ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్య తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టి20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ 890 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు 836 పాయింట్లు ఉన్నాయి.
తొలి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్, రిజ్వాన్‌ల మధ్య వ్యత్యాసం 54 పాయింట్లుగా ఉంది. ఇక టీమిండియాతో సిరీస్‌లో ఆకట్టకున్న కివీస్ బ్యాటర్ డెవన్ కాన్వే ఒక స్థానం ఎగబాకి 788 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోగా.. బాబర్ ఆజం 778 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్‌తో సిరీస్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్యా 50వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 650 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.
ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ 11వ స్థానంలో ఉండగా.. కివీస్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష్‌దీప్ సింగ్ ఒకస్థానం ఎగబాకి 21వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చహల్ 8 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. ఇక 704 పాయింట్లో లంక స్పిన్నర్ హసరంగా తొలి స్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
🔹 Suryakumar Yadav continues to shine
— ICC (@ICC) November 23, 2022
🔹 A host of Australia stars make big gains
The latest movements on the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️ https://t.co/3WOEsj9HrQ
చదవండి: అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా
Comments
Please login to add a commentAdd a comment