district wide
-
30న జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు
నరసాపురం: గాంధీ అధ్యయన కేంద్రం (యూజీసీ), నరసాపురం వైఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మహాత్మాగాంధీ–మత సామరస్యం’ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్టు స్థానిక వైఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కేవీసీఎస్ అప్పారావు, గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు కళాశాలలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 6వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలకు వచ్చేనెల 2న కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందిస్తామని చెప్పారు. వివరాలకు సెల్: 9849712739 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
జిల్లా అంతటా వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : చాలా రోజుల తర్వాత జిల్లా అంతటా వర్షపాతం నమోదైంది. జూలై 28న 63 మండలాల్లోనూ వర్షం పడగా 56 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గురువారం జిల్లా అంతటా వర్షం కురిసింది. అయితే 11 మండలాల్లో మోస్తరుగానూ, మరో 22 మండలాల్లో తేలికపాటి వర్షం పడగా మిగతా మండలాల్లో తుంపర్లు కురిశాయి. కొన్ని మండలాల్లో 6.5 మి.మీ నమోదైంది. ఆగస్టు నెలంతా చాలా మండలాల్లో చినుకు కూడా పడలేదు. అయితే వేరుశనగ పంటపై ఇప్పటికే ఆశలు గల్లంతు కావడంతో మిగతా పంటలకు కొంత ఊరట లభించే పరిస్థితి ఉంది. గురువారం కుందుర్పిలో 20.9 మిమీ, బ్రహ్మసముద్రం 20.8 మిమీ, చిలమత్తూరు 18.9 మిమీ, కూడేరు 18.2 మిమీ, లేపాక్షి 15.2 మిమీ, అగళి 15.1 మిమీ, శెట్టూరు 13.6 మిమీ, సోమందేపల్లి 12.7 మిమీ, రాయదుర్గం 12.4 మిమీ, ఆత్మకూరు 11.1 మిమీ, గుడిబండ 10.5 మిమీ నమోదు కాగా మరో 22 మండలాల్లో 5 నుంచి 10 మిమీ లోపు వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి 31.3 మిమీ నమోదైంది. -
జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటకం
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటక పోటీలు స్థానిక అమీనాపేటలోని బాలయోగి సైన్స్ పార్కులో మంగళవారం నిర్వహించారు. డీఈవో డి.మధుసూదనరావు పర్యవేక్షణలో సైన్స్ పార్కు కోఆర్డినేటర్ సీహెచ్‌ఆర్‌ఎం చౌదరి నాటక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 14 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులంతా వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. విజేతలు వీరే – శుభ్రమైన ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై ఏలూరు సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నాటికకు ప్రథమ స్థానం లభించింది. – అబ్దుల్ కలాం జీవిత చరిత్ర అంశంపై పెదవేగి మండలం ప్రకాశ్‌నగర్‌లోని డీసెల్స్ మూగ, బధిర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు ద్వితీయస్థానం వచ్చింది. – శుభ్రమైన, ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై దూబచర్ల జెడ్పీ హైస్కూల్, గ్రీన్ ఎనర్జీపై ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తతీయస్థానం లభించింది. -
16 నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు డీవైఈవో ఎం.తిరుమదాసు చెప్పారు. మంగళవారం హైస్కూల్లో కొయ్యలగూడెం విద్యాకమిటీ పరిధిలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. సైన్స్ ఫెయిర్‌కు జిల్లాస్థాయిలో విద్యార్థులు తమ ఎగ్జిబిట్స్‌తో వస్తారని, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సైన్స్ ఫెయిర్ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అప్పగించామన్నారు. రిజిస్ట్రేషన్ కమిటీకి బుట్టాయగూడెం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జె.సురేష్‌బాబు, ఫుడ్‌కమిటీకి జంగారెడ్డిగూడెం జెడ్పీ హెచ్ఎస్ (బాలురు) స్కూల్ అసిస్టెంట్ ఎల్.నాగేశ్వరరావు, ప్రెస్ అండ్ పబ్లిసిటీ కమిటీకి జి.పంగిడిగూడెం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఏడీ శిఖామణి, కల్చరల్ కమిటీకి రేగులకుంట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కె.నాగేశ్వరరావు, డిసిప్లిన్ కమిటీకి రెడ్డిగణపవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.రాముడు బాధ్యులుగా వ్యవహరిస్తారన్నారు. మొత్తంగా 20 కమిటీలు నియమించామన్నారు. జంగారెడ్డిగూడెం ఎంఈవో ఆర్.రంగయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
త్వరలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
ఏలూరు రూరల్ : త్వరలో జిల్లాస్థాయి మహిళా, పురుషుల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నామని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు సెప్టెంబర్ 15వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ చూపిన జట్లుకు 2016–17లో నిర్వహించనున్న ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి (ప్లో) టోర్నమెంట్లో పాల్గొనే అర్హత కల్పిస్తామని ఫ్లో సీఈవో రావూరి రాజేష్ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ : 94906–61213, 76608–75000 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు -
త్వరలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
ఏలూరు రూరల్ : త్వరలో జిల్లాస్థాయి మహిళా, పురుషుల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నామని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు సెప్టెంబర్ 15వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ చూపిన జట్లుకు 2016–17లో నిర్వహించనున్న ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి (ప్లో) టోర్నమెంట్లో పాల్గొనే అర్హత కల్పిస్తామని ఫ్లో సీఈవో రావూరి రాజేష్ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ : 94906–61213, 76608–75000 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు -
వచ్చేనెల 2న జిల్లాస్థాయి యోగా పోటీలు
ఆకివీడు: జిల్లాస్థాయి యోగా పోటీలను వచ్చేనెల 2న ఆకివీడు పతంజలి యోగా కేంద్రంలో నిర్వహించనున్నట్టు పతంజలి యోగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్ చెప్పారు. స్థానిక యోగా కేంద్రంలో ఆదివారం పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసును బట్టి నాలుగు గ్రూపులుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. 8 ఏళ్లు దాటిన వారు పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి గలవారు అదే రోజు కేంద్రం వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కార్యదర్శి యోగా సాంబశివరావు, ఉపాధ్యక్షుడు ఉండ్రమట్ల సాంబశివరావు, కేవీకే గాంధీ, బి.సత్యనారాయణరాజు, కుంకట్ల సత్యనారాయణ, నేరెళ్ల చెంచయ్య, యు.వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా తనిఖీలు
అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు పుష్కరాలకు ముందు కలకలం రేపిన ఎన్కౌంటర్ మహబూబ్‌నగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాకేంద్రంతోపాటు సరిహద్దు ప్రాంతాల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టారు. నయీం ముఠాలోని వ్యక్తులు పరారీ అయ్యారని సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం జాతీయ రహదారిపై ఎక్కడిక్కడ వాహనాలను తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. పాలమాకుల, కొత్తూర్చౌరస్తా, షాద్‌నగర్–బైపాస్, జడ్చర్ల, కొత్తకోట, అలంపూర్–ఎక్స్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానితులను, వారి గుర్తింపుకార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నయీంకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పట్టణ పోలీసులు పాతపాలమూరు, కోయిలకొండ– ఎక్స్‌రోడ్, పాలిటెక్నిక్ కళాశాల ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు.. అయితే ఎక్కడ కూడా ఎవరూ పట్టుబడలేదని సమాచారం. ఇదిలాఉండగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల ప్రారంభానికి మూడురోజుల ముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఇటు జిల్లా ప్రజల్లో, అటు పోలీసుల్లో కలకలం రేగుతోంది. పుష్కరాలకు అశేషంగా భక్తులు రానున్నందున మరింత భద్రత పెంచునున్నట్లు సమాచారం. రాబోయో రోజుల్లో నయీం ముఠా ఏమైనా చర్యలకు పాల్పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం పుష్కరాలు ముగిసే వరకు భారీ నిఘా ఏర్పాటు చేయనుంది.