బెంగళూరు : అమెజాన్‌కు మాత్రమే కాక ఫ్లిప్‌కార్ట్‌కు భారీగా నష్టాలు పెరిగిపోయాయి. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ పేరెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ లిమిటెడ్ రూ.8,771 కోట్ల నష్టాలను మూటకట్టుకున్నట్టు వెల్లడైంది. 2015-16లో ఈ నష్టాలు రూ.5,223 కోట్లగానే ఉన్నాయి. అంటే 67 శాతం మేర ఫ్లిప్‌కార్ట్ నష్టాలు పెరిగాయి. ఈ నష్టాలు పెరగడానికి ప్రధాన కారణం డిస్కౌంట్లు, మార్కెటింగ్‌పై ఎక్కువగా వెచ్చించడమేనని తెలిసింది. అమెజాన్‌కు తీవ్ర పోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ కూడా తన వెచ్చింపులను పెంచింది. కాగ, గతేడాది ముగింపు నాటికి ఫ్లిప్‌కార్ట్ రెవెన్యూలు రూ.19,854 కోట్లకు పెరిగాయని కూడా పేర్కొంది. వెంటనే అందుబాటులో ఉండే నగదు(క్యాష్ ఇన్ హ్యాండ్) కూడా 13 శాతం తగ్గిపోయి రూ.3,579 కోట్లగా ఉందని తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్/బాండ్స్‌లో పెట్టుబడులు 78 శాతం తగ్గిపోయాయని చెప్పింది. అడ్వర్‌టైజ్‌మెంట్, బిజినెస్ ప్రమోషన్ ఖర్చులు పెరిగాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఫ్లిప్‌కార్ట్ లిమిటెడ్ వెల్లడించింది.
అమెజాన్ తన తుది త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన అనంతరం, ఫ్లిప్‌కార్ట్ తన ఫైనాన్సియల్ నెంబర్లను విడుదల చేసింది. అమెజాన్‌కు కూడా అంతర్జాతీయ వ్యాపారాల నుంచి భారీగా 3 బిలియన్ డాలర్ల వరకు నష్టాలు వచ్చాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ నష్టాలు అంచనాలకు తగ్గట్టే వచ్చాయని తెలిసింది. 2018లో గ్రోసరీ, ఆఫ్‌లైన్ ఛానల్‌పై పెట్టుబడులపై ఎక్కువగా ఫోకస్ చేస్తుందని, మార్కెట్ షేరును దక్కించుకోవడానికి ఈ ఏడాది కూడా ఖర్చులను పెంచుతుందని ఫార్రెస్టర్ రీసెర్చ్ అనాలిస్ట్ సతీష్ మీనా తెలిపారు. ఫ్యాషన్ నుంచి ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌పోన్ల వరకు ప్రైవేట్ లేబుల్ బ్రాండ్ల కేటగిరీలపై తాము ఎక్కువగా ఫోకస్ చేస్తామని, వీటిలో మార్జిన్లు ఎక్కువగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. మూడేళ్లలో మొత్తంగా విక్రయాల వాల్యుమ్‌ను 15 నుంచి 20 శాతం పెంచుకున్నట్టు ఫ్లిప్‌కార్ట్ అంచనావేస్తోంది. నెలవారీ యాక్టివ్ యూజర్లపై కూడా ఫోకస్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment