తండ్రిని హతమార్చిన తనయుడు
నిందితుడి అరెస్ట్
శామీర్‌పేట్: చీర కారణంగా చెలరేగిన వివాదం తల్లి, కుమార్తె మధ్య ఘర్షణకు దారితీయగా అడ్డు వచ్చిన తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, శామీర్‌పేట, పెద్దమ్మ కాలనీలో హన్మంతు (50), పెద్దమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
బుధవారం తల్లి, కుమార్తెకు చీర విషయమై గొడవ జరిగింది. ఈ విషయంలో తండ్రి హన్మంతు, పెద్దకొడుకు నర్సింహ జోక్యం చేసుకోవడంతో వారి మధ్య ఘర్షకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తండ్రిపై రోకలిబండతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు పంచనామా నిర్వహించారు.
నిందితుడి రిమాండ్...
శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment