భారత టెకీలకు మళ్లీ బ్యాడ్‌న్యూస్‌ | H-1B visa regime is likely to get tougher | Sakshi
Sakshi News home page

భారత టెకీలకు మళ్లీ బ్యాడ్‌న్యూస్‌

Published Mon, Dec 25 2017 9:30 AM | Last Updated on Wed, Sep 26 2018 6:40 PM

H-1B visa regime is likely to get tougher - Sakshi

బెంగళూరు : అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దేశీయ టెకీ నిపుణులకు మరో బ్యాడ్‌న్యూస్‌. హెచ్1‌-బీ వీసాను కఠితనతరం చేసేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు హెచ్1‌-బీ పిటిషనర్ల ఎంపిక ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను అమల్లోకి రాబోతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ఫ్రాగోమెన్స్‌ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసిన తాజా సమాచారం మేరకు 2011లోని ప్రతిపాదనను డీహెచ్‌ఎస్‌ పునరుద్ధరించాలని సంకేతాలు ఇచ్చింది. ఈ పునరుద్ధరణతో హెచ్‌-1బీ క్యాప్‌ లాటరీ కోసం హెచ్1‌-బీ పిటిషనర్లు ముందస్తుగా రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్‌ మెంబర్లను సొంతం చేసుకున్న తర్వాత మాత్రమే క్యాప్‌ పిటిషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

హెచ్1‌-బీ క్యాప్‌ మెంబర్లను జారీచేసేటప్పుడు కూడా ప్రాధాన్యత ప్రక్రియను చేపట్టాలని డీహెచ్‌ఎస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌ 'బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ప్రకారం హెచ్‌1-బీ క్యాప్‌ మెంబర్లను జారీచేసేటప్పుడు అధిక మొత్తంలో చెల్లించే, ఎక్కువ ప్రతిభావంతులకు మాత్రమే ప్రాధాన్యత ఇ‍వ్వనున్నట్టు తన అప్‌డేట్‌లో పేర్కొంది. అంతేకాక హెచ్1‌-బీ వీసాదారుల భాగస్వామ్యులు అమెరికాలో పనిచేసేందుకు వీలు లేకుండా నిబంధనలు తీసుకురావాలని కూడా ట్రంప్‌ ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని డీహెచ్‌ఎస్‌ అధికారికంగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం వెనువెంటనే హెచ్‌1-బీ పిటిషనర్ల ఎంపికలో కూడా కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం భారత టెకీలకు, సంస్థలకు మరింత ప్రతికూలంగా మారబోతుంది. హెచ్1‌-బీ వీసాలు, నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాల యూజర్లలో దేశీయ ఐటీ సంస్థలే అతిపెద్దవి. ఈ నిబంధనలు కఠినతరమవడం ఇటు భారతీయు ఐటీ సంస్థలకు షాకింగ్‌ నిలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement