జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటకం | nataka potilu | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటకం

Published Tue, Sep 20 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

nataka potilu

ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటక పోటీలు స్థానిక అమీనాపేటలోని బాలయోగి సైన్స్‌ పార్కులో మంగళవారం నిర్వహించారు. డీఈవో డి.మధుసూదనరావు పర్యవేక్షణలో సైన్స్‌ పార్కు కోఆర్డినేటర్‌ సీహెచ్‌ఆర్‌ఎం చౌదరి నాటక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 14 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులంతా వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు.  
విజేతలు వీరే
– శుభ్రమైన ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై ఏలూరు సెయింట్‌ థెరిస్సా ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నాటికకు ప్రథమ స్థానం లభించింది.
– అబ్దుల్‌ కలాం జీవిత చరిత్ర అంశంపై పెదవేగి మండలం ప్రకాశ్‌నగర్‌లోని డీసెల్స్‌ మూగ, బధిర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు ద్వితీయస్థానం వచ్చింది.
– శుభ్రమైన, ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై దూబచర్ల జెడ్పీ హైస్కూల్, గ్రీన్‌ ఎనర్జీపై ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తతీయస్థానం లభించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement