
భారత టెకీలే టార్గెట్...
ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికాలో ఇటీవల జరిగిన సమీక్షా భేటీలో భారతీయ కంపెనీలు, ఉద్యోగులను టార్గెట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ వీసాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో చాలా మందికి అవసరమైన నైపుణ్యాలు లేవని హెచ్1బీ, ఎల్ 1 వర్కర్లను ఇంటర్వ్యూ చేసే అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. టెక్నాలజీ కంపెనీలో పనిచేసే మరో అమెరికన్ భారత ఉద్యోగులపై అసహనం వెళ్లగక్కాడు. వీసా ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వీటికి చెక్ పెట్టేందుకు వీసా ఫీజును భారీగా పెంచాలని అమెరికాకు సలహా ఇచ్చాడు. ఇమిగ్రేషన్ విధానాలపై అత్యంత గోప్యంగా సాగే సమీక్షా సమావేశం వివరాలు బయటకు పొక్కడంపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.