top-5
-
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్వర్క్ ‘లింక్డిన్’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్ ఒకటిగా ఉందని తెలిపింది. 2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్‌ను లింక్డెన్ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్‌లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్ జెడ్ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్ తెలిపింది. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్ నేర్చుకుంటామని లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్ గుర్తించింది’’అని లింక్డిన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా తెలిపారు. -
ఐదో ర్యాంక్‌కు సింధు
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరో సారి టాప్–5లోకి అడుగు పెట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు ఐదో స్థానంలో నిలిచింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె టాప్–5లోకి వెళ్లడం విశేషం. కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయం కారణంగా సింధు ఆటకు దూరమైంది. అయితే గాయంనుంచి కోలుకున్న ఆమె సోమవారమే హైదరాబాద్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సైనా నెహ్వాల్ ఒక స్థానం దిగజారి 33వ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ వరుసగా 8, 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ కూడా తమ 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
మారుతి దూకుడు: కొత్త రికార్డ్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి విశ్లేషకుల అంచనాలకనుగుణంగా దూసుకుపోతోంది. తాజాగా మారుతి సుజుకి కౌంటర్ బుధవారం మరో ఆల్ టైం రికార్డ్ స్థాయిని టచ్ చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రీత్యా టాప్-5 కంపెనీల్లో మారుతి ప్లేస్ కొట్టేసింది. మారుతీ సుజుకీ షేరు బీఎస్ఈలో తొలిసారి రూ. 10వేల మైలురాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) మరింత బలపడింది. రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. ఈ ఏడాది లో 83 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ ప్రధానంగా స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఆల్టో విక్రయాలతో దూసుకెళుతున్న మారుతి సరికొత్త వాహనాలతో కస్టమర్ల బేస్‌ను పెంచుకుంటోంది. వితారా బ్రెజా, ఇగ్నిస్, బాలెనో తదితర కొత్త మోడళ్లకు సైతం డిమాండ్ భారీగా ఉండడటంతో కార్ల మార్కెట్లో కంపెనీ వాటా 50 శాతానికి చేరింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రీత్యా ఐదో ర్యాంకును సొంతం చేసుకుంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రీత్యా రూ. 5.83 లక్షల కోట్లతో అగ్రస్థానం ఉన్న సంగతి విదితమే. ఇక రూ. 4.93 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో ర్యాంకులోనూ, రూ. 4.88 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడవ ర్యాంకు, రూ. 3.22 లక్షల కోట్లతో ఐటీసీ నాలుగో స్థానంలో నిలిచాయి. రూ.10వేల -
తొలిసారి టాప్-5 లోకి వెళ్లిన సానియా మీర్జా
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారి తన కెరీర్లో టాప్-5లోకి దూసుకెళ్లింది. డబ్ల్యుటీఏ డబుల్స్ ర్యాంకులను సోమవారం ప్రకటించింది. ఒకసారి మణికట్టుకు గాయం కావడంతో అప్పటినుంచి ఇబ్బంది పడుతున్న సానియా.. మళ్లీ పుంజుకుని తొలిసారి మంచి ర్యాంకు సాధించింది. సానియా మీర్జాతో పాటు జింబాబ్వేకు చెందిన ఆమె డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ వింబుల్డన్‌లో అత్యంత కీలకమైన 130 ర్యాంకింగ్ పాయింట్లు సాధించారు. దాంతో సానియా ఐదో ర్యాంకులోకి వెళ్లగలిగింది. తనకు మూడోసారి సర్జరీ అయిన తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడటం చాలా ఇబ్బంది అయ్యిందని, ఇప్పుడు మళ్లీ ఐదో ర్యాంకులోకి రాగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. సానియాకు టాప్-5 ప్లేయర్ అయ్యే సామర్థ్యం ఉందన్న విషయం తనకు ముందే తెలుసని, ఇప్పుడు ఆ ర్యాంకు సాధించిందని ఆమె కోచ్, తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పారు.