వేగంగా ఉద్యోగాలు లభించేలా నిబంధనల్లో మార్పులు
భారతీయులు భారీగా లబ్ధి పొందే అవకాశం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద వేగంగా ఉపాధి పొందాలనుకునే భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వేగంగా ఉపాధి కల్పించేందుకు వీలుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్–1బీ వీసా నిబంధనల్లో కీలకమార్పులు చేసింది. దీంతో హెచ్–1బీ వీసా పొందడం మునపటితో పోలిస్తే అత్యంత సులభంకానుంది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం.
నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది.
థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది.
జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం.
దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు. ‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.
భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?
యూఎస్‌సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్‌డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది.
ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి.
దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధి స్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మా ర్పులు తెచ్చారు. దీంతో నాన్‌ప్రాఫిట్, గవర్న మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రా ధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment