హెచ్-1బీ వీసా నిబంధనలు సడలింపు
ఎఫ్-1 స్టూడెంట్ వీసాను హెచ్-1బీ వీసాగా మార్చుకునే అవకాశం
భారతీయులకు ఎక్కవగా ప్రయోజనం చేకూరే అవకాశం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.
హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్‌డేట్స్
F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.
దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.
అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది.
వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.
గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.
కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.
H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment