![No work permits for H-1B visa spouses: Donald Trump to scrap Obama-era rule - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/24/h1b-visa.jpg.webp?itok=JrsjLNpe)
సాక్షి, వాషింగ్టన్: హెచ్1 బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరోసారి షాక్ ఇవ్వనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు చర్యలు చేపట్టనున్నారు. హెచ్1-బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయకుండా నిరోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఒక టాప్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి చెప్పారు.
ఈ షాకింగ్ నిర్ణయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నాటి నిబంధనలకు స్వస్తి పలకాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ వేసవి తరువాత ఈ నిబంధనను రద్దు చేయాలని యోచిస్తోందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐఎస్) డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా సెనేటర్ చుక్ గ్రాస్లేకు అందించిన ఒక లేఖలో తెలిపారు. దీంతో ఇప్పటికే వీసా జారీలో కఠిన నిబంధనలతో భారత ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేసిన టంప్ తాజా చర్య అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులపై విధ్వంసకర ప్రభావాన్ని చూపనుందని నిపుణుల అంచనా. హెచ్-4 వీసాపై పనిచేస్తున్న 7వేల మంది భారతీయ ఐటీ నిపుణులను దెబ్బతీయనుంది. ప్రపంచం వ్యాప్తంగా 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్స్ రద్దు కానుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment