జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటకం
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటక పోటీలు స్థానిక అమీనాపేటలోని బాలయోగి సైన్స్ పార్కులో మంగళవారం నిర్వహించారు. డీఈవో డి.మధుసూదనరావు పర్యవేక్షణలో సైన్స్ పార్కు కోఆర్డినేటర్ సీహెచ్‌ఆర్‌ఎం చౌదరి నాటక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 14 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులంతా వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు.
విజేతలు వీరే
– శుభ్రమైన ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై ఏలూరు సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నాటికకు ప్రథమ స్థానం లభించింది.
– అబ్దుల్ కలాం జీవిత చరిత్ర అంశంపై పెదవేగి మండలం ప్రకాశ్‌నగర్‌లోని డీసెల్స్ మూగ, బధిర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు ద్వితీయస్థానం వచ్చింది.
– శుభ్రమైన, ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై దూబచర్ల జెడ్పీ హైస్కూల్, గ్రీన్ ఎనర్జీపై ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తతీయస్థానం లభించింది.