revenues
-
భారత ఎయిర్‌పోర్ట్‌ల వ్యూహాలు మారాలి
న్యూఢిల్లీ: భారత విమానాశ్రయాలు తమ ధరల వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ ఏరో నాటికల్ ఆదాయాలను మరింత పెంచుకోవడం ద్వారా లాభదాయకతను వృద్ధి చేసుకోవాలని ఈ రంగానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సూచించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీ పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించగా, ఏటేటా ఎయిర్ ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) పెరుగుతూ వెళుతుండడం తెలిసిందే. దీంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తమ సేవలను విస్తరిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో కాపా ఇండియా విడుదల చేసిన నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నడిచే విమానాశ్రయాలు నాన్ ఏరో మర్గాల (విమానయేతర) ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఇది సూచించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని విమానాశ్రయలతో పోలిస్తే పీపీపీ విధానంలోని విమానాశ్రయాల్లో నాన్ ఏరో ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ ఇవన్నీ పీపీపీ విధానంలో నడిచే విమానాశ్రయాలు కాగా, 2019–2020లో నాన్ ఏరో ఆదాయంలో వీటి వాటాయే 71 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్‌లో మాత్రం వీటి వాటా 53 శాతమే’’అని కాపా ఇండియా తెలిపింది. ఇంకా అవకాశాలున్నాయి..విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి నాన్ ఏరో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మరింత పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు కాపా ఇండియా అభిప్రాయపడింది. ఇందుకోసం విమానాశ్రయాలు తమ ధరల విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ల వనరుల విషయంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉన్నాయా? ఎయిర్‌లైన్ వ్యాపార నమూనా, ఫ్రీక్వెన్సీ, ప్యాసింజర్ల ప్రొఫైల్ మధ్య భారీ వైరుధ్యం ఉందా అనేది పరిశీలించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశీ ఎయిర్‌లైన్స్ 6.61 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించడం గమనార్హం. క్రితం ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారు 6.36 కోట్లుగా ఉన్నారు. -
ఆదాయాన్ని పెంచండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులు, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, భూగర్భ గనులు తదితర శాఖలు ఈ అంశంపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించిన తరువాత ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవడానికి యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలన్నారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంలో పురోగతిని తరచూ సమావేశాల ద్వారా సమీక్షించుకోవాలని సూచించారు. తక్కువ వడ్డీ సంస్థలకు ఆర్టీసీ రుణాలు బదలాయించాలి ఆరీ్టసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయించాలని, ఆదాయం పెంచుకునే మార్గాలు వెతకాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆరీ్టసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలిఎల్ఆర్ఎస్ కింద చేసుకున్న దరఖాస్తులు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇళ్లు, వచి్చన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారీ చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆసుపత్రిలోనూ ఆయా చికిత్సలు అందించేలా వారితో చర్చించి ఒప్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
జియో ఎఫెక్ట్ : మళ్లీ పడిన వొడాఫోన్
టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో సంచలనంతో దిగ్గజాలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. దేశీయ రెండో అతిపెద్ద టెలికాం వొడాఫోన్ మరోసారి తన క్వార్టర్ ఫలితాల్లో కిందకి పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో వొడాఫోన్ రెవెన్యూలు 22.3 శాతం క్షీణించి 959 మిలియన్ యూరోలుగా(రూ.7706 కోట్లగా) రికార్డైనట్టు తెలిసింది. టర్మినేషన్ రేట్ల కోత, తీవ్రతరమవుతున్న పోటీ నేపథ్యంలో తన రెవెన్యూలను కోల్పోయినట్టు వొడాఫోన్ ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో 1.387 బిలియన్ యూరోల రెవెన్యూలను ఈ కంపెనీ పోస్టు చేసింది. కాగ, రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఒకటిగా అతిపెద్ద దేశీయ టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి. ఈ విలీనానికి టెలికాం డిపార్ట్మెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు వరకు తమ విలీనాన్ని పూర్తి చేస్తామని ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే గత మార్చి క్వార్టర్‌తో పోలిస్తే, సర్వీసు రెవెన్యూలు కేవలం 0.2 శాతం మాత్రమే తగ్గాయని కంపెనీ చెప్పింది. ఈ మూడు నెలల కాలంలో ప్రీపెయిడ్ ధరలు స్థిరంగా కొనసాగించడంతో, కాస్త సర్వీసు రెవెన్యూల నష్టాలను తగ్గించుకోగలిగామని పేర్కొంది. పోస్టు పెయిడ్ కనెక్షన్లకు ఒక్కో యూజర్ సగటు రెవెన్యూ 20 శాతం పడిపోయిందని, ప్రీపెయిడ్ కనెక్షన్లకు 28 శాతం తగ్గిందని ఫైల్ చేసింది. 29 శాతానికి పైగా తమ ప్రీపెయిడ్ యూజర్లు అపరిమిత ఆఫర్లను పొందుతున్నారని, 77 మిలియన్ మంది డేటాను వాడుతుండగా.. వారిలో 20.9 మిలియన్ల మంది 4జీ ని కలిగి ఉన్నారని పేర్కొంది. భారత్‌లో డేటా ధరలు భారీగా తగ్గిపోవడంతో, కస్టమర్లు నెలకు సగటున 4.6జీబీ డేటా వాడుతున్నట్టు వొడాఫోన్ చెప్పింది. ఇదే యూరప్‌లో అయితే కేవలం 2.8 జీబీ మాత్రమేనని వెల్లడించింది. అయితే తక్కువ ధరల వద్ద హై-వాల్యు కస్టమర్లను కాపాడుకునే సత్తా తమకు ఉందని కంపెనీ చెప్పింది. -
ఆలస్యమైతే కస్టమర్లు, రెవెన్యూలు హుష్‌కాకి
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించేందుకు.. వొడాఫోన్, ఐడియాలు విలీనం కాబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రితమే ఇరు కంపెనీలు విలీనంపై తుది ప్రకటన ఇచ్చేశాయి. అప్పటి నుంచి ఈ కంపెనీలు విలీన ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాలేకపోయింది. వొడాఫోన్ ఇండియా-ఐడియా సెల్యులార్ విలీనం ఆలస్యమైతే, వీటి మెగా కంపెనీ భారీగా కస్టమర్లను, రెవెన్యూలను నష్టపోయే ప్రమాదముందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విలీన ప్రక్రియ ముగియడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశముందని, ఈ సమయంలో రెవెన్యూ మార్కెట్ షేరులో ఈ సంస్థ 150 బేసిస్ పాయింట్లను కోల్పోయే ప్రమాదముందని తెలుస్తోంది. దీంతో ప్రతి రెండు నెలల జాప్యానికి 600 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు రెవెన్యూలను ఈ విలీన సంస్థ కోల్పోతుందని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని చెప్పారు. కీలక కస్టమర్లను, రెవెన్యూ మార్కెట్ షేరును భారతీ ఎయిర్‌టెల్‌కు, రిలయన్స్ జియోకు వదులుకోవాల్సి వస్తుందని కులకర్ని తెలిపారు. మార్కెట్ వ్యూహాల విధంగా వెళ్లి, విలీనాన్ని త్వరగా ముగించేయాలని చెప్పారు. గత నెల చివరి వరకే వొడాఫోన్, కుమార్ బిర్లాకు చెందిన ఐడియాల విలీన ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. కానీ మూడో పార్టీ ఆసక్తి మేరకు ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. మెగా విలీనాన్ని వొడాఫోన్, ఐడియాలు రెండూ విజయవంతంగా ముగిస్తాయని, కొంత సమస్యం ఆలస్యమైతే అంత ప్రమాదకరమేమీ కాదని కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ అన్నారు. విలీన సంస్థలో ఇరు కంపెనీలకు సమానమైన యాజమాన్య హక్కులు ఉంటాయి. విలీన సంస్థ పేరును వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ప్రతిపాదించారు. విలీన సంస్థలో వొడాఫోన్ గ్రూప్ 45.1 శాతం, ఐడియా ప్రమోటర్లు 26 శాతం వాటా కలిగి ఉండనున్నారు. మిగతా 28.9 శాతం వాటా పబ్లిక్ షేర్ హోల్డర్ల వద్ద ఉండనుంది. -
జనవరిలో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : జనవరిలో జీఎస్టీ మొత్తం రాబడి ఫిబ్రవరి 25 వరకూ రూ 86,318 కోట్లు వసూలైందని కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2017లో జీఎస్టీ వసూళ్లు రూ 86,703 కోట్లుగా నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. జీఎస్టీ కింద ఇప్పటివరకూ 1.03 కోట్ల మంది పన్నుచెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని..17.65 లక్షల మంది డీలర్లు కాంపోజిషన్ డీలర్లుగా నమోదు చేసుకున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 17.65 లక్షల డీలర్లలో 1.23 లక్షల కాంపోజిషన్ డీలర్లు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవడంతో రెగ్యులర్ పన్నుచెల్లింపుదారులయ్యారని పేర్కొంది. ఇక జనవరిలో జీఎస్టీ కింద వసూలైన రూ 86,318 కోట్లలో రూ 19,961 కోట్లు సీజీఎస్టీగా, రూ 19961 కోట్లు ఎస్జీఎస్టీగా, రూ 43,794 కోట్లు ఐజీఎస్టీగా, రూ 8331 కోట్లు కాంపెన్సేషన్ సెస్‌గా వసూలయ్యాయి. -
ఫ్లిప్‌కార్ట్‌కు భారీగా పెరిగిన నష్టాలు
బెంగళూరు : అమెజాన్‌కు మాత్రమే కాక ఫ్లిప్‌కార్ట్‌కు భారీగా నష్టాలు పెరిగిపోయాయి. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ పేరెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ లిమిటెడ్ రూ.8,771 కోట్ల నష్టాలను మూటకట్టుకున్నట్టు వెల్లడైంది. 2015-16లో ఈ నష్టాలు రూ.5,223 కోట్లగానే ఉన్నాయి. అంటే 67 శాతం మేర ఫ్లిప్‌కార్ట్ నష్టాలు పెరిగాయి. ఈ నష్టాలు పెరగడానికి ప్రధాన కారణం డిస్కౌంట్లు, మార్కెటింగ్‌పై ఎక్కువగా వెచ్చించడమేనని తెలిసింది. అమెజాన్‌కు తీవ్ర పోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ కూడా తన వెచ్చింపులను పెంచింది. కాగ, గతేడాది ముగింపు నాటికి ఫ్లిప్‌కార్ట్ రెవెన్యూలు రూ.19,854 కోట్లకు పెరిగాయని కూడా పేర్కొంది. వెంటనే అందుబాటులో ఉండే నగదు(క్యాష్ ఇన్ హ్యాండ్) కూడా 13 శాతం తగ్గిపోయి రూ.3,579 కోట్లగా ఉందని తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్/బాండ్స్‌లో పెట్టుబడులు 78 శాతం తగ్గిపోయాయని చెప్పింది. అడ్వర్టైజ్మెంట్, బిజినెస్ ప్రమోషన్ ఖర్చులు పెరిగాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఫ్లిప్‌కార్ట్ లిమిటెడ్ వెల్లడించింది. అమెజాన్ తన తుది త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన అనంతరం, ఫ్లిప్‌కార్ట్ తన ఫైనాన్సియల్ నెంబర్లను విడుదల చేసింది. అమెజాన్‌కు కూడా అంతర్జాతీయ వ్యాపారాల నుంచి భారీగా 3 బిలియన్ డాలర్ల వరకు నష్టాలు వచ్చాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ నష్టాలు అంచనాలకు తగ్గట్టే వచ్చాయని తెలిసింది. 2018లో గ్రోసరీ, ఆఫ్‌లైన్ ఛానల్‌పై పెట్టుబడులపై ఎక్కువగా ఫోకస్ చేస్తుందని, మార్కెట్ షేరును దక్కించుకోవడానికి ఈ ఏడాది కూడా ఖర్చులను పెంచుతుందని ఫార్రెస్టర్ రీసెర్చ్ అనాలిస్ట్ సతీష్ మీనా తెలిపారు. ఫ్యాషన్ నుంచి ఎలక్ట్రానిక్స్, స్మార్ట్పోన్ల వరకు ప్రైవేట్ లేబుల్ బ్రాండ్ల కేటగిరీలపై తాము ఎక్కువగా ఫోకస్ చేస్తామని, వీటిలో మార్జిన్లు ఎక్కువగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. మూడేళ్లలో మొత్తంగా విక్రయాల వాల్యుమ్ను 15 నుంచి 20 శాతం పెంచుకున్నట్టు ఫ్లిప్‌కార్ట్ అంచనావేస్తోంది. నెలవారీ యాక్టివ్ యూజర్లపై కూడా ఫోకస్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. -
ఓపెనింగ్ రోజే షియోమికి 5 కోట్ల రెవెన్యూలు
చైనా ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ దిగ్గజం షియోమికి ఇటీవల పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లో షియోమి ప్రొడక్ట్ర్ లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఆఫ్ లైన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ తన సత్తా చాటేందుకు ఎంఐ హోమ్ స్టోర్ పేరుతో షియోమి వచ్చేసింది. మే 20న షియోమి తన తొలి ఎంఐ హోమ్ స్టోర్ ను బెంగళూరులో ప్రారంభించింది. ప్రారంభించిన 12 గంటల్లోనే ఎంఐ హోమ్ కు 5 కోట్ల రెవెన్యూలు వచ్చి, రికార్డులు సృష్టించాయి. 10వేల మందికి పైగా కస్టమర్లు ఓపెనింగ్ డే రోజు ఎంఐ హోమ్ స్టోర్ వద్ద షియోమి ఫోన్లు, ఎకో సిస్టమ్ ఉత్పత్తులు, యాక్ససరీస్ కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ రెవెన్యూల్లో ఎక్కువగా టాప్ సెల్లింగ్ రెడ్ మి ఫోన్లు రెడ్ మి4, రెడ్ మి 4ఏ, రెడ్ మి నోట్4ల నుంచే వచ్చినట్టు కంపెనీ తెలిపింది. దీనిలో ఆడియో ఆక్ససరీస్, ఎంఐ వీఆర్ ప్లే, ఎంఐ ఎయిర్ ఫ్యూరిఫైయర్ 2, కొత్తగా లాంచ్ చేసిన ఎంఐ రూటర్ 3సీ, ఎంఐ బ్యాండ్ 2లు కూడా ఉన్నాయి. చైనా, హాంకాంగ్ వంటి మార్కెట్ల తర్వాత ఎంఐహోమ్ స్టోర్ ను ఏర్పాటుచేసిన భారత మార్కెట్ ఐదవది. దీనిలో స్మార్ట్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, హెడ్ ఫోన్లు, ఫిట్ నెస్ బ్యాండ్లు, ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, ఇతర ఎకో సిస్టమ్ ప్రొడక్ట్ లు దొరుకుతాయి. వచ్చే రెండేళ్లలో 100 ఎంఐ హోమ్ స్టోర్లను ఏర్పాటుచేయాలని షియోమి ప్లాన్ చేస్తోంది. ఎంఐ హోమ్ స్టోర్లు తర్వాత వచ్చే మెట్రో సిటీల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలు ఉన్నాయి. -
యోగాగురు బాబా రాందేవ్ భారీ టార్గెట్
యోగాగురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి కంపెనీ భారీ లక్ష్యంతోనే మార్కెట్లో పరుగులు పెడుతోంది. కంపెనీ విక్రయాలు 2018 ఆర్థిక సంవత్సరంలో రెండింతలు పెంచుకుని 20వేల కోట్ల రూపాయలకు పైగా నమోదుచేయాలని కంపెనీ నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను కూడా రెండింతలు పెంచుకుని 12వేలకు చేర్చుకోవాలని ప్లాన్ వేస్తోంది. రాబోయే ఐదేళ్లలో బహుళజాతి సంస్థలను దేశం నుంచి తరిమి కొడతామని యోగాగురు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ హెచ్చరికల అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలో తన రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని నిర్ణయించింది. అంతేకాక, ప్రస్తుతమున్న తన బలాన్ని పెంచుకోవాలని, చాలా ప్రొడక్ట్ కేటగిరీల్లో తామే ముందంజలో ఉండాలని పతంజలి యోచిస్తోంది. 2017 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో హరిద్వార్ కు చెందిన ఈ కంపెనీ టర్నోవర్ రూ.10,561 కోట్లగా ఉంది. ''ఈ టర్నోవర్ ను వచ్చేఏడాదికి రెట్టింపు చేసుకుంటాం. వచ్చే ఏడాది కల్లా ఆధిపత్య స్థానంలోకి వచ్చేస్తాం. మార్కెట్లో ఉన్న చాలా ప్రొడక్ట్స్ లో మేమే నెంబర్ వన్ గా ఉంటాం'' అని యోగా గురు బాబా రాందేవ్ చెప్పారు. మెగా ప్రొడక్షన్ యూనిట్లను నెలకొల్పేందుకు కూడా కంపెనీ తన ప్రక్రియను ప్రారంభించింది. నోయిడా, నాగ్ పూర్, ఇండోర్ లలో ఈ మెగా ప్రొడక్షన్ యూనిట్లను స్థాపిస్తోంది. దీంతో ప్రస్తుతమున్న 35వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 60వేల కోట్లకు చేర్చుకోనుంది. -
ఆ దెబ్బకు గూగుల్‌కు 5వేల కోట్లు తుస్
మార్కెట్లో దిగ్గజ కన్జ్యూమర్ బ్రాండు కంపెనీలన్నీ దాదాపు వీడియో-హౌస్టింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ను బ్లాక్ చేసేశాయి. అభ్యంతరకర వీడియోల దగ్గర తమ ప్రకటనలు ప్రచురిస్తున్నారనే కారణంతో యూట్యూబ్ కు ప్రకటనలు ఇవ్వమని తేల్చేశాయి. దీంతో యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ కు భారీగానే దెబ్బతగలనుందట. సుమారు రూ.4,879 కోట్ల రెవెన్యూలను గూగుల్ కోల్పోతుందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొన్ని వారాలుగా కన్జ్యూమర్ బ్రాండు దిగ్గజాలు జాన్సన్ అండ్ జాన్సన్, పెప్సీకో, మెక్ డొనాల్డ్ కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. వీటితో పాటు పలు టెలికాం కంపెనీలు, ప్రముఖ కంపెనీలు యూట్యూబ్ కు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించేశాయి. టెర్రరిజంకు సంబంధించిన గ్రూప్‌లు పోస్టు చేసే వీడియోల దగ్గర తమ వ్యాపార ప్రకటనలను యూట్యూబ్ ఇస్తుందని కంపెనీలు ఆగ్రహించాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని గూగుల్ చెప్పినప్పటికీ, ఇప్పటికీ దీనిపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంతో సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ షేరు ధర అంతర్జాతీయంగా పడిపోతుంది. ఈ సమస్యను గూగుల్ వెంటనే పరిష్కరించాలని లేదంటే భారీ మూల్యాన్నే కంపెనీ మూటకట్టుకోవాల్సి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ నోముర ఇన్స్టినెట్ చెబుతోంది. యూట్యూబ్ వార్షిక రెవెన్యూలు ఈ ఏడాది 10.2 బిలియన్ డాలర్ల వరకు అంటే రూ.66,344కోట్లకు పైనే ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. కానీ ఈ వివాదంతో 7.5 శాతం మేర రెవెన్యూలను కోల్పోవాల్సి ఉంటుందని నోమురా హెచ్చరిస్తోంది. -
మెగా విలీనం: 40కోట్ల యూజర్లు, 80 కోట్ల రెవెన్యూలు
మెగా విలీనానికి ఓకే చెబుతూ ఐడియా సెల్యులార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఈ సంస్థ అవతరించబోతుంది. వైర్ లెస్ సబ్స్క్రైబర్లలో ఈ సంస్థ మార్కెట్ లీడర్ గా నిలువబోతుంది. ఇన్ని రోజులు వొడాఫోన్ రెండో స్థానంలో, ఐడియా మూడో స్థానంలో ఉండగా.. టెలికాం లీడర్ గా భారత్ ఎయిర్ టెల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగేది. ఇటీవలే టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది. దీంతో ఇటు ఎయిర్ టెల్ స్థానాన్ని దక్కించుకుని, రిలయన్స్ జియో దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వొడాఫోన్, ఐడియాలు విలీనానికి తెరలేపాయి. ఇండియా రేటింగ్స్ ప్రకారం ఈ మెగా విలీనంతో కంపెనీకి 80 కోట్ల రెవెన్యూలు వచ్చి చేరతాయని తెలిసింది. స్పెక్ట్రమ్ డూప్లికేషన్ అరికడుతూ నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ డీల్ ఎంతో సహకరించనుందట. ఖర్చులు తగ్గడంతో ఈ సంస్థకు ఈబీఐటీడీఏ మార్జిన్లు 250-350 బేసిస్ పాయింట్లు మెరుగుపడతాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ముఖ్యంగా నెట్ వర్క్, మార్కెటింగ్ వ్యయాలపై ఖర్చులు తగ్గుతాయన్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ చాలా గట్టి పునాదులను ఏర్పరుచుకుంది. ఐడియా ఎక్కువగా రూరల్ మార్కెట్ పై ఫోకస్ చేస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రెండింటి కలయికతో 205 మిలియన్ వొడాఫోన్ యూజర్లు, 190 మిలియన్ ఐడియా యూజర్లు ఒకటై మొత్తం 40 కోట్ల సబ్‌స్క్రైబర్ బేసిస్ తో విలీన సంస్థ ఏర్పడుతోంది. మార్కెట్లో మొత్తం 43 శాతం షేరును సంపాదించుకోనుంది. ఇది ప్రత్యర్థి ఎయిర్ టెల్ కంపెనీ కంటే 10 శాతం ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
నెస్లీ కి మ్యాగీ తప్ప మరోదారి లేదా?
మ్యాగీ వివాదం నెస్లీ ఇండియాను ఆర్థికంగా, నైతికంగా బాగా దెబ్బతీసింది. మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ ఉందని తేలడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందుల్లో పడింది. భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే కంపెనీ నష్టాల నుంచి బయట పడటానికి వేరే మార్గం లేదా అంటే.. ఉందనే అంటున్నారు పెట్టుబడిదారులు. మ్యాగీ ఉత్పత్తులపైనే కాక మిగతా వాటిపై కూడా దృష్టిసారించాలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. నెస్లీ తన అమ్మకాలను 70శాతం పెంచుకోవడానికి మ్యాగీ ఉత్పత్తులపై కాకుండా కంపెనీ ఆఫర్ చేసే మరో మూడు ఉత్పత్తులపై దృష్టిసారించాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాల ఉత్పత్తుల వాల్యుమ్, న్యూట్రిషన్ విభాగం కూడా వరుసగా నాలుగు ఏడాదులు నష్టాల్లో నడవడం, బెవరేజస్,చాకోలేట్ల అమ్మకాలు పతనం నుంచి బయటపడాలని భావిస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణ వాతావరణంలో వాల్యుమ్ పైన కాకుండా కేవలం అమ్మకాలు, లాభాలపైనే దృష్టిసారించడంతో, కంపెనీకి ఈ నష్టాల వస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. కొన్ని కేటగిరి ఉత్పత్తులో డిస్కౌంట్లు ఆఫర్ చేసి, అమ్మకాల వృద్ధిని పెంచుకోవడంలో నెస్లీ దూకుడులో ఉన్నప్పటికీ, ఇవి నిర్వహణ లాభాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదన్నారు. మార్చి క్వార్టర్లో మెటీరియల్ ఖర్చులు కూడా పెరిగాయన్నారు. పామ్ ఆయిల్ వంటి కమోడిటీల రేట్లను నెస్లీ పెంచింది. కంపెనీ ఆఫర్ చేసే ఉత్పత్తులపై రేట్లను తగ్గించుకుని, పట్టణ వినియోగాన్ని పెంచుకుంటే నెస్లీ లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అన్నీ కేటగిరీలోనూ వాల్యుమ్ వృద్దిని నెస్లీ చేపడితే లాభాలను నమోదుచేయొచ్చని చెబుతున్నారు. అమ్మకాలు, మార్జిన్లలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లలో కంపెనీపై ఆసక్తిని పెంచడానికి ఈ నష్టాలను నెస్లీ అధిగమించాల్సి ఉంది. మ్యాగీ ఉత్పత్తులు పునఃప్రారంభమయ్యాక కూడా నెస్లీ స్టాక్ 5.7శాతం కిందకే నమోదవుతోంది. మ్యాగీ ఉత్పత్తులు మార్కెట్లోకి పునఃప్రారంభమయ్యాక 50శాతం మార్కెట్ షేరును అవే నమోదుచేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ అమ్మకాలు మార్చి క్వార్టర్లో గతేడాది ఇదే త్రైమాసికం కంటే 8.4శాతం పడిపోయాయని తెలిపింది. ఈ క్షీణత డిసెంబర్ త్రైమాసికంలో 24శాతం నెస్లీ అమ్మకాలు పతనం కంటే తక్కువే ఉందని తెలిపింది. ముందటి త్రైమాసికాలతో పోలిస్తే ఈ అమ్మకాల క్షీణత కొంత మెరుగుపడిందని కంపెనీ ప్రకటించింది. మ్యాగీ మసాలా వేరియంట్ ను నవంబర్ లో కంపెనీ పునఃప్రారంభించింది. నిర్వహణ లాభాలు 3.5 శాతం పెరుగుతూ వస్తున్నాయని, కానీ ఇవి గతేడాది కంటే 1శాతం తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాలు, ఇతరాత్ర ఖర్చులు పెరగకపోవడం వల్ల ఈ లాభాలను ఆర్జిస్తున్నామని, అదేమాదిరి కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడం లేదని తెలిపింది. -
మీ ఆరోగ్యానికి బీమా ఎంత..?
గడిచిన కొన్ని దశాబ్దాలుగా జనం ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే వారు పెట్టే ఖర్చు కూడా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఇది గొప్ప విజయమే. అయితే జీవిత వేగం పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది. పని గంటలూ పెరుగుతున్నాయి. దీంతో భారతీయుల్లో జీవన సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం... భారతీయులు ప్రతి నలుగురిలో ఒకరు డయాబెటిస్, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో 70 ఏళ్లలోపు మరణిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం దేశంలో 6.2 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 20 లక్షలు అధికం. వార్షిక ద్రవ్యోల్బణం 7 నుంచి 8 శాతం ఉంటోందనుకున్నా... ైవె ద్య ద్రవ్యోల్బణం మాత్రం 18 నుంచి 20 శాతం ఉంటోంది. కానీ వైద్య ఖర్చుల్లో బీమా ద్వారా చెల్లిస్తున్నవి కేవలం 5 శాతం. ఈ పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఇపుడు ఆసుపత్రిలో చేరటమంటే దాదాపు దివాలా తీసినట్టే. అందుకని చక్కని వైద్య బీమాను తీసుకోవటం అత్యుత్తమం. అయితే ఇది ఎలాంటి వైద్యపరమైన సంక్షోభంలోనైనా మనల్ని ఆదుకునేలా ఉండాలి. ఆరోగ్య రిస్క్‌ను మేనేజ్ చేయటమెలా? ఆరోగ్య సమస్యలను, జీవన విధానాన్ని విశ్లేషించటం ద్వారా ఎవరైనా రాబోయే వ్యాధుల గురించి కూడా తెలుసుకునే అవకాశముంటుంది. మీరు తీసుకునే పాలసీ.. భవిష్యత్తులో రావటానికి అవకాశమున్న వ్యాధులకూ కవరేజీ ఇచ్చేటట్లుండాలి. వివిధ బీమా కంపెనీలు మీకు, మీ కుటుంబానికి వివిధ రకాలైన ప్రత్యేక పాలసీలు, మీ అవసరాలకు తగ్గ పాలసీలు అందిస్తున్నాయి. అయితే పాలసీకి దరఖాస్తు చేసే ముందు వైద్య ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసులో మీ కోసం పాలసీ తీసుకుంటున్నారనుకుందాం. సాధారణంగా మీరు 20 ఏళ్లకో, ఆ తరవాతో క్లెయిమ్ చేసే అవకాశముంటుంది. అందుకని అప్పుడు ఆసుపత్రి ఖర్చులు ఎలా ఉంటాయనేది ముందే అంచనా వేసుకోండి. కనీసం 7 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటం మంచిది. పాలసీ తీసుకునే ముందు... దాన్లో ఏవేవి కవర్ అవుతాయి? మీరు కూడా ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? దేనికి వర్తించదు? వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ చూశాక పాలసీ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే... మీరు పనిచేస్తున్న కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఆ ఒక్కదానిపైనే ఆధారపడొద్దు. మీరు ఉద్యోగంలో ఉన్నంత వరకే అది ఉంటుంది. కాబట్టి మీరు సొంతగా పాలసీ తీసుకోవటం అత్యవసరం. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా అయినా ఇది తప్పనిసరి.టాప్ అప్ ప్లాన్‌ను ఎంచుకోండి. మీకు ఎక్కువ కవరేజీ అవసరమని భావించి... దానికోసం ఎక్కువ డబ్బు పెట్టాలని లేకపోతే టాప్ అప్ తీసుకోవటం మంచిది. అనుకోనిది జరిగి మీకు అప్పటిదాకా ఉన్న కవరేజీ అయిపోయిన పక్షంలో టాప్ అప్ అనేది మీకు అదనపు కవరేజీగా పనికొస్తుంది. ఉదాహరణకు మీరు రూ.3 లక్షల పాలసీ తీసుకున్నారు. దానికి డిడక్టబుల్ పరిమితి రూ.2 లక్షలే ఉంది. మీ ఆసుపత్రి ఖర్చులు రూ.4 లక్షలయ్యాయనుకోండి. అప్పుడు రూ.5 లక్షల టాప్ అప్ తీసుకోండి. రెగ్యులర్‌గా రూ.5 లక్షల పాలసీకి అయ్యేదానికంటే దీనికి చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మంచి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర బీమా తీసుకోండి. పాలసీ ప్రక్రియ, చక్కని క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డు ఉన్న కంపెనీనే నమ్మండి. క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి త్వరగా తెలియజేస్తే అంత మంచిది.మీకు అప్పటికే ఏవైనా వ్యాధులుంటే... వాటికి వెయిటింగ్ పీరియడ్ సదరు బీమా కంపెనీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకంటే ముందే ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ తరవాతే కవరేజీ వర్తిస్తుంది. సాధారణంగా అది 2 నుంచి 4 సంవత్సరాలుంటుంది. సబ్ లిమిట్స్ గురించి ముందే తెలుసుకోవాలి. అంటే మీ పాలసీకి గనక ఒక సబ్ లిమిట్ ఉంటే బీమా కంపెనీ అంతవరకే చెల్లిస్తుందన్న మాట. క్లెయిమ్‌లో మిగిలిన మొత్తాన్ని మీరే భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆసుపత్రి గది అద్దె సబ్ లిమిట్ 1 శాతం ఉందనుకోండి. మీ పాలసీ కవరేజీ మొత్తం రూ.5 లక్షలుంటే... గది అద్దెగా రోజుకు రూ.5,000 మాత్రమే చెల్లిస్తారు. అంతకన్నా ఎక్కువయితే మాత్రం మీరే చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎంత బీమా ఉన్నా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజూ వ్యాయామం చెయ్యటం వంటివి తప్పనిసరి. వారానికి కనీసం 5 రోజులపాటు రోజుకు 30 నిమిషాల చొప్పున నడిచినా దీర్ఘకాలంలో ఎంతో లాభం. సీఈఓ, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
ఇన్ఫీ ఫలితాలు భేష్, షేర్ బేర్
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస లాభాలతో దూసుకుపోతోంది. ఇన్ఫీ రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 7.5 శాతం వృద్ధిని సాధించి తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. రూ. 3,398 కోట్ల నికరలాభాన్ని ఆర్జించి తన హవా కొనసాగించింది. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం మొత్తం రూ.29,989 కోట్లుగా నమోదైంది. గత జూన్, 2015తో ముగిసిన మొదటి త్రైమాసిక లాభాలతో పోలిస్తే ఇంకా మెరుగ్గా కనిపించింది. కాగా సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో, (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్లపాటు సంస్థకు సేవలందించిన ఆయన సోమవారం రాజీనామా చేయనున్నారని ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ కొనసాగుతారని తెలిపింది. దీంతో మార్కెట్లో ఈ షేరు ఫలితాలకు భిన్నంగా స్పందిస్తోంది. నష్టాల్లో ట్రేడవుతోంది. అటు షేరుకు 10 రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్టు ఇన్ఫీ ప్రకటించింది. రెండు మూడేళ్ల కిత్రం వరకు దేశీయ ఐటీ రంగంలో దిగ్గజంగా వెలుగొందిన ఇన్ఫోసిస్ పలు పరిణామాల కారణంగా ఓ దశలో ప్రత్యర్ధుల తాకిడికి నిలబడలేని పరిస్థితికి చేరింది. టీసీఎస్, హెచ్‌సీఎల్ లాంటి సంస్థల ధాటికి ఎదురొడ్డి నిలబడ్డంలో తడబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది క్రితం విశాల్ సిక్కా సీఈఓగా రంగంలోకి వచ్చారు. 2020 నాటికి 2000 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సిక్కా సీఈఓ అయినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మంచి టీమ్ ఏర్పడిందని. కంపెనీని ఆయన సరైన దిశలో నడిపించాని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. అంచనాలకు అనుగుణంగానే గత కొంతకాలంగా నష్టాలను చవిచూస్తున్న సంస్థ గత రెండు త్రైమాసికాల్లో భారీ లాభాలను ఆర్జించింది. అయితే సీఎఫ్ఓ రాజీనామాతో ఎనలిస్టులు కూడా పెదవి విరుస్తున్నారు. -
డబ్బు నల్లగా జారుకునేదిలా..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్: వ్యక్తులైనా ,సంస్థలైనా నల్ల ధనాన్ని విదేశాలకు పంపించడానికి ఎంచుకునే ఏకైక మార్గం కార్పొరేట్ నిర్మాణ వ్యవస్థ. లెక్కకు మిక్కిలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నమోదు చేయడం, వాటికి అంచెలంచెలుగా సబ్సిడరీలను ఏర్పాటు చేయటం, లావాదేవీలను సంస్థల మధ్య గొలుసుకట్టుగా పేర్చటం, విదేశాల్లో సమాంతర వ్యవస్థలు నెలకొల్పడం, బ్యాంకుల ద్వారా దర్జాగా డ్రా చేసుకోవడం..ఇదీ స్థూలంగా నల్ల కుబేరుల సంపద సృష్టి రహస్యం.నల్ల ధనం మూలాల్లోకి వెళితే.. దేశీయ కంపెనీలు ఒక ఏడాదిలో ఆర్జించిన లాభాలపై 30 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి. సర్‌ఛార్జీ, విద్యా సెస్సులతో కలుపుకుంటే ఇది 33.9 శాతానికి పెరుగుతుంది. లాభరాశిలో మూడొం తులు పన్ను చెల్లించాల్సి రావడం తలకు మించిన భారం కావడంతో పన్ను ఎగవేత దారిని ఎంచుకోవడమే నల్లధనం సృష్టికి ప్రధాన కారణం అవుతోంది. సాధారణంగా వ్యాపార లావాదేవీలను వాస్తవ విలువ కన్నా తగ్గించికానీ,అసలే నమోదు చేయకపోవడం వల్లకానీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడుతుంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, జ్యువెలరీ వ్యాపారులు, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఎన్జీవోలు, విదేశీ వాణిజ్యం చేసే సంస్థలు ప్రధానంగా పన్ను ఎగవేత మార్గాలను ఎంచుకుంటారనీ 2012లో నల్ల ధనంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొంది. ప్రధానంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టికల్లో కంపెనీలు చేసే తారుమారు తతంగం కథా కమామీషు ఇదీ.. విక్రయాలు, రాబడులు: పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా పేరుగాంచిన మారిషస్, కేమాన్ ఐలాండ్, హాంకాంగ్, వర్జిన్ ఐలాండ్ లాంటి దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి విక్రయాలను అక్కడికి మళ్లించటం, షెల్ కంపెనీల ద్వారా డమ్మీ లావాదేవీలు నెరపడం, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కంపెనీలను (హెచ్‌యూఎఫ్) ఏర్పాటు చేసి లావాదేవీలను నెరపడం ద్వారా నల్లధనం పేరుకుపోతోంది. విదేశీ సంస్థలకు మార్కెటింగ్ వ్యయాల రూపంలో, ప్రకటనలు, కమిషన్ రూపంలో దేశీ సంస్థలు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తాయి. ఇదే సొమ్ము నాన్ టాక్సబుల్ రిసీట్స్ (విరాళాలు, ట్రస్టులు, లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థలలకు పంపించే డబ్బు) ద్వారా మళ్లీ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. లేదా విదేశాల్లోనే బ్యాంకు ఖాతాల్లో ఉండిపోతోంది. మూలధనం: కంపెనీలు జారీచేసే షేర్లకు దరఖాస్తుచేసే డబ్బు, షేర్ల కోసం అధిక ప్రీమియంగా చెల్లించే మొత్తం, విదేశీ సంస్థలు ద్వారా పోగైన షేర్ క్యాపిటల్, నకిలీ బహుమానాలు, బోగస్ మూలధన లాభాలు, నకిలీ ఆస్తులను పెంచడం ద్వారా నల్లధనం దర్జాగా మళ్లీ ఖాతాల్లోకి వస్తోంది. ఇన్వెస్ట్మెంట్ స్కీంలు... కొంత మంది వ్యక్తులు ఒక గ్రూప్‌గా కలసి ఆకర్షణీయమైన ఇన్వెస్ట్మెంట్ స్కీంలను ప్రవేశపెడతారు. ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడులకు అధిక రాబడులిస్తామని ఆశ పెడతారు. తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇన్వెస్టర్‌కు వచ్చే ప్రతిఫలానికి భరోసాగా పోస్ట్ డేటెడ్ చెక్కును జారీ చేస్తారు. అనంతరం బ్యాంకులోని నగదును గ్రూప్ సభ్యులు తమ తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. ఈ ధనాన్ని విదేశాల్లో తాము ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాకు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా మళ్లిస్తారు. అక్కడి నుండి మరో దేశంలోని మరో ఖాతాకి మళ్లిస్తూ నెట్‌వర్క్‌ను విస్తృత పరుస్తారు. విదేశాల్లోని బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రపంచంలో ఎక్కడైనా విని యోగించే క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డులతో ఇండియాలోనే దర్జాగా డబ్బును డ్రా చేసుకుంటారు. స్మర్ఫింగ్.. బ్యాంకుల కళ్లు కప్పి ఖాతాల్లో డబ్బు దాచుకునే ప్రక్రియనే ‘స్మర్ఫింగ్’ అంటారు. బ్యాంకు ఖాతాలను నిరంతరం పర్యవేక్షించే అధికారులు నగదు డిపాజిట్, విత్ డ్రాయల్ లావాదేవీలకు ఒక పరిమితి పెట్టుకుంటారు. ఉదాహరణకు రూ. పది లక్షలు ఆపైన డిపాజిట్ కానీ విత్ డ్రాయల్ కానీ అయిన ఖాతాలను అబ్జర్వేషన్లో ఉంచుతుంటారు. అయితే స్మర్ఫింగ్ చేసే నల్ల కుబేరులు రూ. పది లక్షల కన్నా తక్కువ డిపాజిట్ చేసి బ్యాంకు దృష్టి నుంచి తప్పించుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని విదేశాల్లోని తమ బ్యాంకు ఖాతాలకు వైర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. హవాలా మార్గంలో... ఎక్స్ అనే ఓ వ్యక్తి ఇండియలో అనైతిక మార్గాల ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడనుకోండి. దీన్ని విదేశాలకు తరలించేందుకు ‘హవాలా’ మార్గాన్ని ఎంచుకుంటారు. స్థానిక హవాలా ఆపరేటర్ కొంత కమిషన్ తీసుకొని ఈ రూ. 10 కోట్లను విదేశాల్లో ఎక్స్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. విదేశాల్లో ఎక్స్ ప్రమోట్ చేసిన కంపెనీ ఇండియాలోని ఎక్స్ కంపెనీలో షేర్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. ఇండియాలోని ఎక్స్ కంపెనీ విదేశీ ఎక్స్ సంస్థకు డివిడెండ్ రూపంలో భారీ మొత్తం చెల్లిస్తుంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు భారీ వేతనాలు ఇవ్వడం ద్వారా బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని ఎక్స్ తన ఆదాయ పన్ను రిటర్న్‌లో పొందుపరస్తాడు. -
తొలి జీవితం అడుగులు ఇలా..
పెళ్లి... వ్యక్తి జీవితంలో సంతోషం, సౌభాగ్యంతో పాటు ఆశావహ దృక్పథాన్నీ తీసుకువస్తుంది. ఇదే సమయంలో మూడుముళ్లతో ఒక్కటైన జంట కాలక్రమంలో ఆర్థిక ఒడిదుడుకులను, పలు బాధ్యతలను ఎదుర్కోక తప్పదు. జీవిత భాగస్వాములుగా పరస్పర విశ్వాసంతో ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ జాగ్రత్తగా బతుకు బండిని నడుపుకుంటూ రావాల్సిందే. పిల్లలు.. వారి చదువులు.. జీవిత లక్ష్యాలు.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను ఎదుర్కొనడం.. ఇవన్నీ జీవితంలో ఒక భాగమైపోతాయి. వీటన్నింటితో ఒక వివాహం విజయవంతమై... సమాజంలో ఆదర్శప్రాయమవుతుంది. ప్రతి వివాహ బంధం ఈ స్థాయికి చేరుకునే బాటలో అనుసరించాల్సిన ఐదు ఆర్థిక సూత్రాలు... పెళ్లైన కొత్తలో ఆర్థిక బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక ప్రణాళికను రచించి అమలు పర్చడానికి ఇదే సరైన సమయం. నవ దంపతులు ఆర్థిక ప్రణాళికలో ఈ ఐదు అంశాలను మరచిపోకూడదు. పరస్పరం మాట్లాడుకోవాలి... భార్యాభర్తలు ఇరువురు తమ జీవన ప్రయాణానికి ముందు ఒకరికొకరు తమ ఆర్థిక అవసరాలు, రాబడులు, వ్యయాల వంటి అంశాలపై చర్చించుకోవాలి. పరస్పరం అర్థం చేసుకోవాలి. తమ జీవితానికి అనుగుణమైన ప్రణాళికలు వేసుకోవాలి. ఈ ప్రణాళికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ప్రాతిపదికన, భవిష్యత్‌కు భరోసాను ఇచ్చేవిగా ఉండాలి. రుణాలు, బిల్లుల చెల్లింపులు, ఇంటి అద్దెలు, పెట్టుబడులు, నెలవారీ ఖర్చులు... ఇత్యాధి అంశాలన్నీ మీ చర్చల్లో భాగం కావాలి. జీవిత బీమా ధీమా కావాలి... భవిష్యత్ భద్రత, ఆర్థిక అవసరాల నుంచి అనుకోని అవాంతరాలను ఎదుర్కొనేంత వరకూ పలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఒక జీవిత బీమా పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం. భార్యాభర్తలు వారివారి జీవిత అవసరాలకు అనుగుణంగా ఒక బీమా పాలసీని ఎంచుకోవాలి. వివాహానికి ముందే పాలసీ ఉంటే... దానిని అనంతరం మీ తాజా అవసరాలకు, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా మలచుకోవాలి. ఆ మేరకు పాలసీ ప్రయోజనాలను పెంచుకోవాలి. రైడర్లను వినియోగించుకోవాలి. ఆర్థిక అవసరాలు ఇక్కడ ముఖ్యంకాదు. కొన్ని దురదృష్ట ఘటనలను సైతం ఎదుర్కొనేలా జీవిత బీమా పాలసీలు దోహదపడతాయన్నది ఇక్కడ గమనించాల్సిన అవసరం. ఆరోగ్య బీమా కూడా అవసరమే.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి నేడు నూటికి నూరుపాళ్లూ నిజం. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఎంతటి వారైనా ఈ సమస్యను ఎదుర్కొనక తప్పదు. ఇలాంటి సమయంలో ఆరోగ్య బీమా ప్రణాళిక ఎంతో దోహదపడుతుంది. ఈ పాలసీ కొనుగోలు తప్పనిసరి. అయితే ఉద్యోగస్తులుగా వారి యాజమాన్యం ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ వంటి సౌలభ్యతలను కల్పిస్తుంది. అయితే ఈ మొత్తం బీమా మీ అవసరాలకు భరోసాను ఇస్తుందా? లేదా? అన్న అంచనాలను వేసుకోవాలి. వైద్య ఖర్చులు 15 నుంచి 20 శాతం వరకూ ప్రతి యేడాదీ పెరుగుతున్నాయన్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు అనుగుణంగా నిర్ఱయం తీసుకోవాలి. పదవీ విరమణపై ఆలోచన ఇలాంటి ఒక ఆలోచన ఆర్థికంగానే కాదు... జీవిత భాగస్వాముల మధ్య మంచి సెంటిమెంట్లను, భావోద్వేగాలను సైతం సానుకూల రీతిలో పటిష్ట పరుస్తుంది. ‘ఇప్పుడేగా వివాహమైంది..? అప్పుడే పదవీ విరమణ వరకూ ఎందుకు?’ వంటి ఆలోచనలను పక్కనపెట్టి... ఆర్థికంగా ఆయా అంశాలకూ భవిష్యత్తు ప్రణాళికల్లో చోటివ్వడం ముఖ్యం. సంయుక్త ఆర్థిక అవసరాలు, కోరికలు... వంటి అంశాలకు అనుగుణంగా భార్యా భర్తలు ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళిక ప్రకారం మదుపుచేసుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించాలి. ఇలాంటి విధానం మీ రిటైర్మెంట్ అనంతర జీవితానికి ప్రశాంతతను అందిస్తుంది. సలహాలు తీసుకోవాలి... అన్ని అంశాల్లోనూ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో నిపుణుల సలహాలూ తీసుకోవాలి. ప్రస్తుత ద్రవ్యోల్బణం, దాని పెరుగుదల తీరు, పొదుపులు, పెట్టుబడులు వంటి అంశాలపై నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. ప్రతి వ్యక్తి జీవితంలో పిల్లల పెంపకం కీలకం. వీరి విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ సముపార్జన వరకూ తల్లిదండ్రులుగా నుంచి సలహాలు, సూచనలు, ఆర్థిక భరోసా అన్నీ ముఖ్యమే. ఆయా అంశాలపై ప్రతి సందర్భంలోనూ నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడమూ కీలకమే. తగిన ప్రణాళిక ద్వారా జీవితంలో పటిష్ట ఆర్థిక నిర్వహణ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్!! -
డీఅండ్‌బీ టాప్500లో 16 హైదరాబాదీ కంపెనీలు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) విడుదల చేసిన టాప్ 500 భారతీయ కంపెనీల్లో 16 హైదరాబాద్ కంపెనీలకు చోటు లభించింది. ఆదాయం, లాభాలు, నెట్‌వర్త్ వంటి అనేక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టాప్ -500 కంపెనీలను ఎంపిక చేసినట్లు డీఅండ్‌బీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్, ఎన్ఎండీసీ, డాక్టర్ రెడ్డీస్, సైయంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అరబిందో ఫార్మా, అమర్ రాజా బ్యాటరీస్, బీఎస్, గాయత్రీ, హెచ్‌బీఎల్, హెరిటేజ్, మధుకాన్, ఎన్సీసీ, ప్రిజిం సిమెంట్, రాంకీ ఇన్ఫ్రా, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 500 కంపెనీలు దేశ జీడీపీలో 20 శాతం వాటాను కలిగి ఉండగా, ఎగుమతుల్లో 30 శాతం, ఉద్యోగాల కల్పనలో 10 శాతం వాటాను కలిగి ఉన్నట్లు డీఅండ్‌బీ సీఈవో (ఇండియా) కుషాల్ సంపత్ తెలిపారు.2014 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు 8 శాతం వృద్ధిని నమోదు చేయగా, లాభాలు 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గినట్లు డీఅండ్‌బీ పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది ఆదాయం, లాభాల్లో మరింత వృద్ధిని అంచనా వేస్తోంది. అలాగే దేశ జీడీపీ 5.5 శాతం ఉంటుందని డీఅండ్‌బీ లెక్కకట్టింది. -
మూడు రెట్లు పెరిగిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టాలు మూడు రెట్లు పెరిగాయి. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి జీఎంఆర్ రూ.2,635 కోట్ల ఆదాయంపై రూ. 326 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.2,601 కోట్ల ఆదాయంపై రూ.94 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. వ్యయాలు భారీగా పెరగడం ఇదే సమయంలో పెరిగిన రుణభారాలు నష్టాలు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎంఆర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో వడ్డీ చెల్లింపులు రూ.480 కోట్ల నుంచి రూ.610 కోట్లకు పెరిగింది. జడ్చర్ల హైవే ప్రాజెక్టులో వాటాలు విక్రయం, ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఆదాయంలో వృద్ధి, కొత్తగా రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో మొత్తం ఆదాయంలో వృద్ధికి కారణాలుగా కంపెనీ పేర్కొంది. టాఫిక్ పెరుగుతుండటం హర్షణీయం ఫలితాలపై జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు స్పందిస్తూ ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ట్రాఫిక్ పెరుగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగదు సరఫరా ఎక్కువగా ఉండే వ్యాపారాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు టారిఫ్‌లను పునఃపరిశీలించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.