Indian techies
-
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్వర్క్ ‘లింక్డిన్’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్ ఒకటిగా ఉందని తెలిపింది. 2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్‌ను లింక్డెన్ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్‌లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్ జెడ్ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్ తెలిపింది. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్ నేర్చుకుంటామని లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్ గుర్తించింది’’అని లింక్డిన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా తెలిపారు. -
పెట్టుబడి పెట్టు.. ఈబీ–5 వీసా పట్టు
సాక్షి, అమరావతి: ఈబీ–5 వీసా.. ఇదీ ప్రస్తుతం అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణుల సరికొత్త తారకమంత్రం. అమెరికాలోని ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తుండటంతో ఆ దేశంలో కొనసాగేందుకు భారతీయ వృత్తి నిపుణులకు కనిపిస్తున్న మరో ప్రత్యామ్నాయం. అమెరికాలో వృత్తి నిపుణులుగా కొనసాగేందుకు ఆ దేశంలో పెట్టుబడిదారులుగా మారుతున్నారు. ఇందులో భాగంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ కేటగిరీలో ఈబీ–5 వీసాల కోసం అమెరికాలోని భారతీయులు అత్యధికంగా దరఖాస్తులు చేస్తున్నారని ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లో మన వాళ్ల పెట్టుబడులు.. ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంలో అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో హెచ్1బీ వీసా మీద ఆ దేశం వెళ్లిన భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలోనే కొనసాగాలంటే మరో కంపెనీల్లో ఉద్యోగం దక్కించుకోవాలి. అందుకు అవకాశాలు కూడా పెద్దగా లేకపోవడంతో భారతీయ వృత్తి నిపుణులు ఈబీ–5 వీసా కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అందుకోసం ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే కన్సల్టెన్సీలతో భాగస్వాములుగా మారుతున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కన్సల్టెన్సీలు కనీసం 20 మందిని ఓ గ్రూప్‌గా ఏర్పరచి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల అమెరికన్ డాలర్ల చొప్పున 16 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.131.39 కోట్ల) నిధిని సేకరిస్తున్నాయి. ఆ నిధులను వివిధ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేపడుతున్న రెంటల్ అపార్ట్మెంట్లు, భవనాలు, హోటళ్లు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతున్నాయి. ఆ విధంగా పెట్టుబడి పెడుతున్న వారు ఆ వ్యాపారంలో క్రియాశీలకంగా ఉండటంగానీ ప్రత్యక్షంగా ఎవరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరంగానీ లేదు. వారు పాసివ్ పెట్టుబడిదారులుగా ఉంటారు. పెట్టిన పెట్టుబడిపై వారికి వడ్డీ లభిస్తుంది కూడా. దాంతోపాటు పెట్టుబడిదారు హోదా దక్కుతుంది. ఆ హోదాపై ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేసి పొందుతున్నారు. ఆ వీసాపై అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు వారికి అవకాశం దక్కుతుంది. ఈబీ–5 వీసా కింద ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరికాలో నివసించేందుకు అవకాశముంది. పెరుగుతున్న ఈబీ–5 వీసాలు భారతీయులకు ఈబీ–5 వీసాల జారీ పెరుగుతోంది. 2019లో 756 మంది భారతీయులు ఈబీ–5 వీసాలు పొందగా.. 2022లో ఏకంగా 1,381 మందికి వీటిని జారీ చేయడం విశేషం. 2016తో పోలిస్తే ఈబీ–5 వీసాలు పొందిన భారతీయుల సంఖ్య 400 శాతం పెరిగింది. 2022లో అమెరికా మొత్తం 10,885 ఈబీ–5 వీసాలు జారీచేసింది. వాటిలో 1,381 వీసాలతో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో చైనా, మూడో స్థానంలో వియత్నాం ఉన్నాయి. ఇక 2023లో 14,200 ఈబీ–5 వీసాలు జారీచేయాలని యూఎస్సీఐఎస్ భావిస్తోంది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. -
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్‌లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
కొలువుపోయి కొత్త కష్టాలు! అమెరికాలో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరం
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దెబ్బకు దిగ్గజ టెక్ సంస్థలు భారీగా తీసివేతలకు దిగడంతో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నవంబర్ నుంచి ఏకంగా 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ సహా ఐటీ, సోషల్ మీడియా, ఆర్థిక సేవల సంస్థలు ఉద్యోగులను భారీగా తీసేస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం భారత టెకీలేనని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. వీరంతా హెచ్–1బీ, ఎల్1 వీసాల మీద అమెరికాలో పని చేస్తున్నావారే. 60 రోజుల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోకుంటే వీరిని స్వదేశానికి పంపించేస్తారు. లేదంటే హెచ్–1బీ, ఎల్1 నుంచి వేరే కేటగిరీకి మార్చుకోక తప్పని పరిస్థితి! ‘‘మూణ్నెల్ల కింద అమెరికా వచ్చా. మార్చి 20న తప్పుకోవాలని చెప్పేశారు. నేను సింగిల్ పేరెంట్ను. నా పరిస్థితేమిటి?’’ అంటూ అమెజాన్ ఉద్యోగి ఒకామె వాపోయారు. వీరికి మరింత గడువివ్వాలని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ భుతోరియా అన్నారు. పరస్పర సాయం... ఉన్నపళాన ఉద్యోగం కోల్పోయిన వారికి సాయపడేందుకు గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (జీఐటీపీఆర్ఓ) ముందుకొచ్చింది. వారికి, సంస్థలకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఉద్యోగ ఖాళీల ప్రకటనలను షేర్ చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్‌లో వందలాది భారత టెకీలు సభ్యులుగా ఉన్నారు. తొలి అమెరికాకు వచ్చిన వారి వీసా స్టేటస్ మార్చేందుకు సాయపడుతూ కొందరు వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్నారు. మరోవైపు పులి మీద పుట్రలా తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టేలా కన్పిస్తున్నాయి. ఈ టెకీలను మోదీ సర్కార్ తక్షణం ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలంటూ సోమవారం హిందీలో ట్వీట్‌చేశారు. -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్‌కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
భారత నిపుణుల చూపు కెనడా వైపు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలు, తదితర కాలం చెల్లిన ఇమిగ్రేషన్ విధానాల ఫలితంగా భారతీయ నిపుణులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు (శాశ్వత నివాస) హోదాను దేశాలవారీ కోటా ప్రకారం మంజూరు చేయడం కూడా ఇందుకు కారణమని తెలిపారు. హెచ్–1బీ వీసా గానీ, శాశ్వత నివాస హోదా పొందడం గానీ కెనడాతో పోలిస్తే అమెరికాలో కష్టతరమైన విషయం కాబట్టే ఇలా జరుగుతోందన్నారు. అమెరికాకు రావాల్సిన భారత నిపుణులు, విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపడాన్ని ఆపేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ అనుమతి కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగిత ఆధారంగా భారతీయులకు ఇచ్చే మూడు రకాలైన వీసాల సంఖ్యను ప్రస్తుతమున్న 9,15,497 నుంచి 2030కల్లా 21,95,795కు పెరిగేలా చూడాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువార్ట్ ఆండర్సన్ చెప్పారు. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదురుచూసే వారి సంఖ్యను 20 లక్షల నుంచి కనీస స్థాయికి తగ్గించాలంటూ ఆయన హౌస్ జ్యుడిషియరీ కమిటీలోని ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్ ఉపకమిటీ ఎదుట హాజరై తెలిపారు. అమెరికా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016–17, 2018–19 సంవత్సరాల్లో 25%పైగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అమెరికా వర్సిటీల్లోని ఫుల్‌టైమ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 75% మంది విదేశీయులు కాగా, వారిలో 2016–17లో మూడింట రెండొంతులు భారతీయులే ఉన్నారని ఆయన వివరించారు. అదే సమయంలో, కెనడాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 76,075 కాగా 2018 నాటికి ఇది 127% పెరిగి 1,72,625కు చేరిందని పేర్కొన్నారు. -
భారతీయ టెక్కీలకు భారీ ఊరట
వాషింగ్టన్: డాలర్ డ్రీమ్స్ కలలుకంటున్న భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. హెచ్1బీ సహా విదేశీ వర్కర్స్ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల గడువు మార్చి 31తో ముగిసింది. అధ్యక్షుడు అధ్యక్షుడు బైడెన్ ఆ నిషేధాన్ని మళ్లీ పొడిగిస్తూ ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయకపోవడంతో అమెరికాకు వెళ్లాలనుకునే వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్ హెచ్–1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు. తొలుత డిసెంబర్ 31వరకు నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. అమెరికాలో దీనిపై పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. హెచ్1బీపై నిషేధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, నిపుణులైన పనివారు దొరకరని కొందరు వాదిస్తే, తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు దొరకడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వీసాలపై నిషేధాన్ని కొనసాగించాలంటూ కొందరు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు బైడెన్‌కు లేఖలు కూడా రాశారు. కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, దాదాపుగా కోటి మంది అమెరికన్లు ఉద్యోగాల్లేకుండా ఉన్నారని అందుకే హెచ్–1బీలపై నిషేధం పొడిగించాల్సిందేనంటూ మిసౌరీ సెనేటర్ జోష్ హాలీ ఆ లేఖలో పేర్కొన్నారు. -
హెచ్1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తాం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలు అత్యధికంగా వినియోగించే హెచ్–1బీ తదితర వీసాలపై గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన త్రీ పాలసీ మెమొస్ విధానం కారణంగా ఏర్పడిన ప్రతికూలతను పరిష్కరిస్తామని జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాల్ని సవరించే అంశాలను పునఃపరిశీలిస్తామని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం ప్రకటించింది. జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్ సహా విదేశీ టెక్కీలకు భారీగా ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధిం చిన ఆంక్షలతో భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా చెల్లుబాటు కాలం, యాజమాన్యానికి, ఉద్యోగులకి మధ్య ఉన్న సంబంధాలు, విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. విదేశీయులకు కనీస వేతనం అమలు వాయిదా హెచ్1–బీ వీసా వినియోగదారులకు కూడా అమెరికన్లతో సమానంగా అధిక వేతనాన్ని చెల్లించాలంటూ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలును బైడెన్ సర్కార్ మే 14వరకు వాయిదా వేసింది. తక్కువ వేతనానికి భారతీయులు సహా ఇతర విదేశీయుల్ని పనిలోకి తీసుకోవడం వల్ల అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అయితే బైడెన్ నిర్ణయం అమలును వాయిదా వేయడంతో భారతీయ టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. -
చిగురిస్తున్న భారతీయుల ‘గ్రీన్’ ఆశలు
వాషింగ్టన్: అమెరికాలో సుదీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఏటా మంజూరు చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమి గ్రెంట్స్ యాక్ట్‌ని సెనేట్ ఆమోదించింది. అమెరికాకు వెళ్లే విదేశీయుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండడం, గ్రీన్ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఏళ్లకి ఏళ్లు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఈ బిల్లుని కొన్ని సవరణలతో సెనేట్ ఆమోదించడంతో ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అధ్యక్షుడు సంతకం చేస్తే చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తారు. ఏప్రిల్ నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 8 లక్షల మందికి పైనే. చైనాకు ఎదురు దెబ్బ తగిలేలా సవరణలు గత ఏడాది జూలై 10న ఎస్386 బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. అయితే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుకు చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసి సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలు చైనా నుంచి వచ్చిన వారికి ప్రతికూలంగా మారాయి. అమెరికాకు వచ్చిన చైనా విద్యార్థుల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పని చేసేవారే. అందుకే ప్రతినిధుల సభ ఈ బిల్లుని ఆమోదిస్తుందా అన్నది వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హెచ్1బీ నైపుణ్య వృత్తులకు బీ1 వీసాలొద్దు!
వాషింగ్టన్: భారతీయ టెక్కీలపై ప్రతికూల ప్రభావం చూపే మరో నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకోనుంది. హెచ్1బీ నైపుణ్య వృత్తుల వారికి తాత్కాలిక బిజినెస్ వీసాలను జారీ చేయకూడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఈ వీసా కింద కంపెనీలు ఆన్సైట్ జాబ్ విధానంలో పరిమిత కాలానికి టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సాధించేందుకు పలు ఇతర విధానాలున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలపై పడే దుష్ప్రభావాన్ని ఈ ప్రతిపాదన తొలగిస్తుందని, హెచ్1బీ వీసా నియమాల అమలులో పారదర్శకత లభిస్తుందని స్పష్టం చేసింది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పలు భారతీయ టెక్నాలజీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. గతంలో, భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్‌పై బీ1 వీసాల జారీకి సంబంధించి ఆరోపణలు వచ్చిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది. సుమారు 500 మంది ఉద్యోగులను వీసా నిబంధనలకు విరుద్ధంగా.. హెచ్1బీపై కాకుండా బీ1 వీసాలపై యూఎస్‌లో ఉద్యోగాలు కల్పించిందనే ఆరోపణలపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఇన్ఫోసిస్‌కు 8 లక్షల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా, తమ ఉద్యోగుల వేతన భారాన్ని భరించలేకపోతున్నామని, ఆ భారం నుంచి తమకు రక్షణ కల్పించాలని అమెరికాకు చెందిన ఒక ఆర్కిటెక్చర్ కంపెనీ కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆ కంపెనీ తమ వద్ద ఉన్న అమెరికన్ ఆర్కిటెక్ట్‌లను తొలగించి.. ఆ స్థానంలో చవకగా విదేశీ ఆర్కిటెక్చర్ సంస్థ నుంచి విదేశీ ఆర్కిటెక్ట్‌ల సేవలను పొందాలని భావిస్తుందేమో. కానీ, ఆ విదేశీ ఉద్యోగులకు కూడా హెచ్1బీ నిబంధనల ప్రకారం ఇక్కడి ఆర్కిటెక్ట్ సేవలకు ఇచ్చే వేతనాన్నే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, అమెరికన్ల ఉద్యోగాల రక్షణకు కాంగ్రెస్ రూపొందించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది’ అని వివరించింది. -
భారత టెకీల్లో ‘హెచ్1బీ’ గుబులు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ స్థానికులను ప్రసన్నం చేసుకొనేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనల పేరుతో విసిరిన రాజకీయ కార్డు అగ్రరాజ్యంలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వీసాల రెన్యువల్‌తోపాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుత మున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడి కంపెనీలకు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తాజా ఉత్తర్వుల వల్ల భారీ నష్టం జరగనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలకు కూడా ఈ ఉత్తర్వులు గండి కొడతాయని అంటున్నారు. మనోళ్లకు గడ్డుకాలమే... తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కనీస వార్షిక వేతన పరిమితి ఏకంగా 45 శాతం పెంపుతోపాటు కంపెనీ ఉద్యోగులు, కన్సల్టెన్సీ ఉద్యోగుల వీసాల రెన్యువల్ కాలపరిమితిలో మార్పు, రెన్యూవల్ ఫీజు పెంపు, అమెరికాలో ఐటీ సంబంధిత అడ్వాన్స్డ్ డిగ్రీ పూర్తి చేసినవారికే వీసాలివ్వాలనే నిబంధనలు ఉండటం భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేయనున్నాయి. ఇకపై హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు 1.10 లక్షల డాలర్ల కనిష్ట వార్షిక వేతనం ఉంటేనే వీసా పొందడానికి అర్హత పొందుతారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 65 వేల డాలర్లుంటేనే వీసాకు దరఖాస్తు చేసుకొనే అవకాశముండేది. ఈ నిబంధనల అమలు వల్ల సగం మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురుకానుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ సామాజిక అధ్యయనాల సంస్థ సర్వే ప్రకారం హెచ్1బీ వీసాపై అమెరికాలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 56 శాతం మంది... అంటే దాదాపు 3.5 లక్షల మంది ఏటా 67 వేల నుంచి లక్ష డాలర్లలోపు వార్షిక వేతనం పొందుతున్నారు. వారిలో 2.80 లక్షల మంది భారతీయ ఐటీ ఉద్యోగులే ఉన్నారు. తాజా నిబంధనలతో వారంతా ప్రస్తుత వీసా గడువు ముగిశాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారి వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉండాల్సిందే. వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉన్న ఉద్యోగుల వీసా కాలపరిమితిలోనూ మార్పులు జరిగాయి. ఇంత మొత్తంలో వేతనం ఉన్నప్పటికీ వారు నేరుగా కంపెనీ ఉద్యోగులు అయితేనే వీసాను మూడేళ్లపాటు రెన్యువల్ చేయనున్నారు. అదే కన్సల్టెన్సీల ద్వారా కంపెనీలకు పనిచేసే వారి వీసాలను మాత్రం కేవలం ఏడాదికే ఇవ్వనున్నారు. ఈ నిబంధనల అమలు అమెరికన్ ఐటీ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను అందించే దాదాపు 65 వేల కన్సల్టెన్సీ సంస్థలకూ నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమవుతుంది? ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయ సమీక్ష ముందు నిలవదనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రొఫెసర్ రెజినా డిక్షన్ మాట్లాడుతూ ‘ట్రంప్ పాలనా యంత్రాంగం తెచ్చిన కొత్త ప్రతిపాదనలు న్యాయ సమీక్ష ముందు నిలుస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అమెరికాలో స్థానికంగా ఐటీ నిపుణులు దొరకడమన్నది అంత తేలికైన విషయం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఉంటే కంపెనీలు ఇతర దేశాలకు తరలే ప్రయత్నాలు తప్పక చేస్తాయి’అని అభిప్రాయపడ్డారు. నెల జీతం వీసా ఖర్చుకే..! తాజా నిబంధనలతో ఏటా వీసాలు రెన్యువల్ చేసుకోవాల్సి రావడం కన్సల్టెన్సీ ఉద్యోగులకు భారం కానుంది. ఒక్కసారి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే వీసా ఫీజు, అటార్నీ ఖర్చులన్నీ కలిపి 7–8 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఏటా దాదాపు ఒక నెల జీతం వీసా ఖర్చుకే సరిపోతుందన్నమాట. ఇక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకూ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అశనిపాతంగా మారనుంది. గురువారం నుంచి అమల్లోకి వచ్చిన వీసా నిబంధనల ప్రకా రం అమెరికాలో అడ్వాన్స్డ్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ అయినవారికి, అది కూడా ఐటీ చదువులు చదివినవారికే వీసాలు జారీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినవారిని ఐటీ ఉద్యోగాలకు అనుమతించరు. అమెరికాలో ఏదో ఒక ఎంఎస్ డిగ్రీ చేసి ఐటీ ఉద్యోగం చేయొచ్చనుకొనే వారి ఆశలు గల్లంతైనట్లే. సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయి నవారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఐటీ సబ్జెక్టులు చదవనివారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు దొరకబుచ్చుకున్నా వారికి ఇకపై హెచ్1బీ వీసా ఇవ్వడం కుదరదు. ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 3 లక్షల మందిలో సగం మంది ఐటీయేతర గ్రాడ్యుయేట్ కోర్సు ల్లోనే ఉన్నారు. తాజా నిబంధనలతో వారి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. (చదవండి: ‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు) -
హెచ్1 బీ వీసా : టెకీలకు మరో షాక్
వాషింగ్టన్ : ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దృష్టిపెట్టారు. హెచ్1బీ వీసాలను పరిమితం చేసే లక్ష్యంలో భాగంగా ట్రంప్ సరికొత్త ఆదేశాలతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం స్థానికీకరణ, అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు. యుఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్1బీ వీసా కు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన ముఖ్యమైన సంస్కరణ ఇది అని లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే (గురువారం ఉదయం) అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ, ఈ నిర్ణయం హెచ్1 బీ వీసాల పిటీషన్లలో మూడవ వంతు ప్రభావితం చేయనుందని విశ్లేషకుల అంచనా. కొత్త ఆంక్షల్లో మూడు ప్రధాన అంశాలు ఇది స్పెషాల్టీ నిర్వచనాన్ని తగ్గిస్తుంది. అమెరికన్ల స్థానంలో ఇతర ఐటీ నిపుణులు అవసరమని నిరూపించేందుకు, హెచ్1బీ వీసా జారీ చేసేందుకు అదనపు డాక్యుమెంటేషన్ అవసరం.ఐటీ నిపుణుల నియామాలకోసం ఆధారపడే థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ కంపెనీలపై స్క్రూట్నీ మరింత పెంపు హెచ్1బీ వీసా జారీ ముందు, ఆ తరువాత వర్క్‌సైట్ తనిఖీకి, సమ్మతికి డీహచ్ఎస్ కు ఎక్కువ అధికారాలు అంతేకాదు ఈ తాజా రూల్ ఈ నియమం హెచ్1బీ వీసా ఉద్యోగాలను కనీస వేతన స్థాయిలను కూడా మార్చే అవకాశం ఉంది. ఇది భారతీయ టెక్ నిపుణులను, టెక్ సంస్థలను భారీగా ప్రభావితం చేస్తుందని, హెచ్1బీ వీసా పొందడం మరింత కఠినం చేస్తుందని అంచనా. అయితే తాజా నిబంధనలపై టెక్ సంస్థలనుంచి వ్యాజ్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్1 బీ వీసాలను పరిమితం చేసే గతంలో ట్రంప్ సర్కార్ ఆంక్షల అమలును నిలిపివేస్తూ ఫెడరల్ కోర్టులు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారత్ టెక్కీలకు కాస్త ఊరట లభించింది. హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ప్రయాణం ఆంక్షల్ని ట్రంప్ సర్కార్ స్వల్పంగా సడలించింది. వీసాల నిషేధానికి ముందు పనిచేసిన యాజమాన్యాల దగ్గరే తిరిగి ఉద్యోగాలు లభిస్తే విదేశీ వర్కర్లని అమెరికా రావడానికి అనుమతినిచ్చినట్టు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు వీసా ప్రయాణాల ఆంక్షల్ని సవరించింది. అమెరికాలో మళ్లీ పాత ఉద్యోగాలే దొరికితే ఉద్యోగితో పాటు, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా అమెరికాకి రావచ్చునని విదేశాంగ విడుదల చేసిన ట్రావెల్ అడ్వయిజరీలో స్పష్టం చేసింది. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో హెచ్–1బీ, ఎల్–1 ఇతర వీసాదారులు అమెరికాలో అడుగు పెట్టకుండా జూన్ 22న అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కాపాడడానికే ఈ ఆంక్షలు వి«ధించినట్టు అప్పట్లో ట్రంప్ వెల్లడించారు. దీనిని ప్రముఖ టెక్కీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ సడలింపులు చేస్తున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. అదే ఉద్యోగమైతే వీసాల మంజూరు అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో తిరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయి, మళ్లీ ఇప్పుడు అదే సంస్థలో, అదే ఉద్యోగాన్ని పొందితే అమెరికా రావడానికి వీసాలు జారీ చేస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా కరోనా వైరస్‌పై పోరాటానికి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారు, ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న వారిని కూడా ఆంక్షల నుంచి మినహాయించింది. ఐటీ సంస్థలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా హెచ్–1బీ వీసాలపై పూర్తి స్థాయి ఆంక్షల్ని వ్యతిరేకించడం వల్ల ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. -
హెచ్1బీ : ఐటీ నిపుణులకు మరో షాక్
వాషింగ్టన్ : భారతీయ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీయులు ప్రధానంగా హెచ్1బీ వీసా హోల్డర్ల నియామకాలను నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇటీవల హెచ్1బీ సహా ఇతర వర్క్ వీసాల జారీ ప్రక్రియపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించిన సుమారు నెలరోజుల తరువాత కీలకమైన ఎన్నికల సమయంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా ట్రంప్ ఈ కీలక అడుగు వేశారు. అమెరికన్లను ఉద్యోగాల్లో నియమించుకునేలా ఈ ఆర్డర్ పై సంతకం చేస్తున్నానని ట్రంప్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ప్రకటించారు. అమెరికన్లకు ఉద్యోగాలు అనేదానికి తాము కట్టుబడి ఉన్నామని, చవకైన విదేశీ ఉద్యోగుల పేరుతో అమెరికన్లకు నష్టం జరుగుతోంటే తమ ప్రభుత్వం సహించదని ట్రంప్ స్పష్టం చేశారు. తాజా నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి దెబ్బేనని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకే తమ ప్రాధాన్యత అని హెచ్1బీ రెగ్యులేషన్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నామని ట్రంప్ ప్రకటించారు. నిపుణులైన అమెరికన్ల స్థానంలో ‘చౌక’గా పనిచేసే విదేశీ సిబ్బందిని తాము అనుమతించమని తెలిపారు. హెచ్1బీ వీసాలను అత్యున్నత నైపుణ్యమున్న అమెరికా సిబ్బందికి వర్తింపజేస్తామన్నారు. తద్వారా అమెరికన్ పౌరులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేయడం ముఖ్యంగా మహమ్మారి సంక్షోభ సమయంలో నష్టదాయకమని ఇది ఇప్పటికే మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలను నష్టపోయారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ ఏడాది చివరివరకు హెచ్1బీతోపాటు ఇతర అన్ని రకాల విదేశీ వర్క్ వీసాలను సస్పెండ్ (రద్దు) చేస్తూ గత జూన్ 23న ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
భారత ఐటీ నిపుణుల నెత్తిన పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ /వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలకు సంబంధించి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా దేశంలో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయికి చేరడంతోపాటు, వలసలను నిరోధించడానికి ఈ నిర్ణయంవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు, ఉద్యోగాల్లో అమెరిన్లకే ప్రాధాన్యత లభిస్తుందని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్టు మీడియా నివేదికల సారాంశం. హెచ్1బీ వీసా, ఇతర వర్క్ వీసాలను నిలిపివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీని ప్రకారం హెచ్ 1బీ వీసాతో పాటు, హెచ్ 2బీ వీసా, జే1, ఎల్1 వీసాలను కూడా నిలిపివేయవచ్చు. దీంతో సుమారు లక్ష మందికి పైగా ప్రభావితం కానున్నారని తెలిపింది. అయితే ఇప్పటికే హెచ్1బీ వీసా ఉన్నవారు ప్రభావితం అయ్యే అవకాశం లేదని పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఈ నిషేధం ఎత్తివేసేంతవరకు భారతీయ ఐటీ నిపుణుల 'గ్రేట్ అమెరికన్ డ్రీం'కు చెక్ పడినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే హెచ్1బీ వీసాదరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుండి 20వేల డాలర్లకు పెంచే ప్రతిపాదననకూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోపాటు ఒబామా తీసుకొచ్చిన హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అనుమతినిచ్చే హెచ్4 వీసాలపైకూడా బ్యాన్ విధించాలని భావిస్తోందట. అమెరికన్ నిపుణులు, ఇతర ఉద్యోగార్ధులు, ముఖ్యంగా వెనుకబడిన, తక్కువ వయస్సు గల అమెరికా పౌరులను రక్షించడానికి కెరీర్ నిపుణుల వివిధ సూచనలను పరిశీలిస్తోందని, ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వైట్ హౌస్ ప్రతినిధి హొగన్ గిడ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. -
వేలాడుతున్న హెచ్1బీ కత్తి!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : అమెరికా వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అర్హతతో ఉద్యోగం చేస్తున్న దాదాపు 68 వేల మంది భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మూడేళ్ల కాలవ్యవధి కోసం ఇచ్చే ఓపీటీ ఈ ఏడాదితో పూర్తి కానుండటమే దీనికి కారణం. ఇప్పటికే రెండుసార్లు హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ ఏప్రిల్ చివరి అవకాశం. అప్పటికీ వీసా రాకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి పీహెచ్‌డీలో చేరడం (అన్ని అర్హతలు ఉంటే)లేదా ఎంఎస్‌లో మరో కోర్సు చేయడమే ప్రత్యామ్నాయం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తిరిగి ఎంఎస్‌లో చేరడానికి సుముఖంగా లేరు. ఒకవేళ వీసా రాకపోతే భారత్ తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. 2015–16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి ఉన్నత విద్య కోసం వెళుతున్న వారి సంఖ్య రెట్టింపు కావడమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంప్యూటర్ రంగంలో పని చేసేవారికి అమెరికా ఏటా 85 వేల మందికి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తోంది. కానీ, భారత్ నుంచి ఉన్నత విద్యకు వెళ్లి ఆపైన హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ ఏడాది భారతీయుల సంఖ్య 1.5 లక్షలు దాటుతుందని న్యూయార్క్‌కు చెందిన హెచ్1బీ వ్యవహారాల నిపుణుడు అటార్నీ నీల్ ఏ వెయిన్‌రిచ్ అంచనా వేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్య 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని, వారిలో 65 నుంచి 70 వేల మందికి మాత్రమే వీసాలు దక్కుతాయని చెబుతున్నారు. చదవండి : కూలిన మార్కెట్, 12వేల దిగువకు నిఫ్టీచదవండి హెచ్1బీ ఉన్న వారి కోసం వేట.. వీసా సమస్య నుంచి బయటపడేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారిని జీవిత భాగస్వాములను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసా ఉన్న వారి సంబంధాలు చూడాలని భారత్‌లో తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. హెచ్1బీ వీసా కలిగి ఉండి (గ్రీన్‌కార్డు కోసం వెయిటింగ్లో ఉంటే) జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం వెయిటిం గ్లో లేని హెచ్1బీ వీసా అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో చట్ట బద్ధంగా ఉండేందుకు అవకాశముంది. ఇప్పుడు భారత్‌లో మ్యారేజ్ బ్యూరోలు దీన్నో లాభసాటి వ్యాపారంగా మలుచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 24 వేల మంది! ఓపీటీ గడువు దాటుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉంటారని అంచనా. నిర్ణీత గడువులో వీసా రాకపోతే స్వదేశానికి వెళ్లి మళ్లీ హెచ్1బీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేని భారతీయ టెకీలు అక్కడే ఉండేం దుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ‘డబుల్ డిగ్రీ ఓ ప్రయాస. మా విశ్వవిద్యాలయంలో డబుల్ కోర్సు చేసిన అనేక మంది విద్యార్థులు చివరికి వారికి తగిన ఉద్యోగాలు రాక కెనడా, అస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లారు. ఉద్యోగం కోసమే అమెరిక వస్తే సమస్యలు తప్పవు’అని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా (బర్క్లీ) కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఎరిక్ అలెన్ బ్రూవర్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం వస్తున్న వారు ఉపాధి అవకాశాలను లక్ష్యం చేసుకుని వస్తున్నారా లేదా విజ్ఞానం పెంపొందించుకోవడానికి వస్తున్నారా అనే దానిపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇటీవల ముంబైలో యూనివర్సిటీ అఫ్ సదరన్ కాలిఫోర్నియ ప్రొఫెసర్ బారీ విలియమ్స్ అన్నారు. హెచ్1బీ రాకపోతే భారత్‌కు వెళ్లిపోతా.. 2015లో అమెరికా వచ్చి అలబామ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశా. 2017లో ఓపీటీ కార్డు రావడంతో శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరా. 2018, 2019లో హెచ్1బీ కోసం దరఖాస్తు చేశా. లాటరీలో నా దరఖాస్తు పిక్ కాలేదు. ఈ ఏడాదైనా లాటరీలో పిక్ అవుతుందన్న ఆశతో ఉన్నా. లేదంటే భారత్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా.– గాయం రామాంజనేయరెడ్డి, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా పీహెచ్‌డీలో చేరుతా.. ఈ ఏప్రిల్‌లో నాకు హెచ్1బీ వీసా రాకపోతే పీహెచ్‌డీలో చేరుదామని అనుకుంటున్నా. ఒక్లహమా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం షికాగోలో సిస్టమ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటికీ 2 సార్లు నా దరఖాస్తు రిజెక్ట్ అయ్యింది. ఈసారి కూడా అదే జరిగితే ఉద్యోగం ద్వారా ఇప్పటిదాకా సంపాదించి దాచుకున్న మొత్తాన్ని పీహెచ్డీ కోసం ఖర్చు చేస్తా. తిరిగి ఇండియా వెళ్లాలన్న ఆలోచన లేదు.– వల్లబ్‌రెడ్డి సతీశ్, కోదాడ, నల్లగొండ జిల్లా అమెరికాలో పరిస్థితులు మారాయి.. ఇప్పటికే 2 సార్లు లాటరీలో నాకు అవకాశం రాలేదు. ఈ ఏప్రిల్‌లో రాకపోతే ఇండియా తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. హెచ్1బీ వీసా మరింత కష్టమవుతుంది. ఐటీ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. నాలుగైదేళ్లలోనే పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఒక్క ఉద్యోగానికి ఐదారుగురు తెలుగు టెకీలే పోటీ పడుతున్నారు.– ఈలి అనసూయ, ద్వారకానగర్, విశాఖపట్నం -
గ్రీన్‌కార్డ్ కోటా ఎత్తేస్తే..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతీయులకు మంచిరోజులు రానున్నాయి. అమెరికా కాంగ్రెస్ ముందున్న ‘ఫెయిర్‌నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్’బిల్లు చట్టరూపం దాల్చితే ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారత సాంకేతిక నిపుణులు వచ్చే మూడేళ్లలోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. దాదాపు 3 లక్షల మంది భారతీయ టెకీలు దశాబ్దం కాలంగా హెచ్1–బీ వీసాలపై ఆధారపడి పని చేస్తున్నారు. ఏటేటా హెచ్1–బీ కోసం దరఖాస్తుచేయడం, అది ఆమోదం పొందేదాకా ఒత్తిడికి గురవడం వంటి సమస్యలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో భారత్, చైనా తదితర దేశాలనుంచి వచ్చి అమెరికాలో వర్క్ వీసాలపై పని చేస్తున్న లక్షలాది మందికి మూడేళ్లలోనే శాశ్వత నివాసం దక్కుతుందని న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనం స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ లభించని కారణంగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తుందని, తాజా బిల్లును ఆమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే ఐటీ నిపుణులకు మంచి వేతనాలు లభిస్తాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే ఈ ఏడాది జూన్ నాటికి గ్రీన్‌కార్డుల జారీలో కోటా విధానం రద్దు కావచ్చని అక్కడి వార్తా సంస్థలు చెపుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి దరఖాస్తులకు మోక్షం అమెరికాలో శాశ్వత నివాసానికి దేశాలవారీ కోటా అమలు చేస్తుండటంతో భారతీయులు పదేళ్ల నుంచి వేచిచూడాల్సి వస్తోంది. 2009 నాటి దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి క్లియర్ చేసే పనిలో యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఏటా 1.40 లక్షల మందికి గ్రీన్‌కార్డులు జారీచేస్తుంది. ఈ లెక్కన భారతదేశానికి చెందిన 9,800 మందికి మాత్రమే శాశ్వత నివాస హోదా దక్కుతోంది. భారత్, చైనా కాకుండా అమెరికాలో హెచ్1–బీ, ఇతర వృత్తి నిపుణుల వీసాపై పని చేస్తున్న ఇతరదేశాల వారికి సులువుగా గ్రీన్‌కార్డ్ వస్తోంది. 2000కు ముందు భారతీయులకు మూడునాలుగేళ్లలోనే గ్రీన్‌కార్డు దక్కేది. కానీ, అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున్న వారి సంఖ్య పెరగడంతో.. 2002 నుంచి గ్రీన్‌కార్డుల కోసం వేచి చూసే భారతీయుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. యుఎస్సీఐఎస్ అందించిన సమాచారం ప్రకారం గతేడాది మార్చి నాటికి 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 3,06,601 మంది భారతీయులే కావడం గమనార్హం. 2018 డిసెంబర్ నాటికి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల సంఖ్య మరో 59 వేలు పెరిగి 4,54,025కు చేరుకోగా.. ఇందులో 3,35,650 మంది భారతీయులే అందులోనూ మెజారిటీ ఐటీ నిపుణులే. చట్టరూపం దాల్చితే ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ముందున్న ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే మొదటి ఏడాదిలోనే దాదాపు లక్ష మంది భారతీయ ఐటీ నిపుణులు శాశ్వత నివాస హోదా పొందుతారు. ఈ లెక్కన మరో మూడునాలుగేళ్లలో గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూస్తున్న భారతీయులందరికీ.. శాశ్వత నివాస హోదా దక్కడం దాదాపు ఖాయమే. 2018 నాటికి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ 2022నాటికి గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. అయితే, 2015 నుంచి ఏటా 2లక్షల మంది అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెడుతున్న నేపథ్యంలో వారందరికీ వర్క్ వీసాలు లభిస్తే 2025 నుంచి మళ్లీ బ్యాక్లాగ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం లేదా శాశ్వత నివాస హోదా కోసం అమెరికా వెళ్లాలనుకుంటే అసాధారణమైన తెలివితేటలుండాలని వారంటున్నారు. జీఆర్ఈ 312 కంటే ఎక్కువ, టోఫెల్ స్కోర్ 100 దాటేవారికి మంచి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయని, 310 అంతకంటే తక్కువ జీఆర్ఈ, 90 కంటే తక్కువ టోఫెల్ స్కోర్‌తో వస్తున్న వారు ఇబ్బందులు పడుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 25ఏళ్లు భారత్‌లోనూ ఐటీ ఉద్యోగాలకు ధోకా ఉండదని, ఖర్చులు తగ్గించుకోవడం కోసం అనేక ముఖ్యమైన కంపెనీలు మానవ వనరులు అత్యధికంగా ఉన్న భారత్‌లో కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఫీచర్డ్ ఆన్ స్లేట్ (అమెరికా) ప్రెసిడెంట్ ఇగోర్ మార్కోవ్ అభిప్రాయపడ్డారు. మంచి వేతనాలొస్తాయ్! శాశ్వత నివాస హోదా దక్కితే కంపెనీలపై ఆధారపడే అగత్యం తప్పుతుందని, మంచి వేతనాలు లభిస్తాయని ఆమెరికా ఆర్థిక నిపుణులంటున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఆర్థిక పరిపుష్టతతోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారంటున్నారు. ప్రస్తుతం కంపెనీలు స్పాన్సర్ చేస్తేనే గ్రీన్‌కార్డ్ దరఖాస్తును యుఎస్సీఐఎస్ ఆమోదిస్తుంది. ఉద్యోగి ఏ కారణాల వల్ల వైదొలగినా అతని గ్రీన్‌కార్డ్‌ను వెనక్కి తీసుకునే అధికారం కంపెనీలకు ఉంటుంది. దీంతో ఇబ్బంది ఎందుకన్న భావనలో ఐటీ నిపుణులు ఒకే సంస్థలో తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ఒక్కసారి శాశ్వత నివాస హోదా వస్తే సదరు ఉద్యోగి స్వేచ్చగా ఏ కంపెనీలో అయినా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
భారత్ టెకీలపై మరో పిడుగు..!
అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలపై మరో పెద్ద పిడుగు పడనుంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) వర్క్ పర్మిట్ల తొలగింపుతో పాటు హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దిశలో చర్యలు తీసుకోనున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, తాజా పరిణామాలు మాత్రం వాటిని నిజం చేసే విధంగానే ఉన్నాయి. వీటి ప్రభావం వేలాది మంది భారతీయులపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో బరాక్ ఒబామా హయాంలో హెచ్-1బి వీసాహోల్డర్ల జీవితభాగస్వాముల (భార్య లేదా భర్త)కు అక్కడ పనిచేసేందుకు చట్టం ద్వారా కల్పించిన ఈ అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చిట్టాలో చేర్చుతోంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు చట్టపరంగా పనిచేసేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు ఇప్పటివరకు వర్క్ పర్మిట్లు ఉపయోగపడుతూ వచ్చాయి. అయితే తాజాగా వీటి రద్దు ప్రణాళికలకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తుదిరూపునిస్తోంది. ఈ విషయాన్ని శాసనకర్తలకు (సెనెటర్లు) అమెరికా పౌరసత్వం, వలస సేవల (యూఎస్సీఐఎస్) డైరెక్టర్ ప్రాన్సిస్ సిస్నా వెల్లడించారు. వచ్చే ఆగస్టుకల్లా దీనిని అమల్లోకి తెచ్చే విషయంపై కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ కావచ్చని తెలుస్తోంది. ‘ అమెరికాలో హెచ్-4 డిపెండెంట్ భాగస్వాములు ఉద్యోగం చేసేందుకు కల్పించే అధికారం రద్దుకు అవసరమైన మార్పులు తీసుకొచ్చే ఫ్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ పాత ఉత్తర్వుల స్థానంలో ప్రస్తుత ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో అమెరికా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు ప్రతిపాదిస్తాం. దీనికి సంబంధించి ఇచ్చే నోటీస్, దానిపై స్పందించేందుకు ఇచ్చే నిర్ణీత కాలంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది ’ అని సిస్నా స్పష్టంచేశారు. గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షకు పైగా హెచ్-4 వీసాహోల్డర్లు లబ్దిపొందారు. హెచ్ 1బి భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు అనుమతినిస్తూ హెచ్-4 వీసాలు ఇచ్చారు. వీరిలో భారత అమెరికన్ల సంఖ్యే ఎక్కువ. అక్కడ శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డ్) కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు పదేళ్లు, అంతకుపైగానే సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసా హోల్డర్ల భార్య లేదా భర్త ఉద్యోగం చేసేందుకు వీలుగా వర్క్ పర్మిట్ల జారీకి ఒబామా ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధననే రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. హెచ్-4 ఏమిటీ ? అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసా ద్వారా వర్క్ పర్మిట్ లభిస్తుంది. వీటి ద్వారా మనదేశానికి చెందిన వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్-4 వీసాపై దాదాపు లక్ష మంది వరకు భారతీయులు ఆ దేశంలోనే ఉంటున్నారు. 2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలివ్వగా వాటిలో భారతీయులు 1,17,522 మంది (86శాతం), చైనీయులు 4,770 మంది (3 శాతం), మెక్సికన్లు 2,066 మంది (2 శాతం) కి వర్క్‌పర్మిట్లకు అనుమతినిస్తూ పత్రాలు జారీ చేసినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. గతేడాది మొదట్లో హెచ్-4 వీసాతో పనిచేసేందుకు అనుమతి పొందిన వారిలో 94 శాతం మంది మహిళలున్నారు. వారిలోనూ భారతీయులు 93 శాతం, చైనా నుంచి కేవలం నాలుగు శాతమే ఉన్నారు. హెచ్-1బి క్రమబద్ధీకరణ విదేశాలకు చెందిన ఉత్తమ మేథాశక్తి, నైపుణ్యాలను ఆకర్షించే లక్ష్యంతో హెచ్-1బి వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. ఈ వీసాల కోసం మనదేశ టెకీలు అత్యధికంగా పోటీపడుతున్న నేపథ్యంలో వీటి జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలుగా వీసాల జారీ సంఖ్యపై నియంత్రణ, లాటరీ విధానంలో మార్పులకు తెరతీయనుంది. దీనితో పాటు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికే ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక వృత్తి అంటే ఏమిటన్న దానిపై గతంలో ఇచ్చిన నిర్వచనాలకు భిన్నంగా స్పష్టమైన వివరణనిస్తారు. అంటే సాంకేతికంగానూ, ఉన్నత డిగ్రీల పరంగానూ అత్యున్నతస్థాయిలో ఉన్న విదేశీయులకు అవకాశం కల్పిస్తారు. అమెరికన్ ఉద్యోగులు, వారికిచ్చే వేతనాలు పరిరక్షించడంలో భాగంగా ఉద్యోగం, యజమాని, ఉద్యోగి సంబంధాలపై స్పష్టతనిస్తారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కృత్రిమ మేథతో మారుతున్న టెకీల తీరు
సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఏఐ)తో ఈ ఏడాది భారత్‌లో కంపెనీలన్నీ నవ్యతకు పెద్దపీట వేస్తున్నాయి. ఏఐ ప్రభావంతో ఈ ఏడాది 98 శాతం కంపెనీలు నూతన పనితీరుతో ముందుకెళ్లడమే అజెండాగా నిర్ధారించుకున్నాయని గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్ పేరిట మెర్సర్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. రాబోయే రోజుల్లో మానవ నైపుణ్యాలతో పాటు వినూత్న ఏఐ నైపుణ్యాలు, డిజిటల్ సాంకేతికతలే తమ వ్యాపారాలను దీటుగా నడిపిస్తాయని పలు సంస్థలు సర్వేలో పేర్కొన్నాయి. కంపెనీలు, ఉద్యోగులు మనుగడ కోసం నైపుణ్యాలను మెరుగుపరుచుకోక తప్పదని సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు చెప్పినట్టు నివేదిక తెలిపింది. మరోవైపు సగానికి పైగా భారత టెకీలు తమ ప్రస్తుత ఉద్యోగం పట్ల సంతృప్తిగానే ఉన్నా కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఆయా సంస్థలను విడిచివెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారని మెర్సర్స్ కెరీర్ బిజినెస్ ప్రెసిడెంట్ ఇల్యా బొనిక్ తెలిపారు. పనివేళల్లో వెసులుబాటును అత్యధిక ఉద్యోగులు కోరుకుంటుడటం గమనార్హం. ఉద్యోగ ఎంపికలో పనివేళలకే తమ ప్రాధాన్యతని 92 శాతం మంది ఉద్యోగులు చెప్పారని సర్వే పేర్కొంది.