diwali season
-
పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు
సాక్షి, అమరావతి: ఈ పండుగల సీజన్లో అన్లైన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో దుమ్ము రేపాయి. దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం నెల రోజుల్లో లక్ష కోట్లకు పైగా ఆన్లైన్ కొనుగోళ్లు జరిగాయి. దసరా దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈకామర్స్ కన్సల్టెన్సీ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ ఈ విషయాలు తెలిపింది. ఇదే సీజన్లో 2022లో రూ.69,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా, 2023లో రూ.81,000 కోట్లుకు చేరాయని, ఈ ఏడాది రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవలి దసరా సమయలో రూ.55,000 కోట్ల అమ్మకాలు జరిగితే దీపావళి సమయంలో మరో రూ.50,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు డాటమ్ పేర్కొంది.నాన్ మెట్రో అమ్మకాలే అధికం ఈసారి ఆన్లైన్ అమ్మకాల్లో నాన్ మెట్రో పట్టణాలు సత్తా చూపించాయి. మొత్తం అమ్మకాల్లో 85 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరిగినట్లు అమెజాన్ పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయంటే ఏ స్థాయిలో మొబైల్ ఫోన్లను కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్న లగ్జరీ స్మార్ట్ ఫోన్లపై యువత అత్యంత ఆసక్తిని కనబర్చినట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ వస్తువుల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదు కాగా, బ్రాండెడ్ లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాల్లో 400 శాతం వృద్ధి నమోదైంది. లగ్జరీ వాచీలు, డియోడరెంట్లు, హ్యాండ్‌బాగ్స్, స్పోర్ట్స్ వేర్, కిడ్స్‌వేర్ రంగాల్లో అమ్మకాలు అత్యధికంగా జరిగినట్లు డాటమ్ నివేదిక పేర్కొంది. -
సినిమా కలెక్షన్లకు దీపావళి దెబ్బ
సాధారణంగా పండుగ సీజన్లో సినిమాలు విడుదల చేస్తే బంపర్ కలెక్షన్లు వస్తాయని హీరోలందరూ తమ సినిమాలను పండుగల కోసం రిజర్వు చేసుకుంటారు. కానీ.. దీపావళి మాత్రం చాలామంది హీరోలకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా దీపావళికి ముందు వచ్చిన శుక్ర, శనివారాల్లో చాలా బ్రహ్మాండంగా వచ్చిన కలెక్షన్లు కూడా ఆదివారం, పండుగ కలిసి రావడంతో ఒక్కసారిగా తగ్గిపోయాయి. కుర్రాళ్లందరూ టపాసులు కాల్చుకునే సరదాలో ఉండి సినిమాలను పక్కన పెట్టేశారు. పగటి పూట కూడా లక్ష్మీపూజలు జరగడంతో సాధారణంగా ఆదివారం ఖాళీగా ఉండే వ్యాపార వర్గాలు కూడా సినిమాలకు వెళ్లలేదు. దాంతో కలెక్షన్లకు భారీగా గండి పడింది. ప్రస్తుతం బాలీవుడ్లో గట్టి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కూడా ఇదే దారిలో నడిచింది. విడుదలైన శుక్రవారం 13.30 కోట్లు, శనివారం 13.10 కోట్లు సాధించిన ఈ సినిమా.. ఆదివారం మాత్రం కేవలం 9.20 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారాంతంలో భారతదేశంలో కలెక్షన్లు 35.60 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఇది మంచి విజయం సాధించిందని, తొలి వారాంతంలో మొత్తం రూ. 41.05 కోట్ల కలెక్షన్లు సాధించి కరణ్ జోహార్, రణబీర్ కపూర్లకు హయ్యస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచిందని వివరించాడు. దీపావళి పూజలు, పండుగ కారణంగానే ఏ దిల్ హై ముష్కిల్, శివాయ్ రెండు సినిమాలకూ ఆదివారం ఏమాత్రం బాగోలేదని.. సోమ, మంగళవారాల్లో బిజినెస్ పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. #ADHM Fri 13.30 cr, Sat 13.10 cr, Sun 9.20 cr. Total: ₹ 35.60 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 #ADHM packs a SOLID PUNCH in intl markets... Opening weekend: $ 6.15 million [₹ 41.05 cr]... HIGHEST opening weekend for KJo and Ranbir. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 Diwali pooja and festivities made a dent in the biz of #ADHM and #Shivaay on Sun... Biz should witness an UPWARD TREND on Mon and Tue. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 -
పండుగ వేళ బంగారం వ్యాపారుల మోసాలు..
హైదరాబాద్: దీపావళీ పండుగ సందర్భంగా బంగారు వర్తకులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నట్టు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. బంగారం స్వచ్ఛత, తూకంలో దగా, నాణ్యత లేమి, తరుగు పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ప్రముఖ ఆభరణాలు, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 82కు పైగా కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర కంట్రోలర్, అదనపు డీజీపీ గోపాల్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిజిల్లాలో 9, నల్లగొండలో 4, వరంగల్‌లో 9, కరీంనగర్లో 14, నిజామాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 7, మెదక్‌లో 10, ఖమ్మం జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని వినియోగించి తయారు చేసిన ఆభరణాలను విక్రయిస్తునట్లు గుర్తించామన్నారు. -
బాణసంచా దుకాణాల వద్ద భద్రత ఎంత?
గుంతకల్లు టౌన్ : ప్రతి ఏడాది దీపావళి సీజన్లో ఎక్కడో ఓ చోట బాణ సంచా ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడడంలేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, వ్యాపారుల మామూళ్లకు తలొగ్గిబాణసంచా దుకాణాల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతిలిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పాతగర్ల్స్ హైస్కూల్ ఆవరణంలో లెసైన్సు కలిగిన 13 మంది వ్యాపారుల దుకాణాల ఏర్పాటుకు రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, పోలీసు శాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కేవలం 32 సెంట్ల విస్తీర్ణం కలిగిన పాఠశాల ఆవరణలో ఈ దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడి భద్రత విషయాన్ని విస్మరించారు. దుకాణాలకు సమీపంలో బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. అలాగే 20 దుకాణాలు కలిగిన మున్సిపల్ వాణిజ్య సముదాయాల్లో అత్యధికంగా పా దరక్షలు, వస్త్ర విక్రయాల దుకాణాలున్నా యి. 10 అడుగుల వెడుల్పు కలిగిన స్కూ ల్గేట్, అటువైపు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మరో చిన్న సందు మాత్రమే ఉంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తే బయటపడే మార్గమే లేదు. ఎవరి ‘ఆదాయా లు’ వారు చూసుకుంటున్నారని, ప్ర జల ప్రాణాలను పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప ట్టణ నడిబొడ్డున సువిశాలమైన రైల్వేగ్రౌండ్, 2 కిలోమీటర్ల దూరంలో మార్కెట్ యార్డు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు ఇష్టపడడం లేదు. మార్కెట్లో నాసిరకం టపాసులు : టపాసు ల వ్యాపారానికి సీమలో ప్రధాన కేంద్రమైన గుంతకల్లులో నాసిరకం టపాకాయల విక్రయాలు జోరందుకున్నాయి.ఐదు రెట్లు అధి క లాభాలు వస్తుండడంతో బ్రాండెడ్ కంపెనీలను పక్కన పెట్టి నాసిరకం టపాసులు తె చ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శివకాశీ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ 60:30 నిష్ఫ త్తి ప్రకారంగా హోల్‌సేల్ వ్యాపారులు నాసిరకం ఉత్పత్తులను జోడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లోకల్ మేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి మిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఉత్పత్తులు సరిగ్గా పేలకపోగా ప్రమాదాలు జరిగి అవకాశం ఉంది. నాణ్యత, భద్రత విషయంలో ఆయా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
కాశ్మీర్ పర్యాటకులకు దీపావళి ధమాకా.. 50% రాయితీ
గజగజ వణికించే చలిలో ఎవరైనా కాశ్మీర్ వెళ్లాలనుకుంటారా? అనుకోఉ కదూ. అందుకే.. ఈ చలికాలంలో కూడా జమ్ము కాశ్మీర్‌కు పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన ప్రకటన చేసింది. అక్కడ వసతి, రవాణా చార్జీలపై 50% రాయితీ ప్రకటించింది. ముఖ్యంగా ఈ దీపావళి సీజన్లోను, కుంకుమ పువ్వు ఉత్సవం సమయంలోను అక్కడ పర్యటించేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని కాశ్మీర్ పర్యాటక శాఖ మంత్రి జి.ఎ. మీర్ తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విసూ గ్రామంలో జరిగే కుంకుమ పువ్వు ఉత్సవానికి కావల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో మీర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ గ్రామంలోనే కుంకుమ పువ్వు ఎక్కువగా పండిస్తారు. ప్రైవేటు టూరిస్టు సర్వీసులు కూడా పర్యాటకులకు ఈ సీజన్లో వసతి, ప్రయాణాలపై రాయితీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.