లండన్:బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని బ్రిటన్ తన పౌరులకు సూచించింది. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉగ్రవాదుల దాడులతో పాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం,అత్యాచారం,భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్‌లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.
ఈ మేరకు బ్రిటన్ తాజాగా ఒక అడ్వైజరీ జారీ చేసింది.అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బంగ్లాదేశ్‌లో రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని తెలిపింది.
దేశంలో ఇస్లాం మతానికి చెందని వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపైన దాడులు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment