టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు(7.2-3-19-6) నమోదు చేశాడు. మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురిని డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. మరో ముగ్గురిని తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా పలు అరుదైన రికార్డులు సాధించాడు.
►టీమిండియా తరపున వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఐదో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు స్టువర్ట్ బిన్నీ( 2014లో బంగ్లాదేశ్‌పై 6/4), అనిల్ కుంబ్లే (1993లో వెస్టిండీస్‌పై 6/12), ఆశిష్ నెహ్రా(2003లో ఇంగ్లండ్‌పై, 6/23), కుల్దీప్ యాదవ్( 201లో ఇంగ్లండ్‌పై, 6/25).. తాజాగా బుమ్రా(6/19)తో వీరి సరసన చేరాడు.
►ఇక ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాటింగ్‌హమ్ వేదికగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై 6/25తో మెరిశాడు. ఇక టీమిండియా తరపున ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో పేసర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో ఆశిష్ నెహ్రా (6/23, 2003లో) తొలి పేసర్‌గా ఉన్నాడు.
►ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో పేస్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు వకార్ యూనిస్(2001లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై 7/36), విన్‌స్టన్ డేవిస్(1983లో లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాపై 7/51), గారీ గాలిమోర్(1975లో ఇంగ్లండ్‌పై 6/14).. తాజాగా బుమ్రా ఇంగ్లండ్‌పై 6/19తో మెరిశాడు.
►ఒక వన్డే మ్యాచ్‌లో టీమిండియా తరపున అన్ని వికెట్లు సీమర్లే తీయడం ఇది ఆరోసారి. ఇంతకముందు 1983లో ఆస్ట్రేలియాపై, 1983లో వెస్టిండీస్‌పై, 1997లో పాకిస్తాన్‌పై, 2003లో సౌతాఫ్రికాపై, 2014లో బంగ్లాదేశ్‌పై.. తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అన్ని వికెట్లు భారత్ సీమర్లే తీశారు.
►ఇక ఇంగ్లండ్‌కు వన్డేల్లో టీమిండియాపై ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2006లో జైపూర్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 125 పరుగులకే ఆలౌట్ అయింది.
చదవండి: Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. టీమిండియా తరపున మూడో బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment