సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు స్వర్గధామమైన జమ్మూ కశ్మీర్ తిరిగి ద్వారాలు తెరుచుకుందని, కోవిడ్ అనంతరం అన్ని పర్యాటకుల ప్యాకేజీలను పునరుద్ధరించినట్లు జమ్మూ కశ్మీర్ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అన్షునల్ హఖ్ చిస్తి తెలిపారు. పర్యాటక రంగంపై ఆధారపడిన జమ్మూ కశ్మీర్ 95 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, కోవిడ్ అనంతరం పునరుద్ధరించిన ప్యాకేజీల్లో ఇప్పటి వరకు పర్యాటకులు సందర్శించలేకపోయిన అనేక ప్రాంతాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజౌరి, జమ్మూ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో వివేక్ పూరీతో కలిసి పాల్గొన్నారు.
రానున్న మూడు నెలల్లో 75 వేడుకలను జమ్మూ కశ్మీర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులకు భద్రత, రక్షణ ఉంటుందని, భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా పర్యటించవచ్చని చెప్పారు. తెలుగు సినిమా షూటింగ్‌ల కోసం జమ్మూ, కశ్మీర్, లేహ్, లద్దాక్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన పర్యాటక స్థలాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తగ్గింపు ధరలతో ప్యాకేజీలను అందజేస్తోందన్నారు. సాజిద్ కిర్మాని, వాల్మీకి హరికృష్ణ పాల్గొన్నారు.
చదవండి: Luqma Kitchen: ‘సింగిల్’ క్వీన్స్ సాధించిన సక్సెస్
Comments
Please login to add a commentAdd a comment