అనంతపురం అగ్రికల్చర్ : చాలా రోజుల తర్వాత జిల్లా అంతటా వర్షపాతం నమోదైంది. జూలై 28న 63 మండలాల్లోనూ వర్షం పడగా 56 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గురువారం జిల్లా అంతటా వర్షం కురిసింది. అయితే 11 మండలాల్లో మోస్తరుగానూ, మరో 22 మండలాల్లో తేలికపాటి వర్షం పడగా మిగతా మండలాల్లో తుంపర్లు కురిశాయి. కొన్ని మండలాల్లో 6.5 మి.మీ నమోదైంది. ఆగస్టు నెలంతా చాలా మండలాల్లో చినుకు కూడా పడలేదు. అయితే వేరుశనగ పంటపై ఇప్పటికే ఆశలు గల్లంతు కావడంతో మిగతా పంటలకు కొంత ఊరట లభించే పరిస్థితి ఉంది.
గురువారం కుందుర్పిలో 20.9 మిమీ, బ్రహ్మసముద్రం 20.8 మిమీ, చిలమత్తూరు 18.9 మిమీ, కూడేరు 18.2 మిమీ, లేపాక్షి 15.2 మిమీ, అగళి 15.1 మిమీ, శెట్టూరు 13.6 మిమీ, సోమందేపల్లి 12.7 మిమీ, రాయదుర్గం 12.4 మిమీ, ఆత్మకూరు 11.1 మిమీ, గుడిబండ 10.5 మిమీ నమోదు కాగా మరో 22 మండలాల్లో 5 నుంచి 10 మిమీ లోపు వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి 31.3 మిమీ నమోదైంది.
జిల్లా అంతటా వర్షం
Published Fri, Sep 23 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement