దసరా, దీపావళి సీజన్‌లో లక్ష కోట్లు దాటిన అమెజాన్, ఫ్లిప్‌కార్టుల అమ్మకాలు
70 శాతం అమ్మకాలు గ్రామీణ భారతం నుంచే
ఏఐ టెక్నాలజీ ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌కు భారీగా డిమాండ్
లగ్జరీ వస్తువుల పైనే ఆసక్తి ∙ఈ కామర్స్ కన్సల్టెన్సీ డాటమ్ ఇంటెలిజెన్స్ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఈ పండుగల సీజన్‌లో అన్‌లైన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో దుమ్ము రేపాయి. దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం నెల రోజుల్లో లక్ష కోట్లకు పైగా ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిగాయి. దసరా దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈకామర్స్ కన్సల్టెన్సీ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ ఈ విషయాలు తెలిపింది. ఇదే సీజన్‌లో 2022లో రూ.69,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా, 2023లో రూ.81,000 కోట్లుకు చేరాయని, ఈ ఏడాది రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవలి దసరా సమయలో రూ.55,000 కోట్ల అమ్మకాలు జరిగితే దీపావళి సమయంలో మరో రూ.50,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు డాటమ్ పేర్కొంది.
నాన్ మెట్రో అమ్మకాలే అధికం
ఈసారి ఆన్‌లైన్ అమ్మకాల్లో నాన్ మెట్రో పట్టణాలు సత్తా చూపించాయి. మొత్తం అమ్మకాల్లో 85 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరిగినట్లు అమెజాన్ పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయంటే ఏ స్థాయిలో మొబైల్ ఫోన్లను కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్న లగ్జరీ స్మార్ట్ ఫోన్లపై యువత అత్యంత ఆసక్తిని కనబర్చినట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ వస్తువుల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదు కాగా, బ్రాండెడ్ లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాల్లో 400 శాతం వృద్ధి నమోదైంది. లగ్జరీ వాచీలు, డియోడరెంట్లు, హ్యాండ్‌బాగ్స్, స్పోర్ట్స్ వేర్, కిడ్స్‌వేర్ రంగాల్లో అమ్మకాలు అత్యధికంగా జరిగినట్లు డాటమ్ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment