GST cess
-
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై జీఎస్టీ వడ్డన!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, జీఎస్టీలో పన్నుల శాతం పెంపుపై కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%; 28% శ్లాబులు ఉన్నాయి. 28శాతం కంటే తక్కువ ఉన్న శ్లాబుల్లో కూడా అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ఖజానాకి ఆశించినంత ఆదాయం రావడం లేదు. 5 శాతం పన్నుని 8శాతానికి , 12 నుంచి 15 శాతానికి పెంచే అవకాశాల్ని కూడా పరిశీలించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ధరల్ని స్థిరీకరిస్తూనే ఖజానా ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు. కొన్ని వస్తువులపై భారీగా సెస్ విధించాలని కూడా జీఎస్టీ మండలి యోచిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న పన్ను రేటు శ్లాబుల్ని మూడుకి కుదించాలని భావిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్–నవంబర్ మధ్య జీఎస్టీ పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలకంటే 40శాతానికి తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. -
జనవరిలో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : జనవరిలో జీఎస్టీ మొత్తం రాబడి ఫిబ్రవరి 25 వరకూ రూ 86,318 కోట్లు వసూలైందని కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2017లో జీఎస్టీ వసూళ్లు రూ 86,703 కోట్లుగా నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. జీఎస్టీ కింద ఇప్పటివరకూ 1.03 కోట్ల మంది పన్నుచెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని..17.65 లక్షల మంది డీలర్లు కాంపోజిషన్ డీలర్లుగా నమోదు చేసుకున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 17.65 లక్షల డీలర్లలో 1.23 లక్షల కాంపోజిషన్ డీలర్లు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవడంతో రెగ్యులర్ పన్నుచెల్లింపుదారులయ్యారని పేర్కొంది. ఇక జనవరిలో జీఎస్టీ కింద వసూలైన రూ 86,318 కోట్లలో రూ 19,961 కోట్లు సీజీఎస్టీగా, రూ 19961 కోట్లు ఎస్జీఎస్టీగా, రూ 43,794 కోట్లు ఐజీఎస్టీగా, రూ 8331 కోట్లు కాంపెన్సేషన్ సెస్‌గా వసూలయ్యాయి. -
నవంబర్ జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నవంబర్ మాసంలో 27వ తేదీ వరకూ రూ 83,346 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అయితే అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు మొత్తం రూ 95,131 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ కింద ఇప్పటివరకూ 96 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు నమోదుచేసుకోగా, వారిలో 15 లక్షల మంది కాంపోజిషన్ డీలర్లు.. వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే రిటన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం కేంద్ర జీఎస్టీ వాటా రూ58,556 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. జీఎస్టీ కింద ఆదాయం కోల్పోయిన రాష్ర్టాలకు పరిహార మొత్తాలను విడుదల చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. -
భారీగా పెరిగిన ఫోర్డ్ ఎండీవర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ సెస్ రేట్ల పెంపు తర్వాత కార్ల కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియా తన ప్రీమియం ఎస్యూవీ ఎండీవర్ ధరలను భారీగా పెంచేసింది. జెస్టీ సెస్ రేట్లకు అనుగుణంగా ప్రీమియం ఎస్యూవీ ఎండీవర్ ధరలను రూ.1.8 లక్షలకు వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫిగో హ్యాచ్‌బ్యాక్ నుంచి ఐకానిన్ మస్టాంగ్ సెడాన్ వరకు వివిధ మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఎండీవర్ కారు ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు పెంచుతున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. కంపెనీకి చెందిన ఇతర మోడల్స్‌పై ఈ పెంపు ప్రభావం అంతగా లేదని పేర్కొన్నారు. జీఎస్టీ సెస్ పెంపుతో ఇప్పటికే హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్లు తమ వాహనాల ధరలను పెంచేశాయి. గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్(జీఎస్టీ) కింద మిడ్ సైజు, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ రేట్లు 2 శాతం, 5 శాతం, 7 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. జీఎస్టీ పాలన కింద కార్లపై అత్యధిక పన్ను శ్లాబు 28 శాతంగా ఉంది. సెస్ 1 శాతం నుంచి 22 శాతంగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ధర రూ.1.5 లక్షల మేర తగ్గించనున్నట్టు కంపెనీ తెలిపింది. కానీ సెస్ రేట్లు పెంచడంతో, ఫోర్డ్ ఎండీవర్ ధరను మళ్లీ కంపెనీ పెంచేసింది. -
హోండా కార్ల ధరలు పెరిగాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్ల ఇండియా కూడా తన మోడల్స్ ధరలను పెంచేసింది. జీఎస్టీ సెస్‌కు అనుగుణంగా ధరలను పెంచుతున్నట్టు ఈ కంపెనీ కూడా ప్రకటించింది. సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ మోడల్స్‌పై రూ.7,003 నుంచి రూ.89,069 మధ్యలో ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సమీక్షించిన ధరలు అమల్లోకి తెస్తున్నామని హోండా కార్ల ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. జీఎస్టీలో 2-7 శాతం అదనపు సెస్ భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తన మిడ్‌సైజు సెడాన్ సిటీ ధరలు వేరియంట్లను బట్టి రూ.7,0003 నుంచి రూ.18,791 వరకు పెరిగాయి. ఎస్యూవీ బీర్-వీ ధరలను రూ.12,490 నుంచి రూ. 18,242 మధ్యలో పెంచింది. అదేవిధంగా ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వీ ధరలను రూ.75,304 నుంచి రూ.89,069 వరకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఎంపికచేసిన మోడల్స్‌పై ధరలను రూ.13వేల నుంచి రూ.1.6 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం సెస్‌ను పెంచడంతో మిడ్‌సైజు కార్ల జీఎస్టీ రేటు 45 శాతం, పెద్ద కార్ల జీఎస్టీ రేటు 48 శాతం, ఎస్యూవీ రేటు 50 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
మోత మోగనున్న కార్ల ధరలు
న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లగ్జరీకార్లు, ఎస్‌యూవీలపై పన్ను భారాన్ని విధించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేవంలో నిర్ణయం జరిగింది. కొత్త జీఎస్టీ చట్టం కింద 15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వ్యాట్ లాంటి స్థానంలో జులై 1 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి రావడంతో చాలా వివిధ కార్ల ఉత్పత్తి సంస్థలు తమ ఎస్యూవీ, తదితర లగ్జరీ కార్ల ధరలను రూ 1.1 లక్షలు, రూ .3 లక్షల మధ్య తగ్గింది. తాజా నిర్ణయంతో ఈ ఇది రివర్స్ కానుంది. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. మరోవైపు ఈ సెస్ పెంపు నేపథ్యంలో మారుతీ, టాటా మోటార్స్ షేర్లు 1 శాతం చొప్పున ఎగిశాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. సెస్ పెంపు కారణంగా ఈ మేరకు పలు పెద్ద(విలాసవంత) కార్ల ధరలు పెరగనున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. అయితే సెప్టెంబర్ 9న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత దీనిపై నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం, అనంతరం పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది.