బాణసంచా దుకాణాల వద్ద భద్రత ఎంత?
గుంతకల్లు టౌన్ :
ప్రతి ఏడాది దీపావళి సీజన్‌లో ఎక్కడో ఓ చోట బాణ సంచా ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడడంలేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, వ్యాపారుల మామూళ్లకు తలొగ్గిబాణసంచా దుకాణాల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతిలిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పాతగర్ల్స్ హైస్కూల్ ఆవరణంలో లెసైన్సు కలిగిన 13 మంది వ్యాపారుల దుకాణాల ఏర్పాటుకు రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, పోలీసు శాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
కేవలం 32 సెంట్ల విస్తీర్ణం కలిగిన పాఠశాల ఆవరణలో ఈ దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడి భద్రత విషయాన్ని విస్మరించారు. దుకాణాలకు సమీపంలో బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. అలాగే 20 దుకాణాలు కలిగిన మున్సిపల్ వాణిజ్య సముదాయాల్లో అత్యధికంగా పా దరక్షలు, వస్త్ర విక్రయాల దుకాణాలున్నా యి. 10 అడుగుల వెడుల్పు కలిగిన స్కూ ల్‌గేట్, అటువైపు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మరో చిన్న సందు మాత్రమే ఉంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తే బయటపడే మార్గమే లేదు.
ఎవరి ‘ఆదాయా లు’ వారు చూసుకుంటున్నారని, ప్ర జల ప్రాణాలను పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప ట్టణ నడిబొడ్డున సువిశాలమైన రైల్వేగ్రౌండ్, 2 కిలోమీటర్ల దూరంలో మార్కెట్ యార్డు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు ఇష్టపడడం లేదు.
మార్కెట్‌లో నాసిరకం టపాసులు : టపాసు ల వ్యాపారానికి సీమలో ప్రధాన కేంద్రమైన గుంతకల్లులో నాసిరకం టపాకాయల విక్రయాలు జోరందుకున్నాయి.ఐదు రెట్లు అధి క లాభాలు వస్తుండడంతో బ్రాండెడ్ కంపెనీలను పక్కన పెట్టి నాసిరకం టపాసులు తె చ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శివకాశీ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ 60:30 నిష్ఫ త్తి ప్రకారంగా హోల్‌సేల్ వ్యాపారులు నాసిరకం ఉత్పత్తులను జోడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
లోకల్ మేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి మిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఉత్పత్తులు సరిగ్గా పేలకపోగా ప్రమాదాలు జరిగి అవకాశం ఉంది. నాణ్యత, భద్రత విషయంలో ఆయా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.