సాక్షి, న్యూఢిల్లీ : జనవరిలో జీఎస్‌టీ మొత్తం రాబడి ఫిబ్రవరి 25 వరకూ రూ 86,318 కోట్లు వసూలైందని కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2017లో జీఎస్‌టీ వసూళ్లు రూ 86,703 కోట్లుగా నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. జీఎస్‌టీ కింద ఇప్పటివరకూ 1.03 కోట్ల మంది పన్నుచెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని..17.65 లక్షల మంది డీలర్లు కాంపోజిషన్ డీలర్లుగా నమోదు చేసుకున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
17.65 లక్షల డీలర్లలో 1.23 లక్షల కాంపోజిషన్ డీలర్లు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవడంతో రెగ్యులర్ పన్నుచెల్లింపుదారులయ్యారని పేర్కొంది. ఇక జనవరిలో జీఎస్‌టీ కింద వసూలైన రూ 86,318 కోట్లలో రూ 19,961 కోట్లు సీజీఎస్‌టీగా, రూ 19961 కోట్లు ఎస్‌జీఎస్‌టీగా, రూ 43,794 కోట్లు ఐజీఎస్‌టీగా, రూ 8331 కోట్లు కాంపెన్సేషన్ సెస్‌గా వసూలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment