గజగజ వణికించే చలిలో ఎవరైనా కాశ్మీర్ వెళ్లాలనుకుంటారా? అనుకోఉ కదూ. అందుకే.. ఈ చలికాలంలో కూడా జమ్ము కాశ్మీర్కు పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన ప్రకటన చేసింది. అక్కడ వసతి, రవాణా చార్జీలపై 50% రాయితీ ప్రకటించింది. ముఖ్యంగా ఈ దీపావళి సీజన్లోను, కుంకుమ పువ్వు ఉత్సవం సమయంలోను అక్కడ పర్యటించేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ విషయాన్ని కాశ్మీర్ పర్యాటక శాఖ మంత్రి జి.ఎ. మీర్ తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విసూ గ్రామంలో జరిగే కుంకుమ పువ్వు ఉత్సవానికి కావల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో మీర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ గ్రామంలోనే కుంకుమ పువ్వు ఎక్కువగా పండిస్తారు. ప్రైవేటు టూరిస్టు సర్వీసులు కూడా పర్యాటకులకు ఈ సీజన్లో వసతి, ప్రయాణాలపై రాయితీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కాశ్మీర్ పర్యాటకులకు దీపావళి ధమాకా.. 50% రాయితీ
Published Tue, Oct 22 2013 3:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement