న్యూఢిల్లీ: పతంజలి ఇన్‌స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది.
సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment