సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్‌టీ కింద నవంబర్ మాసంలో 27వ తేదీ వరకూ రూ 83,346 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అయితే అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు మొత్తం రూ 95,131 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్‌టీ కింద ఇప్పటివరకూ 96 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు నమోదుచేసుకోగా, వారిలో 15 లక్షల మంది కాంపోజిషన్ డీలర్లు.. వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే రిటన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం కేంద్ర జీఎస్‌టీ వాటా రూ58,556 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. జీఎస్‌టీ కింద ఆదాయం కోల్పోయిన రాష్ర్టాలకు పరిహార మొత్తాలను విడుదల చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment