తొలిసారి టాప్-5 లోకి వెళ్లిన సానియా మీర్జా | Sania Mirza enters top-5 for first time in her career | Sakshi
Sakshi News home page

తొలిసారి టాప్-5 లోకి వెళ్లిన సానియా మీర్జా

Published Mon, Jul 7 2014 10:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

తొలిసారి టాప్-5 లోకి వెళ్లిన సానియా మీర్జా

తొలిసారి టాప్-5 లోకి వెళ్లిన సానియా మీర్జా

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారి తన కెరీర్లో టాప్-5లోకి దూసుకెళ్లింది. డబ్ల్యుటీఏ డబుల్స్ ర్యాంకులను సోమవారం ప్రకటించింది. ఒకసారి మణికట్టుకు గాయం కావడంతో అప్పటినుంచి ఇబ్బంది పడుతున్న సానియా.. మళ్లీ పుంజుకుని తొలిసారి మంచి ర్యాంకు సాధించింది. సానియా మీర్జాతో పాటు జింబాబ్వేకు చెందిన ఆమె డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ వింబుల్డన్లో అత్యంత కీలకమైన 130 ర్యాంకింగ్ పాయింట్లు సాధించారు. దాంతో సానియా ఐదో ర్యాంకులోకి వెళ్లగలిగింది.

తనకు మూడోసారి సర్జరీ అయిన తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడటం చాలా ఇబ్బంది అయ్యిందని, ఇప్పుడు మళ్లీ ఐదో ర్యాంకులోకి రాగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. సానియాకు టాప్-5 ప్లేయర్ అయ్యే సామర్థ్యం ఉందన్న విషయం తనకు ముందే తెలుసని, ఇప్పుడు ఆ ర్యాంకు సాధించిందని ఆమె కోచ్, తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement