న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్‌వర్క్ ‘లింక్డిన్’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్ ఒకటిగా ఉందని తెలిపింది.
2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్‌ను లింక్డెన్ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్‌లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్ జెడ్ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్ తెలిపింది.
ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం
ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్ నేర్చుకుంటామని లింక్డ్‌ఇన్ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.
మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్ గుర్తించింది’’అని లింక్డిన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా తెలిపారు.
భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ
Published Fri, Aug 25 2023 3:48 AM | Last Updated on Fri, Aug 25 2023 3:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment