యోగాగురు బాబా రాందేవ్ భారీ టార్గెట్
యోగాగురు బాబా రాందేవ్ భారీ టార్గెట్
Published Thu, May 4 2017 4:55 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
యోగాగురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి కంపెనీ భారీ లక్ష్యంతోనే మార్కెట్లో పరుగులు పెడుతోంది. కంపెనీ విక్రయాలు 2018 ఆర్థిక సంవత్సరంలో రెండింతలు పెంచుకుని 20వేల కోట్ల రూపాయలకు పైగా నమోదుచేయాలని కంపెనీ నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను కూడా రెండింతలు పెంచుకుని 12వేలకు చేర్చుకోవాలని ప్లాన్ వేస్తోంది. రాబోయే ఐదేళ్లలో బహుళజాతి సంస్థలను దేశం నుంచి తరిమి కొడతామని యోగాగురు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ హెచ్చరికల అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలో తన రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని నిర్ణయించింది.
అంతేకాక, ప్రస్తుతమున్న తన బలాన్ని పెంచుకోవాలని, చాలా ప్రొడక్ట్ కేటగిరీల్లో తామే ముందంజలో ఉండాలని పతంజలి యోచిస్తోంది. 2017 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో హరిద్వార్ కు చెందిన ఈ కంపెనీ టర్నోవర్ రూ.10,561 కోట్లగా ఉంది. ''ఈ టర్నోవర్ ను వచ్చేఏడాదికి రెట్టింపు చేసుకుంటాం. వచ్చే ఏడాది కల్లా ఆధిపత్య స్థానంలోకి వచ్చేస్తాం. మార్కెట్లో ఉన్న చాలా ప్రొడక్ట్స్ లో మేమే నెంబర్ వన్ గా ఉంటాం'' అని యోగా గురు బాబా రాందేవ్ చెప్పారు. మెగా ప్రొడక్షన్ యూనిట్లను నెలకొల్పేందుకు కూడా కంపెనీ తన ప్రక్రియను ప్రారంభించింది. నోయిడా, నాగ్ పూర్, ఇండోర్ లలో ఈ మెగా ప్రొడక్షన్ యూనిట్లను స్థాపిస్తోంది. దీంతో ప్రస్తుతమున్న 35వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 60వేల కోట్లకు చేర్చుకోనుంది.
Advertisement
Advertisement