మెగా విలీనం: 40కోట్ల యూజర్లు, 80 కోట్ల రెవెన్యూలు
మెగా విలీనం: 40కోట్ల యూజర్లు, 80 కోట్ల రెవెన్యూలు
Published Mon, Mar 20 2017 11:36 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
మెగా విలీనానికి ఓకే చెబుతూ ఐడియా సెల్యులార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఈ సంస్థ అవతరించబోతుంది. వైర్ లెస్ సబ్స్క్రైబర్లలో ఈ సంస్థ మార్కెట్ లీడర్ గా నిలువబోతుంది. ఇన్ని రోజులు వొడాఫోన్ రెండో స్థానంలో, ఐడియా మూడో స్థానంలో ఉండగా.. టెలికాం లీడర్ గా భారత్ ఎయిర్ టెల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగేది. ఇటీవలే టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది. దీంతో ఇటు ఎయిర్ టెల్ స్థానాన్ని దక్కించుకుని, రిలయన్స్ జియో దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వొడాఫోన్, ఐడియాలు విలీనానికి తెరలేపాయి. ఇండియా రేటింగ్స్ ప్రకారం ఈ మెగా విలీనంతో కంపెనీకి 80 కోట్ల రెవెన్యూలు వచ్చి చేరతాయని తెలిసింది.
స్పెక్ట్రమ్ డూప్లికేషన్ అరికడుతూ నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ డీల్ ఎంతో సహకరించనుందట. ఖర్చులు తగ్గడంతో ఈ సంస్థకు ఈబీఐటీడీఏ మార్జిన్లు 250-350 బేసిస్ పాయింట్లు మెరుగుపడతాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ముఖ్యంగా నెట్ వర్క్, మార్కెటింగ్ వ్యయాలపై ఖర్చులు తగ్గుతాయన్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ చాలా గట్టి పునాదులను ఏర్పరుచుకుంది. ఐడియా ఎక్కువగా రూరల్ మార్కెట్ పై ఫోకస్ చేస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రెండింటి కలయికతో 205 మిలియన్ వొడాఫోన్ యూజర్లు, 190 మిలియన్ ఐడియా యూజర్లు ఒకటై మొత్తం 40 కోట్ల సబ్స్క్రైబర్ బేసిస్ తో విలీన సంస్థ ఏర్పడుతోంది. మార్కెట్లో మొత్తం 43 శాతం షేరును సంపాదించుకోనుంది. ఇది ప్రత్యర్థి ఎయిర్ టెల్ కంపెనీ కంటే 10 శాతం ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.
Advertisement
Advertisement