వచ్చేనెల 2న జిల్లాస్థాయి యోగా పోటీలు
Published Mon, Sep 5 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
ఆకివీడు: జిల్లాస్థాయి యోగా పోటీలను వచ్చేనెల 2న ఆకివీడు పతంజలి యోగా కేంద్రంలో నిర్వహించనున్నట్టు పతంజలి యోగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్ చెప్పారు. స్థానిక యోగా కేంద్రంలో ఆదివారం పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసును బట్టి నాలుగు గ్రూపులుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. 8 ఏళ్లు దాటిన వారు పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి గలవారు అదే రోజు కేంద్రం వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కార్యదర్శి యోగా సాంబశివరావు, ఉపాధ్యక్షుడు ఉండ్రమట్ల సాంబశివరావు, కేవీకే గాంధీ, బి.సత్యనారాయణరాజు, కుంకట్ల సత్యనారాయణ, నేరెళ్ల చెంచయ్య, యు.వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement