అదొక చెత్త స్టడీ: మండిపడ్డ ఐటీ నిపుణుడు
అదొక చెత్త స్టడీ: మండిపడ్డ ఐటీ నిపుణుడు
Published Fri, Apr 21 2017 12:17 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
భారత టెక్కీల సత్తాను తక్కువ చేస్తూ వచ్చిన అధ్యయనంపై ఐటీ ఇండస్ట్రి ప్రముఖుడు, మాజీ ఇన్ఫోసిస్ టాప్ బాస్ టీవీ మోహన్ దాస్ పాయ్ మండిపడ్డారు. 95 శాతం మంది భారత ఇంజనీర్లు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారంటూ వెల్లడించిన యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనాన్ని ఆయన ఖండించారు. అదొక్క చెత్త అధ్యయనమని అభివర్ణించారు.భారత టెక్కీల సామర్థ్యాలకు పాయ్ తన మద్దతు పలికారు. యాస్పైరింగ్ మైండ్స్ విడుదల చేసిన సర్వేలో 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలకు పనికిరారని, కేవలం 4.77 శాతం మంది మాత్రమే ఒక ప్రోగ్రామ్‌కు సరైన కోడ్ రాయగలుగుతున్నారని పేర్కొంది.
ఈ అధ్యయనంపై పాయ్ ట్విట్టర్ ద్వారా తన అభ్యంతరాన్ని తెలిపారు. టీవీ మోహన్ దాస్ పాయ్ అభిప్రాయానికి తాను కూడా మద్దతు పలుకుతున్నానని మరో బిజినెస్ లీడర్ కిరణ్ మజుందర్ షా కూడా తెలిపారు.వారు ఎక్కడి నుంచి ఇంజనీర్ల సామర్థ్యాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారో తెలియదన్నారు. బ్లూ కాలర్ వర్కర్లు కూడా భవిష్యత్తు కోడర్స్ అని ఆమె పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో కూడా చాలా మంది ఇంజనీర్లకు ట్రైనింగ్ లేదనే విషయాన్ని కూడా పాయ్ ఖండించారు. దేశీయ ఐటీ నిపుణుల సామర్థ్యాలపై ఆయన విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. 60-65 శాతం మందికి ట్రైనింగ్ లేదనేది చాలా తప్పు అని చెప్పారు. అది చాలా తప్పుడు ప్రకటనన్నారు.
Advertisement