లకు టాప్‌–5 కారిడార్లు

Sep 21 2023 6:19 AM | Updated on Sep 21 2023 6:19 AM

Top 5 Corridors for Land Acquisition - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్‌–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్‌–మాతేరన్, గుజరాత్‌ లోని సనంద్‌–నల్‌సరోవర్‌ భూములపై పెట్టుబడులకు టాప్‌–5 కారిడార్లుగా కొలియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్‌ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్‌ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది.

దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్‌ ఇండియా పేర్కొంది.  

మూడు రెట్లు
హైదరాబాద్‌ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్‌–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్‌ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్‌ ఏర్పడుతుందని, స్మార్ట్‌ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement