ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) నిర్వహించే ‘శ్రీనగర్– గుల్‌మార్గ్– పహల్‌గావ్– శ్రీనగర్’ టూర్‌లో పర్యాటకులను మొదటి రోజు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పికప్ చేసుకుంటారు. ఈ పర్యటనలో శ్రీనగర్ షాలిమర్ తోటలు, శంకర్ నారాయణ్ టెంపుల్, గుల్‌మార్గ్ (గౌరీ మార్గ్), పహల్‌గావ్‌లోని కుంకుమ పువ్వు తోటల్లో విహారం, అవంతిపురా పర్యటన, థాజ్‌వాస్ గ్లేసియర్ తీరాన గుర్రపు స్వారీ, శ్రీనగర్‌లో శికారా రైడ్ ఉంటాయి. చివరి రోజు తిరిగి శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తారు.
ఇవి ఉండవు!
ఈ ప్యాకేజ్‌లో విమాన ప్రయాణ చార్జీలు కలిసి లేవు. శ్రీనగర్‌కు వెళ్లడానికి, శ్రీనగర్ నుంచి తిరిగి స్వస్థలం రావడానికి విమాన టిక్కెట్లను పర్యాటకులు సొంతంగా బుక్ చేసుకోవాలి. శ్రీనగర్‌లో దిగినప్పటి నుంచి తిరిగి విమానాశ్రయానికి చేర్చే వరకు రవాణా ప్యాకేజ్‌లో ఉంటుంది. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం డిన్నర్ కూడా ప్యాకేజ్‌లోనే.
ఈ పర్యటనకు ఏప్రిల్ నుంచి జూలై వరకు పీక్ సీజన్. జనవరి నుంచి మార్చి వరకు పీక్ సీజన్ కాకపోవడంతో పర్యాటకుల తాకిడి తక్కువ. ఆరు రోజుల (ఐదు రాత్రులు) ఈ ప్యాకేజ్‌లో ఒక్కరికి 35 వేలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 18 వేలవుతుంది. ముగ్గురు కలిసి వెళ్లినప్పుడు ఒక్కొక్కరికి 15 వేలకు మించదు. పీక్ సీజన్‌లో ప్యాకేజ్ చార్జ్‌లు మరో రెండు వేలు పెరుగుతాయి.
గమనిక: పర్యాటకులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డు ఉండాలి.
ప్యాకేజ్ పేరు ‘శ్రీనగర్– గుల్‌మార్గ్– పహల్‌గావ్- శ్రీనగర్ ప్యాకేజీ.
Comments
Please login to add a commentAdd a comment