career best
-
KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్..
''వరుసగా విఫలమవుతున్న అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు''.. ''టీమిండియాకు భారంగా తయారయ్యాడు.. జట్టు నుంచి తొలగిస్తే మంచిది''.. ''ఐపీఎల్లో మాత్రమే మెరుస్తాడు.. జాతీయ జట్టు తరపున అతను ఆడడు''.. ''అతనొక ఐపీఎల్ ప్లేయర్.. అవకాశాలు వ్యర్థం''.. ఇవన్నీ నిన్న మొన్నటి వరకు కేఎల్ రాహుల్‌పై వచ్చిన విమర్శలు. కానీ ఇవాళ టీమిండియా కష్టాల్లో ఉంటే అదే కేఎల్ రాహుల్ ఆపద్భాందవుడయ్యాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ తనలోని అసలు సిసలైన బ్యాటర్‌ను వెలికి తీసిన కేఎల్ రాహుల్ తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాను చేసింది 75 పరుగులే కావొచ్చు.. కానీ ఆ ఇన్నింగ్స్ ఒక సెంచరీతో సమానం. ఎందుకంటే 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్ ఈసారి ఎలాగైనా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాలనుకున్నాడేమో. దానిని చేసి చూపించాడు. ఒత్తిడిలో ఆడినప్పుడే అసలైన బ్యాటర్ వెలుగులోకి వస్తాడనే దానికి నిర్వచనంలా మిగిలిపోయింది రాహుల్ ఇన్నింగ్స్. అంత క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. అతని ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్కటి తప్పుడు షాట్ లేకపోవడం విశేషం. అర్థసెంచరీ సాధించేంత వరకు కూడా కేఎల్ రాహుల్ ఒక్క సిక్సర్ కూడా కొట్టేలేదంటే బ్యాటింగ్ ఎంత కష్టంగా ఉందో చెప్పొచ్చు. మొత్తంగా 90 బంతులాడిన రాహుల్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 75 పరుగులు చేశాడు. అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ టీమిండియా అభిమానులకు కొంతకాలం పాటు గుర్తుండిపోవడం ఖాయం. తన చెత్త ప్రదర్శనతో జట్టులో చోటునే ప్రశ్నార్థకంగా మార్చుకున్న రాహుల్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ పెట్టి మరో పది మ్యాచ్‌ల వరకు తనపై వేలెత్తి చూపకుండా చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే హీరో అవుతాడని అంటుంటారు.. మరి ఎంత కాదన్నా ఇవాళ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హీరోనే కదా. An excellent knock from @klrahul here in Mumbai when the going got tough!#TeamIndia 22 runs away from victory. Live - https://t.co/8mvcwAwwah #INDvAUS @mastercardindia pic.twitter.com/Ct4Gq1R1ox — BCCI (@BCCI) March 17, 2023 చదవండి: IND Vs AUS: రాహుల్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్.. తొలి వన్డే టీమిండియాదే -
కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్.. అందనంత ఎత్తులో సూర్యకుమార్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్య తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టి20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ 890 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు 836 పాయింట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్, రిజ్వాన్‌ల మధ్య వ్యత్యాసం 54 పాయింట్లుగా ఉంది. ఇక టీమిండియాతో సిరీస్‌లో ఆకట్టకున్న కివీస్ బ్యాటర్ డెవన్ కాన్వే ఒక స్థానం ఎగబాకి 788 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోగా.. బాబర్ ఆజం 778 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్‌తో సిరీస్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్యా 50వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 650 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ 11వ స్థానంలో ఉండగా.. కివీస్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష్‌దీప్ సింగ్ ఒకస్థానం ఎగబాకి 21వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చహల్ 8 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. ఇక 704 పాయింట్లో లంక స్పిన్నర్ హసరంగా తొలి స్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 🔹 Suryakumar Yadav continues to shine 🔹 A host of Australia stars make big gains The latest movements on the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️ https://t.co/3WOEsj9HrQ — ICC (@ICC) November 23, 2022 చదవండి: అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా జాతీయ గీతం పాడనందుకు ఆటగాళ్లను చంపాలనుకున్నారు..! -
ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర..
టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు(7.2-3-19-6) నమోదు చేశాడు. మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురిని డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. మరో ముగ్గురిని తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా పలు అరుదైన రికార్డులు సాధించాడు. ►టీమిండియా తరపున వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఐదో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు స్టువర్ట్ బిన్నీ( 2014లో బంగ్లాదేశ్‌పై 6/4), అనిల్ కుంబ్లే (1993లో వెస్టిండీస్‌పై 6/12), ఆశిష్ నెహ్రా(2003లో ఇంగ్లండ్‌పై, 6/23), కుల్దీప్ యాదవ్( 201లో ఇంగ్లండ్‌పై, 6/25).. తాజాగా బుమ్రా(6/19)తో వీరి సరసన చేరాడు. ►ఇక ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాటింగ్హమ్ వేదికగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై 6/25తో మెరిశాడు. ఇక టీమిండియా తరపున ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో పేసర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో ఆశిష్ నెహ్రా (6/23, 2003లో) తొలి పేసర్‌గా ఉన్నాడు. ►ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో పేస్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు వకార్ యూనిస్(2001లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై 7/36), విన్స్టన్ డేవిస్(1983లో లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాపై 7/51), గారీ గాలిమోర్(1975లో ఇంగ్లండ్‌పై 6/14).. తాజాగా బుమ్రా ఇంగ్లండ్‌పై 6/19తో మెరిశాడు. ►ఒక వన్డే మ్యాచ్‌లో టీమిండియా తరపున అన్ని వికెట్లు సీమర్లే తీయడం ఇది ఆరోసారి. ఇంతకముందు 1983లో ఆస్ట్రేలియాపై, 1983లో వెస్టిండీస్‌పై, 1997లో పాకిస్తాన్‌పై, 2003లో సౌతాఫ్రికాపై, 2014లో బంగ్లాదేశ్‌పై.. తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అన్ని వికెట్లు భారత్ సీమర్లే తీశారు. ►ఇక ఇంగ్లండ్‌కు వన్డేల్లో టీమిండియాపై ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2006లో జైపూర్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 125 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. టీమిండియా తరపున మూడో బౌలర్‌గా -
ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్నేసి వికెట్లు రెండోసారి
అడిలైడ్: గతంలా మాదిరిగా రాణించలేకపోతున్న 34 ఏళ్ల స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. 18 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతనికిది 8వ టెస్టు మ్యాచ్. కంగారూల దేశంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది రెండోసారి. 2015 సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు ఇచ్చిన అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియాలో అశ్విన్ టెస్టు క్రికెట్ ఉత్తమ గణాంకాలు 149 పరుగులకు 6 వికెట్లు. మరో మూడు రోజుల ఆట మిగిలిఉండటం.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుండటంతో ఈ పింక్ బాల్ టెస్టులోనే అతని బెస్ట్ మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి. భారత్ బాటలోనే వారు కూడా తొలి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసిన టీమిండియా మరుసటి రోజు ఉదయం ఎక్కువసేపు నిలవలేకపోయింది. మరో 11 పరుగులు మాత్రమే చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో 244 పరుగుల వద్ద కోహ్లి సేన తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. అయితే, ఆస్ట్రేలియాతో తొలిసారి పింక్‌బాల్‌తో ఆడుతూ తడబడిన భారత బ్యాట్స్‌మెన్ మాదిరిగానే.. జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ దెబ్బకు ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ కూడా బెంబేలెత్తారు. ముఖ్యంగా స్పిన్నర్ అశ్విన్ కీలకమైన స్టీవ్ స్మిత్ వికెట్ తీసి తన జోరు ప్రారంభించాడు. అనంతరం ట్రావీస్ హెడ్, కామెరూన్ గ్రీన్‌ను పెవిలియన్ పంపించాడు. రెండోరోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా మరోసారి బంతిని అందుకున్న అశ్విన్ నాథన్ లయన్ వికెట్ తీయడంతో కంగారూ జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా రెండు, ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లతో రాణించారు. స్టార్క్ రనౌట్ అయ్యాడు. -
తొలిసారి టాప్-5 లోకి వెళ్లిన సానియా మీర్జా
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారి తన కెరీర్లో టాప్-5లోకి దూసుకెళ్లింది. డబ్ల్యుటీఏ డబుల్స్ ర్యాంకులను సోమవారం ప్రకటించింది. ఒకసారి మణికట్టుకు గాయం కావడంతో అప్పటినుంచి ఇబ్బంది పడుతున్న సానియా.. మళ్లీ పుంజుకుని తొలిసారి మంచి ర్యాంకు సాధించింది. సానియా మీర్జాతో పాటు జింబాబ్వేకు చెందిన ఆమె డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ వింబుల్డన్‌లో అత్యంత కీలకమైన 130 ర్యాంకింగ్ పాయింట్లు సాధించారు. దాంతో సానియా ఐదో ర్యాంకులోకి వెళ్లగలిగింది. తనకు మూడోసారి సర్జరీ అయిన తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడటం చాలా ఇబ్బంది అయ్యిందని, ఇప్పుడు మళ్లీ ఐదో ర్యాంకులోకి రాగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. సానియాకు టాప్-5 ప్లేయర్ అయ్యే సామర్థ్యం ఉందన్న విషయం తనకు ముందే తెలుసని, ఇప్పుడు ఆ ర్యాంకు సాధించిందని ఆమె కోచ్, తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పారు.