సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఏఐ)తో ఈ ఏడాది భారత్‌లో కంపెనీలన్నీ నవ్యతకు పెద్దపీట వేస్తున్నాయి. ఏఐ ప్రభావంతో ఈ ఏడాది 98 శాతం కంపెనీలు నూతన పనితీరుతో ముందుకెళ్లడమే అజెండాగా నిర్ధారించుకున్నాయని గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్ పేరిట మెర్సర్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. రాబోయే రోజుల్లో మానవ నైపుణ్యాలతో పాటు వినూత్న ఏఐ నైపుణ్యాలు, డిజిటల్ సాంకేతికతలే తమ వ్యాపారాలను దీటుగా నడిపిస్తాయని పలు సంస్థలు సర్వేలో పేర్కొన్నాయి. కంపెనీలు, ఉద్యోగులు మనుగడ కోసం నైపుణ్యాలను మెరుగుపరుచుకోక తప్పదని సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు చెప్పినట్టు నివేదిక తెలిపింది.
మరోవైపు సగానికి పైగా భారత టెకీలు తమ ప్రస్తుత ఉద్యోగం పట్ల సంతృప్తిగానే ఉన్నా కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఆయా సంస్థలను విడిచివెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారని మెర్సర్స్ కెరీర్ బిజినెస్ ప్రెసిడెంట్ ఇల్యా బొనిక్ తెలిపారు. పనివేళల్లో వెసులుబాటును అత్యధిక ఉద్యోగులు కోరుకుంటుడటం గమనార్హం. ఉద్యోగ ఎంపికలో పనివేళలకే తమ ప్రాధాన్యతని 92 శాతం మంది ఉద్యోగులు చెప్పారని సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment